సాయి రెడ్డికి డోర్స్ ఓపెన్ ?

తాను ఇంకా చేతిలో మూడున్నరేళ్ల పదవీ కాలం ఉండగా రాజ్య సభకు విజయసాయిరెడ్డి రాజీనామా చేయడం చిత్రమే.;

Update: 2026-01-21 03:32 GMT

విజయసాయిరెడ్డి ఈయన పేరుకు ముందు కానీ వెనక కానీ జగన్ అన్న పేరు లేకపోతే అసలు ఊహించలేరు. అంతలా జగన్ తో బంధం పెనవేసుకున్న వారు ఆయన. నిజం చెప్పాలీ అంటే జగన్ తో పాటుగా పదహారు నెలల పాటు జైలు జీవితాన్ని ఆయన కూడా అనుభవించారు వైఎస్సార్ ఫ్యామిలీ మెంబర్ అని విజయసాయిరెడ్డిని చెప్పుకుంటారు. రాజారెడ్డి, వైఎస్సార్ వైఎస్ జగన్ ఇలా మూడు తరాల వారితో పనిచేసిన అనుభవం విజయసాయిరెడ్డికి ఉంది. అలాంటి విజయసాయిరెడ్డి వైసీపీని వీడిపోతారని ఎవరూ అనుకోలేదు, కలలో సైతం ఆయన గురించి అలా ఊహించి ఉండరు, కానీ జరిగిపోయింది. అదే రాజకీయం అంటే కూడా.

పదవికీ పార్టీకి :

తాను ఇంకా చేతిలో మూడున్నరేళ్ల పదవీ కాలం ఉండగా రాజ్య సభకు విజయసాయిరెడ్డి రాజీనామా చేయడం చిత్రమే. అది కూడా గత ఏడాది జనవరి 25న ఆయన రాజీనామా చేస్తున్నట్లుగా ప్రకటించి ఆ వెంటనే అమలులో పెట్టేశారు. దాంతో కూటమి పంట పండినట్లు అయింది. ఆ సీటు వారికి ఉన్న బలంతో వారి పరం అయింది. ఇక్కడే జగన్ కి విజయసాయిరెడ్డికి మధ్య వైరుధ్యం వచ్చింది అని చెప్పుకున్నారు. అయితే కాలం ఒక్కలా ఉండదు, గిర్రున ఏడాది తిరిగేసింది. దాంతో విజయసాయిరెడ్డి వైసీపీలోకి రీ ఎంట్రీ ఇస్తారు అన్న వార్తలు అయితే ప్రచారంలోకి వస్తున్నాయి.

జగన్ మేలు కోరుతూ :

విజయసాయిరెడ్డి తాజాగా చేసిన ట్వీట్ కూడా జగన్ మేలు కోరుతూ ఉండడం మీద అంతా చర్చించుకుంటున్నారు. జగన్ కోటరీ మీద ఆయన తరచూ విమర్శలు చేస్తున్నారు తప్ప జగన్ మీద కానే కాదు, ఆ విధంగా తాను జగన్ కి ఎపుడూ శ్రేయోభిలాషినే అని తెలియచేస్తున్నారు మరో వైపు చూస్తే వైసీపీలో కూడా విజయసాయిరెడ్డి వెళ్ళాక ఆ స్థాయిలో పార్టీలో మేనేజ్ చేసే వారు లేరన్న టాక్ కూడా ఉంది జగన్ సైతం విజయసాయిరెడ్డి విషయంలో మునుపటి కోపాన్ని తగ్గించేసుకున్నారని అంటున్నారు. పైగా పార్టీ కష్టకాలంలో ఉంది, ఒడ్డున పడాలి అన్నది కూడా అధినేత ఆలోచిస్తున్న విషయంగా ఉంది అని అంటున్నారు. దాంతో అన్నీ ఆలోచుకున్న మీదట సాయి రెడ్డి రీ ఎంట్రీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారు అని ప్రచారం అయితే సాగుతోంది.

అదే జరిగితే :

ఇక వైసీపీలో చూస్తే చాలా మంది నేతలు పార్టీని వీడి ఉన్నారు. వారి విషయంలో వైసీపీ అధినాయకత్వం రెండవ ఆలోచన లేదని అంటోంది. కానీ విజయసాయిరెడ్డి రీ ఎంట్రీకి చాన్స్ ఇస్తే మరింత మంది కూడా వస్తామని కోరే పరిస్థితి ఉంటుందని అంటున్నారు. మరి వారి విషయంలో ఎలా వ్యవహరించాలి అన్నది వైసీపీలో సాగుతున్న చర్చగా చెబుతున్నారు. అయితే విజయసాయిరెడ్డి విషయం వేరు అని అంటున్నారు. ఆయన ఫ్యామిలీ మెంబర్ తో సమానం కాబట్టి ఆయనను తీసుకోవచ్చు అన్నదే వినిపిస్తున్న మాట. మరి ఈ పుకార్ల లాంటి ప్రచారం నిజమైతే మాత్రం వైసీపీలో రాజకీయ విశేషం జరిగినట్లే అని అంటున్నారు.

Tags:    

Similar News