ముద్ర‌గ‌డ డెడ్‌లైన్ఃరేప‌టిలోగా తేల్చకపోతే...!

Update: 2016-01-31 19:39 GMT
తునిలో పెద్ద ఎత్తున జ‌రిగిన విద్వంసం అనంత‌రం కాపునాడు నాయ‌కుడు, మాజీ మంత్రి  ముద్రగడ పద్మనాభం మీడియాతో మాట్లాడారు. స‌భ అనంత‌రం రాస్తారోకో చేప‌ట్టిన ప‌ద్మ‌నాభం నిర‌శ‌న త‌ర్వాత మీడియాతో మాట్లాడారు. తమ డిమాండ్‌ల‌ విషయంలో రేపు సాయంత్రం వరకూ ప్రభుత్వానికి గడువు ఇస్తున్నామని, అప్పటి లోగా ప్రభుత్వం దిగిరాకుంటే ఆమరణ నిరాహార దీక్ష చేపడతానని ముద్రగడ హెచ్చరించారు.

కాపులను బీసీల్లో చేర్చాలన్నడిమాండ్ తో తునిలో చేప‌ట్టిన కాపుల స‌భ తీవ్ర ఉద్రిక్త‌త ప‌రిస్థితుల‌కు కార‌ణ‌మైన సంగ‌తి తెలిసిందే. రైలు బోగీలు ద‌గ్దం చేయ‌డంతో పాటు ఆస్తుల‌ను సైతం ధ్వంసం చేశారు.
Tags:    

Similar News