స్వచ్ఛ భారత్ రోబో ఇది..
ఇల్లు శుభ్రం చేసేందుకు టైం చాలడం లేదనో... పనిచేయలేకపోతున్నామనో... పనిమనుషులు దొరకడం లేదనో.. దొరికినా వారు సరిగ్గా పనిచేయడం లేదనో బాధపడాల్సిన అవసరం ఇకపై ఉండదు. ఎందుకంటే ఇళ్లు ఊడ్చడానికి రోబోలు రెడీ అయిపోతున్నాయి. ఈ రోబో కి గది సైజు ఎంత ఉందో చెప్పి స్విచ్చు నొక్కితే చాలు ఇంట్లోని దుమ్ముధూళినే కాదు, సూక్ష్మజీవులనూ శుభ్రం చేసేస్తుంది. సూ ఆక్వాబోట్ 4.0 పేరుతో మిలాగ్రా హ్యూమన్ టెక్ కంపెనీ దీన్ని తయారుచేసింది. ఇంటినే కాదు చిన్నపాటి వాటర్ రిజర్వాయర్లు... వాటర్ ట్యాంకులు కూడా ఇది క్లీన్ చేసేస్తుంది. ఇందులో సిక్త్స్ సెన్స్ ఫీచర్ ఉంది. దీంతో పాటు ఎలాంటి దుమ్ముధూళినైనా ఇది లోపలికి పీల్చుకుంటుంది. ఆటో మేటిక్ అబ్ స్టాకిల్ ఫాల్ డిటెక్షన్, అధిక సామర్థ్యంతో పీల్చుకునే ఫిల్టర్.. అన్ని ఉపరితలాలను శుభ్రం చేయగల ఫీచర్లు ఇందులో ఉండడం విశేషం .
నగరాల్లో నివసిస్తున్న వారికి ఖాళీ సమయం దొరకడం గగనం . దీనికి కారణంగా ఇల్లు శుభ్రం చేసుకునేందుకు వారు పనిమనుషులపై ఆధారపడతారు. కానీ పనిమనుషులు దొరకడం కష్టమవడం... వారి వేతనాలు కూడా ఎక్కువగా ఉండడంతో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. చాలా సందర్బాల్లో భధ్రతాపరమైన సమస్య కూడా ఎదురవుతాయి. ఆక్వాబోట్ 4.0 ఆవిష్కరణతో వీటన్నీటికీ ఓ పరిష్కారాన్ని కనిపెట్టినట్టయిందనీ, భారతీయ నగర కార్మిక శక్తికి సాంకేతిక శక్తిని జోడించగలిగామని తయారీ సంస్థ చెబుతోంది. రిమోట్ కంట్రోల్ తో పని చేయగల ఈ రోబోటీక్ వాక్యూమ్ క్లీనర్ .... ఒక్క సారి ఛార్జింగ్ పెడితే రెండు గంటలపాటు ఏకధాటిగా పనిచేస్తు దాదాపు 3000 చదరపు అడుగులు శుభ్రం చేయగలదు. ఈ రోబో సంగతి ప్రధాని మోడీకి తెలిస్తే వెంటనే దాన్ని స్వచ్ఛ భారత్ కోసం వినియోగించుకోవడం గ్యారంటీ.