కాసేప‌ట్లో పెళ్లి.. దారుణం జ‌రిగిపోయింది

Update: 2021-05-23 04:36 GMT
బంధువులంతా పెళ్లి సంద‌డితో సంబ‌రంగా ఉన్నారు. ఎవ‌రి ప‌నుల్లో వారు మునిగిపోయారు. వ‌రుడిని కూడా సిద్ధం చేశారు. ఇక‌, పెళ్లికూతురి ఇంటికి తీసుకెళ్ల‌డ‌మే మిగిలింది. కానీ.. ఇంత‌లోనే ఎవ్వ‌రూ ఊహించ‌ని దారుణం జ‌రిగిపోయింది. పెళ్లికొడుకు ఉన్న‌ట్టుండి కుప్ప‌కూలిపోయాడు. మ‌నిషిలో చ‌ల‌నం లేదు. భ‌యాందోళ‌న‌కు గురైన కుటుంబ స‌భ్యులు ఆసుప‌త్రికి త‌ర‌లించారు. ప‌రిశీలించిన వైద్యులు.. అప్ప‌టికే చ‌నిపోయిన‌ట్టు నిర్ధారించారు.

ఈ ఘ‌ట‌న తెలంగాణ‌లోని రంగారెడ్డి జిల్లా యాచారం మండ‌లం గున్ గ‌ల్ గ్రామంలో చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన సాఫ్ట్ వేర్ ఇంజ‌నీర్ ప‌వ‌న్ కుమార్ కు భువ‌న‌గిరి జిల్లాకు చెందిన యువ‌తితో పెళ్లి నిశ్చ‌య‌మైంది. శ‌నివారం వ‌ధువు ఇంట్లో పెళ్లి జ‌ర‌గాల్సి ఉంది. శుక్ర‌వారం రాత్రి పెళ్లి కొడుకును అమ్మాయి ఇంటికి త‌ర‌లించాల్సి ఉంది.

రాత్రివేళ కుటుంబ స‌భ్యులు వ‌రుడిని తీసుకెళ్లేందుకు ఏర్పాట్లు చేస్తుండ‌గా.. ఉన్న‌ట్టుండి తీవ్ర‌మైన‌ చ‌లితో వ‌ణికిపోయాడు. అలాగే కుప్ప‌కూలిపోయాడు. వైద్యులు చనిపోయాడ‌ని చెప్ప‌డంతో పెళ్లింట తీర‌ని విషాదం నెల‌కొంది. కాగా.. కొద్ది రోజుల క్రితం ప‌వ‌న్ కొవిడ్ బారిన ప‌డిన‌ట్టు స‌మాచారం. వారం క్రిత‌మే కోలుకొని ఆసుప‌త్రి నుంచి వ‌చ్చిన‌ట్టు తెలుస్తోంది.

ఇప్పుడు ఉన్న‌ట్టుండి ప‌వ‌న్ ప్రాణాలు కోల్పోవ‌డానికి క‌రోనానే కార‌ణం కావొచ్చ‌ని గ్రామ‌స్తులు అనుమానిస్తున్నారు. పెళ్లి వేడుక‌తో ఆనందంగా ఉండాల్సిన రెండు ఇళ్లు.. వ‌రుడి మ‌ర‌నంతో అంతులేని విషాదంలో మునిగిపోయాయి.
Tags:    

Similar News