ఆ కెమికల్ తో యూఎస్ లో ఏడాదికి లక్షమంది మృతి !

Update: 2021-10-13 05:45 GMT
ప్లాస్టిక్ .. ప్రస్తుతం ప్రపంచాన్ని నాశనం చేస్తోన్న అతి పెద్ద మహమ్మారి. అయితే మన జీవితంలో పొద్దున్న లేచినప్పటి నుండి రాత్రి పడుకునే వరకు ప్లాస్టిక్ అనేది ఒక భాగంగా మారిపోయింది. ప్లాస్టిక్ వాడకూడదు అని చెప్తున్నా కూడా ప్లాస్టిక్ భాగంగా మారిపోవడం తో దాన్ని ఉపయోగించడం తగ్గించలేకపోతున్నారు. కెట్లు, డబ్బాలు, సంచులు... ఇలా ఇంట్లో ఏ మూల చూసినా కచ్చితంగా ఏదో ఒక రూపంలో ప్లాస్టిక్ కనిపిస్తూనే ఉంటుంది. అయితే ప్లాస్టిక్ వస్తువుల కన్నా ప్లాస్టిక్ సంచుల వాడకమే ప్రమాదం. పలుచగా ఉండే ఈ ప్లాస్టిక్ సంచులను అతిగా వాడి, ఎక్కడ పడితే అక్కడ పడేయడం, వీటిని రీసైకిల్ చేసే అవకాశం లేకపోవడం వల్ల భవిష్యత్తులో పెను ప్రమాదమే ఎదురవుతుందని పర్యావరణ హితులు భయపడుతున్నారు.

ప్లాస్టిక్ సంచుల తయారీ విషయానికి వచ్చేసరికి మాత్రం ప్రమాదకరమైన రసాయనరంగులు, ప్లాస్టిసైజర్లు కలుపుతున్నారు. రసాయన రంగుల్లో ఆరోగ్యానికి హాని చేసే కాడ్మియం, సీసం వంటివి ఉన్నాయి. ఇవి భూమిలో కలిసిపోవు. సరికదా భూసారాన్ని కూడా నాశనం చేస్తాయి. వాటిని జంతువులు అనారోగ్యాల బారిన పడుతున్నాయి. ప్రతి ఏడాది రెండు మిలియన్ల పక్షులు, సముద్ర జీవులు కేవలం ప్లాస్టిక్ సంచుల వల్లే చనిపోతున్నాయి. ఇక మనం వాడే ప్లాస్టిక్స్‌ పరికరాలన్నింటిలో థాలెట్‌ ఆనే కెమికల్‌ ఉన్నట్లు న్యూయార్క్‌ పరిశోధకులు గుర్తించారు. ఆఖరికి పిల్లలు ఆడుకునే బొమ్మలు దగ్గర్నించి మనం నిత్యం వాడే దుస్తులు, షాంపు నుంచి మేకప్‌ వరకు అన్ని ప్లాస్టిక్‌ తోనే రూపోందించినవే కావడంతో అత్యధికంగా థాలెట్‌ అనే కెమికల్‌ ఉత్పన్నవతోందని వెల్లడించారు.

ఇది హర్మోన్ల వ్యవస్థను నాశనం చేసే కారకాలుగా ప్రసిద్ధిమైనవే కాక మొత్తం మానవ వినాళికా గ్రంథి వ్యవస్థనే ప్రభావితం చేస్తుందని హెచ్చరించారు. ఆ ప్లాస్టిక్‌ వస్తువులు మన నిత్య జీవితంలో ఒక భాగమైపోయాయని అందువల్లే ఈ విషపూరిత రసాయనాలు మన శరీరంలోకి సులభంగా ప్రవేశిస్తున్నాయి అని అన్నారు. దీంతో మధుమేహం, ఊబకాయం, గుండే జబ్బులు అధికమవుతున్నట్లు తాజా అద్యయనాల్లో తెలపారు. న్యూయార్క్ యూనివర్సిటీకి చెందిన గ్రాస్‌ మన్ స్కూల్ ఆఫ్ మెడిసిన్ నిర్వహించిన పరిశోధనలో 55 నుంచి 64 సంవత్సరాల వయస్సు గల ఐదు వేల మంది మూత్రంలో థాలెట్‌ ల సాంద్రత ఎక్కువగా ఉన్నట్లు గుర్తించామన్నారు.

అంతేకాదు వారు గుండె జబ్బులతో చనిపోయే అవకాశం ఉందని వెల్లడించారు. గుండెజబ్బులకు ప్రధానం కారణం రసాయాలేనని తెలిపారు. అలాగే పురుషులలో టెస్టోస్టిరాన్‌ స్థాయిలు తగ్గిపోవడానికి కారణం ఈ థాలెట్‌ రసాయనమే కారణం అని చెప్పారు. ఈ థాలెట్‌ రసాయనం వల్ల అమెరికన్లు రకరకాల వ్యాధుల భారినపడి ఏటా 1,00,000 మంది అమెరికన్లు మరణిస్తున్నారని.. ఫలితంగా ఆర్థికంగా 40 నుంచి 47 బిలియన్ల డాలర్ల వరకు నష్టపోతున్నట్లు న్యూయార్క్‌ పరిశోధకులు అధ్యయనాల్లో పేర్కొన్నారు.



Tags:    

Similar News