• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  News >  Latest News >  శ్రీలంకలో అందాల పోటీ.....

శ్రీలంకలో అందాల పోటీ.. ఎందుకంత రభస జరిగింది?

By - Tupaki Desk
Update: 2021-04-08 04:30 GMT
అందాల పోటీలు ఎన్నో చూసి ఉండొచ్చు. కానీ.. గతంలో ఎప్పుడూ జరగని అనూహ్య పరిణామాలతో తాజాగా మన పొరుగున ఉండే శ్రీలంకలో చోటు చేసుకుంది. దేశ వ్యాప్తంగా జరిగిన అందాల పోటీల్లో జరిగిన రభస ఇప్పుడు పెను సంచలనంగా మారింది. ఇంతకీ ఏం జరిగిందంటే?
శ్రీలంకలో మిసెస్ శ్రీలంక అందాల పోటీ నిర్వహించారు. పోటీల్లో చివరి ఘట్టమైన.. విజేతను ప్రకటించే కార్యక్రమం షురూ అయ్యింది. విజేతగా పుష్పిక డి సిల్వ పేరును ప్రకటించారు. మిసెస్ వరల్డ్ వచ్చి ఆమె తలపై కిరీటాన్ని అలంకరించారు. ఆమె పక్కనున్న రన్నరప్ లు.. మిగిలిన వారు ఆమెను అభినందిస్తున్నట్లు చూస్తున్నారు. ఇలాంటి సమయంలోనే అనూహ్య పరిణామం చోటు చేసుకుంది.

2019 మిసెస్ శ్రీలంక కిరీటం అందుకున్న కరోలిన్.. తాజాగా మిసెస్ వరల్డ్ గా ఉన్నారు. జ్యూరీ వేదికపై ఉన్న ఆమె మాట్లాడుతూ.. పోటీలో నిబంధనల ప్రకారం విడాకులు తీసుకున్న మహిళకు కిరీటానని స్వీకరించే అర్హత లేదన్నారు. పెళ్లి చేసుకొని.. విడాకులు తీసుకోకూడదనే రూల్ ఉందని.. అందువల్ల తాజాగా కిరీటం మొదటి రన్నరప్ కు దక్కుతుందని చెబుతూ.. పుష్పిక తలపై ఉంచిన కిరీటాన్ని వేగంగా తీసేసి.. మొదటి రన్నరప్ తల మీద పెట్టేశారు.

అనూహ్య పరిణామాల మధ్య చోటు చేసుకున్న ఈ పరిణామంతో అందరూ అవాక్కు అయ్యారు. అసలేం జరిగిందో కూడా విజేత పుష్పికకు అర్థమయ్యే లోపల.. ఆమె తల మీద ఉండాల్సిన కిరీటం.. మరొకరికి పెట్టేయటంతో ఆమె షాక్ తిన్నారు. కిరీటాన్ని తీసే క్రమంలో అది కాస్తా ఆమె తల వెంట్రుకల మధ్య ఇరుక్కున్నా.. ఆ విషయాన్ని పట్టించుకోకుండా బలవంతంగా లాగేసిన కరోలిన్ తీరు షాకింగ్ గా మారింది.

దీంతో.. ఏం చేయాలో తోచని పుష్పిక వేదనతో వేదిక నుంచి కిందకు దిగిపోయి వెళ్లిపోయారు. ఇదంతా జాతీయ మీడియాలో లైవ్ నడిచింది. తనకు జరిగిన అవమానంపై పుష్పిక గళం విప్పారు. తాను విడాకులు తీసుకోలేదని.. ఒకవేళ తాను విడాకులు తీసుకొని ఉంటే.. అందుకు సంబంధించిన పత్రాలు చూపించాలని సవాల్ విసిరారు. తనకు జరిగిన అవమానానికి.. అన్యాయానికి చట్టపరంగా చర్యలు మొదలు పెట్టినట్లుగా పేర్కొన్నారు.

