నేరస్తుడ్ని పట్టుకోవటానికి వచ్చి ప్రేమలో పడింది

Update: 2021-08-21 03:33 GMT
లైఫ్ చాలా సిత్రమైంది. ఎప్పుడేం జరుగుతుందో అస్సలు ఊహించలేం. అయితే.. కొన్ని వృత్తుల్లో ఉండే వారు ఆచితూచి అన్నట్లు వ్యవహరించాలి. వృత్తి జీవితంలోకి వ్యక్తిగత జీవితాన్ని తీసుకొస్తే అడ్డంగా బుక్ అయిపోవటమే కాదు అనవసరమైన తలనొప్పులు ఖాయం. తాజాగా అలాంటి పరిస్థితే ఎదురైంది ఒక మహిళా అధికారికి. రీల్ స్టోరీకి ఏ మాత్రం తీసిపోని ఈ రియల్ స్టోరీ ఆమెను చిక్కుల్లో పడేయటమే కాదు..నిందితులపై కేసులు కట్టి అరెస్టు చేయాల్సిన ఆమె.. ఇప్పుడు కేసులో ఇరుక్కుపోయింది. ఇంతకీ అసలేం జరిగిందంటే..

24 ఏళ్ల మదీనా సుకెనోవా రష్యా స్పై ఏజెంట్. ఈ మధ్యనే చదువు పూర్తి చేసుకొని ప్రొఫెషనల్ గా జాబ్ లో చేరింది. మొదటి కేసును ఆమెకు అప్పగిస్తూ.. మిఖాయిల్ సెర్బిన్ అనే వ్యక్తి మీద నిఘా పెట్టాలని చెప్పారు. బ్యాంకు ఖాతాలో డబ్బులు కొట్టేశాడని మిఖాయిల్ మీద ఫిర్యాదు రావటంతో అతని మీద నిఘా పెట్టారు. విషయం తేల్చమని మదీనాకు చెప్పారు. ఇక్కడవరకు అంతా బాగున్నట్లే ఉన్నా.. ఇక్కడే తేడా కొట్టేసింది.

నిందితుడి మీద నిఘా పెట్టాల్సిన ఆమె.. ఏకంగా అతడితో ప్రేమలో పడిపోయింది. అంతేకాదు.. అతడి మీద ఉన్న ప్రేమకు గుర్తుగా ఒక కారును కూడా గిఫ్టుగా ఇచ్చింది. ఒక రోజున నిందితుడు తన ప్రియురాలైన అధికారిణి ఇంటికి అదే కారులో వెళ్లటం నిఘా వర్గాలు గుర్తించి.. ఆమెను నిలదీశారు. అయితే.. తాను ఆ కేసును చూడలేనని.. వేరే వారికి అప్పజెప్పాలని గతంలోనే చెప్పినట్లుగా ఆమె చెప్పారు. కేసు చూడనని చెప్పిందే కానీ.. ప్రేమలో పడినట్లు చెప్పలేదు కదా? అన్న ప్రశ్నకు ఆమె సమాధానం చెప్పలేదట. నిందితుడి నేర విచారణ చేయమంటే.. అతగాడితో ప్రేమలో పడతావా? అంటూ ఆమె నిలదీయటమే కాదు.. ఆమె మీద పలు సెక్షన్లతో కేసు కూడా పెట్టారట. ఈ ఉదంతం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.


Tags:    

Similar News