నాన్నగారు అందుకే వెళ్లలేదు:కవిత

Update: 2019-01-20 11:47 GMT
మోదీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రతిపక్షాలన్నీ ఏకమై కోల్‌ కతాలో మమతా బెనర్జీ ఆధ్వర్యంలో నిర్వహించిన బహిరంగా సభకు ప్రజల నుంచి భారీ స్పందనే వచ్చింది. ఈ కార్యక్రమానికి కాశ్మీర్‌ నుంచి కన్యకుమారి వరకు అన్ని ప్రతిపక్ష పార్టీలు వచ్చాయి. ఒక్క టీఆర్‌ఎస్‌ తప్ప.

కేసీఆర్‌ ఫెడరల్‌ ఫ్రంట్‌ అనే మూడో కూటమికి ప్లాన్‌ చేస్తున్నారు. ఇప్పటికే చాలామంది ముఖ్యమంత్రుల్ని కలిశారు. అందులో మమతా బెనర్జీ కూడా ఉన్నారు. అయితే.. ఇది బెంగాల్‌లో ఏర్పాటు చేసిన సభ కేసీఆర్‌ ఫెడరల్‌ ఫ్రంట్‌కు పోటీ లాంటిదే కాబట్టి.. కేసీఆర్ వెళ్లేందుకు సుముఖత చూపలేదని వార్తలు వస్తున్నాయి. అయితే ఈ వార్తల్ని కేసీఆర్‌ కుమార్తె, ఎంపీ కవిత తోసిపుచ్చారు. తెలంగాణలో అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయని గుర్తుచేశారు. ప్రభుత్వం ఏర్పడిన తర్వాత జరుగుతున్న తొలి సమావేశాలు కావడంతో.. కోల్‌కతా వెళ్లేందుకు కేసీఆర్‌ ఆసక్తి చూపలేదని అన్నారు.

అయితే.. మరోవైపు మరో వాదన కూడా విన్పిస్తుంది. కోల్‌కతా కార్యక్రమానికి ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా వచ్చారు. ఆయనతో ఎక్కడ స్టేజ్‌ షేర్‌ చేసుకోవాల్సి వస్తుందో అనే ఉద్దేశంతోనే కేసీఆర్‌ వెళ్లలేదని వార్తలు వస్తున్నాయి. అయితే.. ఇది కూడా అసలు కారణమే కాదని చెప్పారు కవిత. అసెంబ్లీ సమావేశాలకు కచ్చితంగా హాజరు కావాలనే ఉద్దేశంతో వెళ్లలేదని చెప్పారు ఆమె.
Tags:    

Similar News