ఎన్నిక‌ల కోసం న‌యా స్కెచ్‌.. వైసీపీలో ఇదే హాట్ టాపిక్‌...!

Update: 2022-12-01 15:30 GMT
ప్ర‌స్తుతం వైసీపీ వేస్తున్న అడుగులు చూస్తే ఎన్నిక‌ల వ్యూహ‌మేనా?  ఈ విష‌యం పార్టీలో అంద‌రికీ తెలిసిందేనా? అనే అనుమానాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. తాజాగా శ్రీకాకుళం జిల్లాలో జ‌రిగిన ఒక స‌మావేశంలో మంత్రి సీదిరి అప్ప‌ల‌రాజు మాట్లాడుతూ.. నోరు జారారు. ఎన్నిక‌లు ఎప్పుడైనా రావొచ్చు.. అని వ్యాఖ్యానించారు. మ‌రి ఆయ‌న ఉద్దేశ పూర్వ‌కంగానే చెప్పారా.. లేక మ‌న‌సులో ఉన్న మాట దాచుకోలేక అన్నారా? అనేది మాత్రం తెలియాల్సి ఉంది. అయితే.. మంత్రి చేసిన వ్యాఖ్య‌ల‌ను మ‌రో నేత‌, మాజీ మంత్రి ధ‌ర్మాన కృష్ణ‌దాస్ ఖండించారు.

కానీ, ఒక్క‌సారి కీల‌క నేత నోటి నుంచి జారి బ‌య‌ట‌కు వ‌చ్చిన కామెంట్స్ ఎంతో ప్ర‌భావం చూపుతాయ‌నేది వాస్త‌వం. దీంతో సీదిరి అప్ప‌ల‌రాజు చేసిన కామెంట్ల‌లో నిజం లేకుండా ఉండ‌ద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు వ‌చ్చే ఎన్నిక‌ల‌కు ఇంకా స‌మ‌యం ఉన్న‌ప్ప‌టికీ.. వైసీపీ అధిష్టానం మాత్రం చాలా ముందు చూపుతో వ్య‌వ‌హ‌రిస్తోంది. నేత‌ల‌ను రంగంలోకి దింపి గ‌డ‌ప‌గ‌డ‌ప‌కు కార్య‌క్ర‌మాన్ని దూకుడుగా ముందుకు తీసుకువెళ్తోంది. అదేస‌మ‌యంలో కీల‌క‌మైన పోస్టుల్లో రెడ్డి సామాజిక వ‌ర్గానికి ప్రాధాన్యం ఇస్తోంది.

మ‌రీ ముఖ్యంగా పార్టీలోనూ కీల‌క మార్పులు చేస్తోంది. త‌ర‌చుగా సీఎం జ‌గ‌న్ ఎక్క‌డ ప్ర‌సంగించినా.. త‌మ ప్ర‌బుత్వం 98 శాతం మేనిఫెస్టోను అమ‌లు చేసింద‌ని అంటున్నారు.. న‌న్ను చూసి ఓటేయ‌మంటున్నారు. గ‌త పాల‌న‌కు.. గ‌త సంక్షేమానికి తేడా చూసి స్పందించాల‌ని ప్ర‌జ‌ల‌కు పిలుపునిస్తున్నారు.

ఈ ప‌రిణామాల‌ను గ‌మ‌నిస్తే.. సీదిరి చెప్పింది నిజ‌మేనా?  అనే సందేహాల‌కు తావిస్తోంది. ఆయ‌న ఊరికేనే ఏదీ చెప్ప‌ర‌ని అంటున్నారు. గ‌తంలో రాజ‌ధాని అమ‌రావ‌తిపై హైకోర్టు తీర్పు ఇచ్చిన త‌ర్వాత‌.. రెండు నెల‌ల‌ పాటు  అస‌లు ప్ర‌భుత్వం స్పందించ‌లేదు.

దీనిపై ప్ర‌భుత్వం ఏం చేస్తుంది? అనేది ఆస‌క్తిగా మారిన స‌మ‌యంలో శ్రీకాకుళం నుంచి సెల్ఫీ వీడియో విడుద‌ల చేసిన సీదిరి.. దీనిపై  మేం న్యాయ‌పోరాటం చేస్తామ‌ని చెప్పారు. త‌ర్వాత రోజుల్లో అదే జ‌రిగింది. అంటే.. ఆయ‌న  మాట‌కు రిల‌వెంట్ ఉంది. దీనిని కొట్టిపారేయ‌డానికి వీల్లేదు. సో.. సీదిరి చెప్పిన‌ట్టు ముంద‌స్తుకు వెళ్లినా వెళ్లే అవ‌కాశం ఉంటుంద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. అయితే..అ ది ఎప్పుడు.. వ‌చ్చే ఏడాదిలో స‌మ‌యం చూసుకుని వెళ్తారా?  లేక ఏదైతే అదే అవుతుంద‌ని మార్చిలోనే  దూకుడు ప్ర‌ద‌ర్శిస్తారా? అనేది సందేహంగా ఉంద‌ని అంటున్నారు.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News