అంతేకాదు.. తన తలపై ఉంచిన కిరీటాన్ని లాగేసిన కరోలిన్ తీరును తప్పు పడుతూ.. సోషల్ మీడియాలో ఆమె ఘాటైన వ్యాఖ్య చేశారు. నిజమైన రాణి అంటే.. ఇతరుల కిరీటాన్ని దోచుకెళ్లే మహిళ కాదని విమర్శించారు. అందాల పోటీల నిర్వాహకులు కూడా ఈ ఘటనపై రియాక్ట్ అయ్యారు. పుష్పిక విడాకులు తీసుకోలేదని చెప్పటంతో ఆమెకు మళ్లీ కిరీటాన్ని అందజేశారు. తాను సాధించిన విజయం దేశంలోని ఒంటరి తల్లులకు అంకితమని పేర్కొన్నారు. ఈ మొత్తం వ్యవహారంపై మిసెస్ వరల్డ్ సంస్థ అంతర్గత విచారణను షురూ చేసింది. ఏమైనా.. అందాల పోటీ సందర్భంగా చోటు చేసుకున్న ఈ అనూహ్య పరిణామాలు షాకింగ్ గా మారటమే కాదు.. దేశ వ్యాప్తంగా హాట్ టాపిక్ అయ్యాయి.Full View
Tags:    
  • Miss Sri Lanka Fight 
  • Miss Sri Lanka 2020 
  • Srilanka 
  • Telugu News 

Similar News

లక్ష కోట్ల సామ్రాజ్యానికి ఏకైక రారాజు.. మేఘా కృష్ణారెడ్డి విజయ ప్రస్థానంలో చరిత్రాత్మక మైలురాయి..

2026-11-19 13:40 GMT

వైసీపీలో 'యాక్టింగ్' ఇన్‌ఛార్జ్‌ల మాయాజాలం ?

2026-11-19 13:37 GMT

'కాక్రోచ్ జనతా పార్టీ' గప్‌చుప్ అయిందా? వ్యూహం మార్చిందా? సీజేపీ అడుగులు ఎటువైపు!

2026-11-19 13:30 GMT

ట్రంప్, పుతిన్, జిన్‌పింగ్.. ప్రపంచ గతి మార్చగలిగే ముగ్గురి ముచ్చట..

2026-11-19 13:20 GMT

స్టాలిన్‌ను ఓడించిన జెయింట్ కిల్లర్.. టీవీకే ఎమ్మెల్యే వీఎస్ బాబు కన్నుమూత

2026-11-19 12:31 GMT

వైసీపీలో రోజాకు సెగ పెడుతోందెవ‌రు... ?

2026-11-19 12:30 GMT

స్థానిక పీఠాల పై మంత్రుల సతీమణులు.. సర్పంచ్‌గా బీసీ జనార్దన్ రెడ్డి భార్య, ఎంపీపీగా మండిపల్లి సతీమణి!

2026-11-19 12:29 GMT

వైసీపీలో 'మూడు' నియ‌మాలు.. జ‌గ‌న్ స‌మాలోచ‌న‌!

2026-11-19 11:30 GMT

వెయ్యిమంది కాదు బ్రో.. ఒకే సారి 15 వంద‌ల మంది!

2026-11-19 10:30 GMT

ఏపీలో అన్ని పార్టీల‌కు ఇదే స‌మ‌స్యా... వార్నింగ్‌ల‌తో స‌రా..?

2026-11-19 10:03 GMT

విజ‌య‌న‌గ‌రం.. బాబు వ‌రం ఎవ‌రికి?

2026-11-19 09:55 GMT

కష్టజీవులకు భరోసా.. నిర్మాణ రంగానికి ఊతం : ఏపీలో ‘లేబర్ అడ్డా’ల విప్లవం!

2026-11-19 08:05 GMT

Copyright @2026

Powered by Blink CMS