దేశంలో కోటీశ్వరులు ఎంతలా పెరిగిపోతున్నారంటే?

Update: 2019-10-13 05:32 GMT
పేద భారత్ మధ్యతరగతి భారత్ గా మారి..  ఇప్పుడు సంపన్న భారత్ దిశగా పరుగులు పెడుతుందా? అంటే అవునన్న మాట వినిపిస్తోంది. గతంలో ఎప్పుడూ లేని విధంగా ఫోర్బ్ జాబితాలో భారతీయుల సంపన్నుల సంఖ్య అంతకుకంతకూ పెరుగుతోంది. బిలియనీర్లు మాత్రమే కాదు.. మిలియనీర్ల సంఖ్య కూడా దేశంలో పెరుగుతుందన్న విషయాన్ని తాజాగా ఐటీ శాఖ వెల్లడిస్తోంది.

ఈ ఏడాది ఆదాయపన్ను రిటర్న్స్ దాఖలు చేసిన వారిలో దాదాపు లక్ష మంది కోటీశ్వరులు ఉండటం విశేషం. గత ఏడాది ఇదే సమయంలో రిటర్స్న్ దాఖలు చేసిన వారి షంక్య 81,344 మంది ఉంటే.. ఈసారి ఏకంగా 97,689 మంది కోటీశ్వరులుగా మారటం గమనార్హం.

ఏడాదిలో కోటీశ్వరులుగా రిటర్న్ లు దాఖలు చేసే వారు 20 శాతం పెరిగినట్లైంది. వీరిలో నెలసరి జీతాలు తీసుకునే వారే 49,128 మంది ఉన్నారు. గత ఏడాది ఈ సంఖ్య 41,457 మాత్రమే. అవిభాజ్య కుటుంబాల్లో కోటికి పైగా ఆదాయం ఉన్న వారు 1.67 లక్షలు ఉండగా గత ఏడాది ఇది 1.33 లక్షలకు పరిమితమైంది.

ఓపక్క కోటీశ్వరుల సంఖ్య పెరగటమే కాదు.. కోటికి పైగా ఆదాయపు పన్ను చెల్లించే వారి సంఖ్య కూడా పెరుగుతోంది. గత ఏడాది 14,068 మంది కోటి రూపాయిలకు పైనే ఐటీ కట్టగా.. ఈ ఏడాది వారి సంఖ్య ఏకంగా 16,759కి పెరిగింది. ఆర్థికంగా దేశం దూసుకెళ్లిపోతుందన్న విషయం తాజా గణాంకాలు స్పష్టం చేస్తున్నాయని చెప్పక తప్పదు.
Tags:    

Similar News