ఎంత దురద పుడితే మాత్రం సీసా పెట్టేసి చిక్కుల్లో పడ్డాడు
అనుకుంటాం కానీ కొన్ని సందర్భాలు భరించలేనట్లు గా ఉంటాయి. ఎదుటోడు పడే అవస్థలు మన వరకూ వస్తే ఏం చేస్తామన్నది పక్కన పెడితే.. వాళ్లు చేసిన పనులు బయటకు వచ్చినప్పుడు మాత్రం ఆశ్చర్యంతో అవాక్కు అవుతాం. తాజా ఉదంతం కూడా ఆ కోవకు చెదిందే. దురద పుట్టి.. ఎంతకు తగ్గట్లేదన్న ఉద్దేశంతో పిరుదుల మధ్య గాజు సీసాతో గోక్కోనే ప్రయత్నం చేసి అడ్డంగా బుక్ అయిన బాధితుడి ఉదంతమిది.
చైనాలో చోటు చేసుకున్న ఈ వ్యవహారం గురించి వింటే అవాక్కు అవ్వాల్సిందే. నమ్మశక్యం గా అనిపించని ఈ ఉదంతానికి సంబంధించిన ఫోటో కూడా బయటకు వచ్చింది. చైనా కు చెందిన హాస్పిటల్ ఆఫ్ వెస్ట్రన్ అండ్ ట్రెడిషన్ చైనీస్ మెడిసిన్ అనే సంస్థ పేర్కొన్న ఈ కథనం మహా సిత్రంగా ఉంది.
దక్షిణ చైనాలోని గౌంగ్ డాంగ్ ప్రావిన్స్ కు చెందిన ఒక వ్యక్తి కి పిరుదుల మధ్య దురద ఎక్కువగా ఉంది. ఎంత ట్రై చేసినా దురద తగ్గకపోవటంతో.. ఊహించలేని రీతిలో గాజు సీసాతో గోక్కునేందుకుప్రయత్నించాడు. ఆ ప్రయత్నంలో అనూహ్యంగా సదరు గాజు సీసా ముందు భాగాన్ని కాస్త బలంగా లోపలకు తోశాడు. అది కాస్తా మూత్ర ద్వారం నుంచి పెద్ద పేగుల్లోకి వెళ్లి ఇరుక్కుపోయింది.
దురద బాధ పోయి.. సీసా ఇరుక్కుపోయిన నొప్పితో కిందామీదా పడ్డాడు. ఎంత ట్రై చేసినా సీసాను బయటకు తీయలేకపోవటంతో అలానే ఆసుపత్రికి పరుగులు తీశారు. అతడి పరిస్థితిని చూసి షాక్ తిన్నారు ఆసుపత్రి సిబ్బంది. ఎంత దురద అయితే మాత్రం ఇలాంటి పని చేయటం ఏమిటంటూ బాధితుడిపై వైద్యులు తిట్ల దండకం అందుకొని ఎక్స్ రే తీశారు. సీసా ఎంత లోతుగా దిగిందంటే.. లోపల ఐదు ఇంచులు వెళితే.. బయట కేవలం రెండు ఇంచులు మాత్రమే ఉంది.
బలవంతంగా సీసాను బయటకు లాగితే పెద్ద ప్రేగులు దెబ్బ తినే ప్రమాదం పొంచి ఉండటంతో అతడికి వెనువెంటనే సర్జరీ చేశారు. సీసా నుంచి విముక్తి కలిగించారు. ఈ వైనం ఆసక్తికరంగానే కాదు.. కొన్ని పనులు అస్సలు చేయకూడదన్న వార్నింగ్ తాజా ఉదంతం చెబుతుందని చెప్పక తప్పదు.