• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  News >  Latest News >  అవంతి... టీడీపీలో వణుకు...

అవంతి... టీడీపీలో వణుకు పుట్టిస్తున్నారే!

By - Tupaki Desk
Update: 2019-08-14 08:15 GMT
తెలుగు దేశం పార్టీ ఇప్పుడు నిజంగానే గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటోందని చెప్పక తప్పదు. తాజాగా ముగిసిన ఎన్నికల్లో ఎన్నడూ లేనంతగా ఘోర పరాభవం పాలైన టీడీపీ... వచ్చే ఎన్నికల నాటికి ఎలా ఉంటుందో కూడా చెప్పడం సాధ్యం కావడం లేదు. అలాంటి తరుణంలో ఎన్నికలకు ముందుగా టీడీపీ తీరుపై నిరసన వ్యక్తం చేస్తూ వైసీపీలో చేరడమే కాకుండా వైసీపీ తరఫున ఎమ్మెల్యే గానే కాకుండా ఏకంగా జగన్ కేబినెట్ లో మంత్రి పదవిని కూడా దక్కించుకున్న ముత్తంశెట్టి శ్రీనివాసరావు అలియాస్ అవంతి శ్రీనివాస్ నోట నుంచి వెలువడిన తాజా కామెంట్లు వింటే... అసలు 2024 దాకా టీడీపీ బతికి బట్ట కడుతుంతా? అన్న అనుమానాలు కూడా రేకెత్తక మానవు.

అవంతి నోట నుంచి బుల్లెట్ లా దూసుకువచ్చిన ఈ మాట వింటే టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు గుండెలు గుభేల్ మనాల్సిందేనన్న వాదన కూడా వినిపిస్తోంది. అయినా అవంతి అంతలా సంచలనం రేకెత్తించే మాట ఏమంటే... టీడీపీలో ఎమ్మెల్యేలు కొనసాగుతున్న 23 మందిలో ఏకంగా పది మంది వైసీపీలో ఇప్పటికిప్పుడు చేరిపోయేందుకు సదా సిద్ధంగా ఉన్నారని అవంతి సంచలన కామెంట్ చేశారు. ఈ పది మంది కూడా నేరుగా తనతో టచ్ లో ఉన్నారని - వీరి విషయాన్ని తాను ఇప్పటికే వైసీపీ అధినేత - ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లానని కూడా అవంతి చెప్పుకొచ్చారు.

అయితే ఇప్పటిదాకా ఈ పది మంది టీడీపీ ఎమ్మెల్యేలు వైసీపీలో చేరేందుకు జగన్ సిగ్నల్ ఇవ్వలేదని - ఒకవేళ జగన్ గనుక గ్రీన్ సిగ్నల్ ఇచ్చేస్తే ఇప్పటికిప్పుడు ఒకే దఫాలో టీడీపీకి చెందిన ఆ పది మంది ఎమ్మెల్యేలు వైసీపీలో చేరిపోవడం ఖాయమని కూడా అవంతి సంచలన వ్యాఖ్యలు చేశారు. అవంతి చేసిన వ్యాఖ్యల్లో నిజమెంత అన్న విషయాన్ని పక్కనపెడితే... ఆయన మాట ప్రకారం టీడీపీ ఎమ్మెల్యేల్లో పది మంది ఒకే సారి వైసీపీలో చేరితే మాత్రం టీడీపీ కొంప కొల్లేరేనని చెప్పక తప్పదు. అదే జరిగితే...బాబు దుకాణం బంద్ అయిపోయినట్టేనని చెప్పక తప్పదు. మరి అవంతి చేసిన ఈ సంచలన వ్యాఖ్యలపై టీడీపీ శిబిరం ఏమంటుందో చూడాలి.
Tags:    
  • Minister Avanthi Srinivas 
  • Chandrababu Naidu 
  • Vizag 

Similar News

టాప్ స్టోరి: యంగ్ అథ్లెట్లు త‌స్మాత్ జాగ్ర‌త్త‌.. కెరీర్‌ను నాశనం చేసే 4 పొరపాట్లు!

2026-11-06 14:30 GMT

టీటీడీకి లేట‌య్యే కొద్దీ.. 'కాంపిటీష‌న్' పెరుగుతోందిగా..!

2026-11-06 12:30 GMT

జీడీపీ పెరిగితేనే అభివృద్ధి చెందినట్టా? అసలైన ప్రగతి అంటే ఇదే!

2026-11-06 11:37 GMT

టీడీపీలో సివంగులు.. వ‌ద‌ల్లేదుగా.. !

2026-11-06 11:30 GMT

భార్య.. తర్వాత ఆమె కుటుంబం.. భర్త చేసిన సీరియల్ కిల్లింగ్ కలకలం

2026-11-06 10:49 GMT

ఫ్యూచర్ సిటీకి కొత్త జిల్లా హోదా? జైపాల్‌రెడ్డి పేరుతో దక్షిణ తెలంగాణలో మరో జిల్లా?

2026-11-06 10:45 GMT

'రాధా-రంగా' మిత్ర‌మండ‌లికి జోష్‌.. !

2026-11-06 10:30 GMT

మన అల్లుడే అమెరికా ముస్లిం సెనెటర్.. లింకులు కర్ణాటకలో.. అమెరికా రాజకీయాల్లో భారతీయ మూలాలు

2026-11-06 09:24 GMT

'గ్రేట‌ర్‌' విశాఖ‌లో జ‌న‌సేన సునామీ... !

2026-11-06 09:24 GMT

న‌చ్చిన టైం వేస్తామంటే కుద‌ర‌దు బాస్‌: సుప్రీంకోర్టు

2026-11-06 09:22 GMT

జ‌నం ప‌ట్టుబడితే అంతే.. ఏపీలో పోలింగ్ బ‌హిష్క‌ర‌ణ‌!

2026-11-06 09:22 GMT

రూ. 40 కోట్లా? ఐపీఎల్ వేలానికి ముందే ఆటగాళ్ల డిమాండ్లు వైరల్

2026-11-06 07:49 GMT

Copyright @2026

Powered by Blink CMS