లాడ్జిలో వైద్య విద్యార్థి మృతి ...శవం పక్కనే వైరస్ మందులు ...
పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరులోని ఓ లాడ్జిలో వైద్య విద్యార్థి అనుమానాస్పద రీతిలో మృతి చెందారు. ఆ లాడ్జ్ లో చనిపోయింది ఆశ్రం మెడికల్ కళాశాలలో చదువుతున్న విద్యార్థిగా గుర్తించారు. గత నాలుగు రోజులుగా లాడ్జిలోనే ఉంటున్న విద్యార్థి ఆదివారం ఉదయం మృతి చెందినట్లు హోటల్ సిబ్బంది తెలిపారు. అయితే , ఆ లాడ్జ్ గదిలో కరోనా వైరస్ కు ఉపయోగించే మందులు పారాసిటమాల్, సి విటమన్ ట్యాబ్లెట్లను పోలీసులు గుర్తించారు.
దీనితో ఆ విద్యార్థి కరోనా వైరస్ బారిన పడి మృతి చెందాడా? వేరే కారణాలతో మృతి చెందాడా? అనేది తెలియాల్సి ఉంది. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. కాగా, ఆంధ్రప్రదేశ్ లో వైరస్ విజృంభణ రోజురోజుకి మరింతగా పెరిగిపోతుంది. ఆదివారం కొత్తగా 813 మందికి వైరస్ నిర్దారణ కాగా.. మరో 12 మంది కరోనాకు బలయ్యారు. దీంతో రాష్ట్రంలో కరోనా వైరస్ కేసుల సంఖ్య 13,098 దాటింది. కరోనా మరణాలు 169కి చేరాయి.