• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  News >  Latest News >  మోడీ బ్యాచ్ పై ఫేస్ బుక్...

మోడీ బ్యాచ్ పై ఫేస్ బుక్ ర్యాంకులు ఇచ్చేసింది

By - Tupaki Desk
Update: 2016-05-26 18:01 GMT
సమయానికి తగ్గట్లు వ్యవహరించటం ఫేస్ బుక్ కు ఒకరు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ట్రెండ్ ను తగ్గట్లుగా దూసుకెళ్లే ఫేస్ బుక్ ఎంత వేగంగా వ్యవహరిస్తుందో తాజాగా ఉదంతం స్పష్టం చేస్తుందని చెప్పాలి. మోడీ సర్కారు అధికారంలోకి వచ్చి రెండేళ్లు పూర్తి అయిన నేపథ్యంలో పండువలా చేస్తున్న వైనాన్ని గుర్తించిన ఫేస్ బుక్ తనదైన శైలిలో మోడీ సర్కారు గురించి వివరాల్ని వెల్లడించటం గమనార్హం.

మోడీ సర్కారుకు ఫేస్ బుక్ కు లింకు ఎక్కడ? అన్న డౌట్ రావటం తర్వాత సంగతి.. నిజమే కదా.. ఈ యాంగిల్ లో ఆలోచించలేదే అన్న భావన కలిగేలా ఎఫ్ బి వ్యవహరించటం విశేషం. గడిచిన రెండేళ్లలో ఫేస్ బుక్ ను ఉపయోగించి ప్రధాని మోడీ.. ఆయన క్యాబినెట్ లోని మంత్రులు ఎంత చురుగ్గా ఉన్నారన్న అంశంపై ర్యాంకులు ప్రకటించటమే కాదు.. మోడీ పోస్ట్ చేసిన పోస్టుల్లో అత్యధిక ఆదరణ ఏ పోస్ట్ కి వచ్చిందన్న విషయాన్ని చెప్పుకొచ్చింది. 2014 మే 26 నుంచి 2016 మే 23 వరకు ఫేస్ బుక్ లో మోడీ పెట్టిన పోస్టుల్లో తన తల్లితో పెట్టిన పోస్ట్ కి 34.04 కోట్ల లైక్స్ వచ్చినట్లుగా వెల్లడించింది.

ఫేస్ బుక్ సీఈవో జుకర్ బర్గ్ ను.. అమెరికా అధ్యక్షుడు ఒబామా.. టర్కీ అధినేత ఎర్డొగన్ లతో ఉన్న పోస్టులకు అత్యధిక ఆదరణ వచ్చిన విషయాన్ని చెప్పిన ఫేస్ బుక్.. మోడీ క్యాబినెట్ లోని మంత్రులకు సంబంధించిన పలు ఆసక్తికర విషయాల్ని చెప్పుకొచ్చింది. ఇక.. ఫేస్ బుక్ లో ఎంత యాక్టివ్ గా ఉన్నారన్న అంశంపై ర్యాంకులు ఇచ్చింది.

మోడీ క్యాబినెట్ కు సంబంధించి ఎఫ్ బీ వెల్లడించిన విశేషాలు చూస్తే..

=  మోడీ మంత్రివర్గంలోని 50 మంది మంత్రుల అకౌంట్లలో 47 ఫేస్ బుక్ వెరిఫై చేసినవే

= ఇటీవల బీసీసీఐ అధ్యక్షుడిగా ఎన్నికైన అనురాగ్ ఠాకూర్.. స్మృతి ఇరానీలు ఎఫ్ బీ లైవ్ ను ఎక్కువగా వినియోగిస్తున్నారు

= ఫేస్ బుక్ లైవ్ ద్వారా ప్రధాని మోడీ వెబ్ సైట్ నరేంద్రమోడీ.ఇన్ ప్రజలకు చేరువైంది

= టూరిజం.. వ్యవసాయం.. డిజిటల్ ఇండియా.. రైల్వేలు.. మహిళా సంక్షేమం.. ఆర్థిక రంగం.. డిఫెన్స్.. ఆయుష్  తదితర రంగాలకు చెందిన పోస్టులను ప్రధాని వెబ్ సైట్ తరచూ పోస్ట్ చేసింది

= మేకిన్ ఇండియా.. డిజిటల్ ఇండియా.. స్కిల్ ఇండియా పథకాలకు ప్రజల నుంచి విపరీతమైన స్పందన ఉంది

ఇక.. ఎఫ్ బీలో యాక్టివ్ గా ఉండే మోడీ అండ్ కోకు ఇచ్చిన ర్యాంకుల్లో టాప్ టెన్ ఎవరంటే..

1.        నరేంద్ర మోడీ

2.        రాజ్ నాథ్ సింగ్

3.        స్మృతి ఇరానీ

4.        అరుణ్ జైట్లీ

5.        హర్ సిమ్రత్ కౌర్ బాదల్

6.        పియూష్ గోయల్

7.        రవిశంకర్ ప్రసాద్

8.        నితిన్ గడ్కరీ

9.        వెంకయ్యనాయుడు

10.     మేనకాగాంధీ
Tags:    
  • Modi 
  • Facebook 
  • Telugu NEWs 

Similar News

ఫుట్‌బాల్ మైదానంలో విషాదం.. గోల్‌కీపర్‌తో ఢీకొని ఆటగాడు మృతి!

2026-11-04 05:07 GMT

ఆదోనిలో జనసేన రెబల్ సంచలనం.. టీడీపీ, వైసీపీ అభ్యర్థులకు షాక్!

2026-11-04 04:56 GMT

అమెరికాలో 3 లక్షలకు పైగా వీసాలు రద్దు.. ట్రంప్ ప్రభుత్వం కీలక నిర్ణయం!

2026-11-04 04:55 GMT

ట్రంప్‌కు అమెరికా ఓటర్ల షాక్.. ప్రతినిధుల సభపై డెమోక్రాట్ల పట్టు

2026-11-04 04:29 GMT

పట్టణ రిజల్ట్...పరిషత్తులలో రిపీట్ ?

2026-11-04 03:38 GMT

మోడీ ఓపెన్ డిబేట్ విత్ రాహుల్...జనం కోరిక కూడానా ?

2026-11-04 01:30 GMT

కూటమి డెడ్లీ కాంబో...అందుకే వైసీపీ ఫల్టీ !

2026-11-04 00:30 GMT

రాజారెడ్డి కట్టిన కోట...జగన్ చూస్తూండగానే !

2026-11-03 23:30 GMT

పొగ‌డ్త‌లే కాదు.. విమ‌ర్శ‌లనూ త‌ట్టుకోవాలి నాయ‌కా: హైకోర్టు సంచ‌ల‌న తీర్పు

2026-11-03 22:30 GMT

పోలవరం ...గోదావరి మీద అద్భుత నిర్మాణం !

2026-11-03 19:30 GMT

ఇక రాత్రిపూట కూడా సూర్యుడి వెలుగులు.. ప్రకృతి నియమాలకు విరుద్ధంగా వెళుతున్నామా?

2026-11-03 18:30 GMT

అతి పెద్ద కార్పోరేషన్ కి పిన్న వయసులో మేయర్ గా!

2026-11-03 18:24 GMT

Copyright @2026

Powered by Blink CMS