ఆ టెంపుల్‌లో కోటి విగ్రహాలున్నాయి..!

Update: 2021-08-17 10:30 GMT
భక్తి భావనను ప్రపంచానికి అందించిన భారతదేశం ప్రపంచానికి గురువుగా పిలువబడుతుంది. ఆలయాలకు కేరాఫ్‌గానూ భారత్ ఉంటుంది. విదేశాల్లోనూ హిందూ దేవుళ్లు కొలవుదీరి ఉన్నారు. హిందూ టెంపుల్స్ ఫారిన్ కంట్రీస్‌లోనూ బోలెడున్నాయి. అయితే, ఇండియాలో మిస్టరీయస్ టెంపుల్స్ చాలానే ఉన్నాయి. వాటి మిస్టరీలను ఛేదించేందుకుగాను పలువురు ప్రయత్నించారు. కానీ, విఫలయత్నమే చేశారని చెప్పొచ్చు. కాగా, మనం తెలుసుకోబోయే ఈ ఆలయంలో సుమారు కోటి విగ్రహాలున్నాయట. ఈశాన్య భారతంలోని త్రిపుర రాష్ట్రానికి దగ్గరలో ఒక మర్మమైన రాతి విగ్రహాల ఆలయం ఉంది.

ఇక్కడ 99 లక్షల 99 వేల 999 రాతి విగ్రహాలు ఉండటం విశేషం. అనగా కోటికి ఒక విగ్రహం తక్కువ మాత్రమే. అయితే ఈ విగ్రహాల సీక్రెట్స్ ఇప్పటి వరకు కనుగొనలేకపోయారు. ఈ టెంపుల్ రహస్యాన్ని తెలుసుకునేందుకు చాలా మంది పండితులు ప్రయత్నించారు. కానీ, తెలుసుకోలేకపోయారు. ఈ ఆలయన్ని కనీసంగా ఎవరు నిర్మించారనే విషయమైనా తెలుసుకుందామనుకున్నారు. కానీ, వారికి ఎటువంటి ఆధారం లభించలేదు. అయితే, స్థానికంగా ఓ కథ ఈ టెంపుల్ గురించి ప్రచారంలో ఉంది. అదేంటో ఈ రోజు తెలుసుకుందాం. ఒకప్పుడు శివుడితో పాటు కోటి దేవతలు ఎక్కడికో వెళ్తున్నారాట.

ఈ క్రమంలో రాత్రి కాగానే దేవతలందరూ నిద్రపోతారు. ఇప్పుడు ఆలయం ఉన్న ప్రదేశంలోనే వీరందరూ నైట్ పూట పడుకున్నారట. ఇక శివుడు కూడా డే అంతా జర్నీ చేశాడో? ఏమో? తెలియదు. కానీ, ఆయన కూడా రెస్ట్ తీసుకున్నాడు. మార్నింగ్ టైమ్‌లో అందరికంటే ముందరు భోళాశంకరుడు లేచి చూడగా, సకల దేవతలు నిద్రించే ఉన్నారట. అది చూసి ఆగ్రహించిన శివుడు వారిని శపించాడట. దాంతో దేవతలందరూ రాతి విగ్రహాలుగా మారిపోయారట. అలా ప్రజెంట్ ఈ టెంపుల్‌లో 99 లక్షల 99 వేల 999 విగ్రహాలు ఉన్నాయనేది ఓ కథనం. అయితే, ఈ టెంపుల్ సీక్రెట్స్‌పై మరో కథ కూడా ప్రచారంలో ఉంది.

అదేంటంటే..శివుడు, పార్వతితో కలిసి ‘కాలు’ అనే హస్తకళాకారుడు కైలాస పర్వతానికి వెళ్లాలనుకుంటాడు. అప్పుడు శివుడు ఒక రాత్రిలో కోటి దేవతలు, దేవతల విగ్రహాలను తయారు చేస్తే అతడిని తనతో పాటు వెంట తీసుకెళ్తానని కండిషన్ పెట్టాడు. అయితే, అందుకుగాను తప్పకుండా కోటి విగ్రహాలు పూర్తి చేయాల్సి ఉంటుంది. ఇక హస్త కళాకారుడైన ‘కాలు’ చాలా కష్టపడి పూర్తి చేసే ప్రయత్నం చేస్తాడు. కానీ, కోటికి ఒక విగ్రహం తక్కువగా తయారుచేస్తాడు. దాంతో ఆ కారణం చేతనే ఈశ్వరుడు ఆ హస్తకళాకారుడిని తనతో తీసుకెళ్లలేదట. ఈ క్రమంలోనే ఈ ప్లేస్‌కు ‘ఉనకోటి’ అని పేరు వచ్చిందని కొందరు చెప్తున్నారు.

ఈ టెంపుల్ త్రిపుర స్టేట్ క్యాపిటల్ అగర్తలా నుంచి 145 కిలోమీటర్ల దూరంలో ఉంది. ప్రముఖమైన ఈ టెంపుల్ భారతదేశంలోని అతిపెద్ద రహస్యాలలో ఒకటిగా పరిగణిస్తారు. అయితే, ఈ టెంపుల్ ఇక్కడ ఉన్నట్లు చాలా ఏళ్లుగా ఎక్కువ మందికి తెలియదు. భారత దేశంలో ఇలాంటి పురాతన ఆలయాలు చాలానే ఉన్నాయి. ఈ ఆలయాల మిస్టరీ తేల్చేందుకు పురావస్తు శాఖ అధికారులు, ఔత్సాహిక పరిశోధకులు కూడా ప్రయత్నిస్తూనే ఉన్నారు. కానీ, మిస్టరీ వీడటం కష్టంగానే ఉంది. ఏళ్ల తరబడి శాస్త్రీయ పరిశీలనతో పాటు అధ్యయనం చేయడం ద్వారానే ఏవైనా ఆధారాలు లభించొచ్చని కొందరు అభిప్రాయపడుతున్నారు.




Tags:    

Similar News