జడ్జీలనూ వదలని ఎంపి

Update: 2021-07-21 04:51 GMT
వైసీపీ తిరుగుబాటు ఎంపి కనుమూరు రఘురామకృష్ణంరాజు మొబైల్ ఫోన్ డేటాలో విస్మయకర విషయాలు బయటకు వస్తున్నాయి. ఇప్పటికే జగన్మోహన్ రెడ్డి బెయిల్ పిటీషన్ పై చంద్రబాబునాయుడు-ఎంపి మధ్య వాట్సప్ ఆధారంగా జరిగిన సంభాషణలను సీఐడీ బయటపెట్టింది. ఈ సంభాషణలు మొత్తాన్ని టెక్స్ట్ రూపంలో సుప్రింకోర్టుకు అఫిడవిట్ రూపంలో అందచేసింది.

తాజాగా బయటపడిన మరో విషయం ఏమిటంటే ఎంపికి నారా లోకేష్ మధ్య జడ్జీలకు సంబంధించిన వాట్సప్ టెక్ట్స్. ఈ వాట్సప్ చాటింగ్ లో ఏపి హైకోర్టు చీఫ్ జస్టిస్ అరూప్ కుమార్ గోస్వామిపై ఎంపి చీపుగా వ్యాఖ్యలు చేసినట్లు అర్ధమవుతోంది. ఓ కేసు సందర్భంగా ఇటు ఎంపి అటు లోకేష్ జరిగిన విచారణను ఆన్ లైన్లో డెరెక్టుగా లైవ్ చూశారని తెలుస్తోంది. ఒకవైపు విచారణను లైవ్ లో చూస్తునే మరోవైపు చీఫ్ జస్టిస్, జడ్జీలు, అడ్వకేట్ జనరల్, తమ లాయర్ల వాదనపై వీళ్ళద్దరు వాట్సప్ లో చాటింగ్ చేసుకున్నారు.

తమ చాటింగ్ లో వాదనలకు సంబంధించి ఎంపి తీవ్ర వ్యాఖ్యలే చేశారు. చీఫ్ పిరికివాడని, ఓ జడ్జీ రాయలసీమ రెడ్డే అయినా ఉపయోగం లేదని వెంటనే ట్రాన్స్ ఫర్ చేసేయాలన్న ఎంపి సూచనకు లోకేష్ మద్దతు పలికారు. మన లాయర్ కు చీఫ్ మద్దతుగా ఉన్నట్లే అనిపిస్తోందని లోకేష్, ఎంపిలు అభిప్రాయపడ్డారు. కేసు విచారణ వాయిదాపడగానే లోకేష్ కు ఎంపి అడ్వాన్స్ శుభాకాంక్షలు చెప్పారు. దానికి లోకేష్ బదులిస్తు 3వ తేదీన చెప్పుకుందామన్నారు.

ఇప్పటికే చంద్రబాబు-ఎంపి మధ్య జరిగిన వాట్సప్ చాటింగ్ కలకలం రేపితే తాజాగా ఎంపి-లోకేష్ మధ్య జరిగిన వాట్పప్ చాటింగ్ బయటపడటం గమనార్హం. మొత్తానికి జగన్ కు వ్యతిరేకంగా ఎంపిని వెనకుండి నడిస్తున్నది చంద్రబాబే అన్న వైసీపీ నేతల ఆరోపణలకు వాట్సప్ చాటింగులు తిరుగులేని ఆధారాలుగా అర్ధమవుతోంది. అయితే ఎంపికి తమకు మధ్య జరిగిన వాట్సప్ చాటింగ్ ల విషయమై చంద్రబాబు, లోకేష్ కానీ టీడీపీ నేతలు కానీ ఎవరు స్పందించటంలేదు.
Tags:    

Similar News