మోడీ తో సమావేశం అయిన మంచు ఫ్యామిలీ!
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తో సమావేశం అయ్యింది మంచు ఫ్యామిలీ. మోహన్ బాబు, ఆయన తనయుడు విష్ణు, కోడలు విరోనికా, కూతురు మంచు లక్ష్మి, వారి పిల్లలు.. ఇలా కుటుంబ సమేతంగా మోహన్ బాబు వెళ్లి మోడీతో సమావేశం అయ్యారు. దాదాపు అరగంట సేపు ఈ సమావేశం జరిగింది. ఈ సమావేశం అజెండా ఏమిటనేది బయట కు రాలేదు. బహుశా రెండో సారి ప్రధానమంత్రి అయిన మోడీని అభినందించడానికి, విషెస్ చెప్పడానికే మంచు ఫ్యామిలీ వెళ్లి మోడీతో సమావేశం అయి ఉండవచ్చు.
మోడీతో మంచు ఫ్యామిలీ గతం నుంచి కూడా మంచి రిలేషన్సే మెయింటెయిన్ చేస్తూ ఉంది. మోడీ తొలిసారి బీజేపీ ప్రధాన మంత్రి అభ్యర్థి గా ప్రకటింపబడి, హైదరాబాద్ కు వచ్చినప్పుడు ఆయన కోసం ఏర్పాట్లు చేసింది మంచు ఫ్యామిలీ. తెలుగు సినిమా వాళ్లందరినీ పిలిపించి.. ఆ సమావేశాన్ని హైలెట్ చేసింది మంచు ఫ్యామిలీ. బహుశా ఆ పరిచయాలు కొనసాగుతూ ఉండవచ్చు.
ఇక ప్రస్తుతానికి మంచు ఫ్యామిలీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నట్టే. గత ఏడాది ఎన్నికల ముందు మంచు మోహన్ బాబు స్వయంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఆయన కు సీఎం జగన్ మోహన్ రెడ్డి తో బంధుత్వం కూడా ఉందని కూడా వేరే చెప్పనక్కర్లేదు.