అమ‌రావ‌తి.. విత్తులోనే ఫ‌లాలు: ఏం జ‌రిగిందంటే!

ఏపీ రాజ‌ధాని అమ‌రావ‌తి స‌స్టైన్డ్ ఫైనాన్షియ‌ల్ ప్రాజెక్ట్‌. త‌న ఆదాయాన్ని త‌నే సంపాయించుకునే ప్రాజెక్టు.

Update: 2026-10-07 08:49 GMT

ఏపీ రాజ‌ధాని అమ‌రావ‌తి స‌స్టైన్డ్ ఫైనాన్షియ‌ల్ ప్రాజెక్ట్‌. త‌న ఆదాయాన్ని త‌నే సంపాయించుకునే ప్రాజెక్టు. అయితే.. ఈ మాట ఎలా ఉన్నా.. ఇప్పుడు విత్తు నాటిన వెంట‌నే ఫ‌లాలు ఇచ్చే చెట్టు ఉండ‌క‌పోయినా.. అమ‌రావ‌తి మాత్రం విత్తు నాటిన వెంట‌నే ఫలాలు ఇస్తోంది. ఈ విష‌యాన్ని స్వ‌యంగా సీఎం చంద్ర‌బాబు తెలిపారు. తాజాగా ఆయ‌న అమ‌రావ‌తి రాజ‌ధానిలో జ‌రుగుతున్న ప‌నుల‌పై దృష్టి పెట్టారు. ఏయే ప‌నులు జ‌రుగుతున్నాయ‌న్న స‌మాచారాన్ని సేక‌రించారు. దీని ప్ర‌కారం.. ప్ర‌స్తుతం అమ‌రావ‌తిలో ప్ర‌స్తుతం ఎఫెక్ట్‌: 152 ప్రాజెక్టుల ప‌నులు జ‌రుగుతున్నాయి. నిరంత‌రం ఈ ప‌నులు కొన‌సాగుతున్నాయి.

ఆయా ప‌నుల్లో దేశ‌వ్యాప్తంగా 42 వేల మంది కార్మికులు పాలుపంచుకుంటున్నారు. వీరికి నిబంధ‌న‌ల మేర‌కు రోజు కూలీగా రూ.1000-1500 వ‌ర‌కు ముడుతోంది. భోజ‌నం కూడా కాంట్రాక్ట‌ర్లే అందిస్తున్నారు. బ‌స ఇక్క‌డే. సో.. మొత్తంగా అమ‌రావ‌తి ప్రారంభంలోనే 42 వేల మంది కార్మికుల‌కు ఉపాధి ల‌భించిన‌ట్టు అయింద‌ని చంద్ర‌బాబు తెలిపారు. ఇది చాలా రేర్ అని పేర్కొన్నారు. అంతేకాదు.. ఈ ప‌నులు మ‌రో ఏడాది కొన‌సాగ‌నున్న నేప‌థ్యంలో వారికి మ‌రో ఏడాది, ఏడాదిన్న‌ర పాటు ఉపాధి ల‌భిస్తుంద‌ని వివ‌రించారు.

ఇక‌, అమ‌రావ‌తి రాజ‌ధాని నిర్మాణంలో 15 వేల మంది అధికారులు పాలుపంచుకుంటున్నారు. వీరికి అమ‌రావతి ప‌నులు త‌ప్ప వేరే ప‌నులు లేవు. అయితే.. వీరంగా ప్ర‌భుత్వ అధికారులు అని అనుకుంటే పొర‌పాటు. వివిధ కాంట్రాక్టు సంస్థ‌ల‌కు చెందిన ఉద్యోగులు. ప‌ర్మి నెంట్ ఎంప్లాయీజ్‌. సో.. వీరికి కూడా ఇక్క‌డ ఉపాధి, ఉద్యోగాలు ల‌భించాయి. ఇక‌, ఇత‌ర కార్మికుల విష‌యానికి వ‌స్తే.. డ్రైవ‌ర్లు 2 వేల మంది, క్లీన‌ర్లు 3 వేల మందికిపైగా అమ‌రావ‌తి కోసం ప‌నిచేస్తున్నారు. ఇత‌ర ప్రాంతాల నుంచి మ‌ట్టి, ఇసుక‌, సిమెంటు త‌ర‌లించే ప్ర‌క్రియ‌లో వీరు భాగ‌స్వామ్య‌మ‌య్యారు.

మొత్తంగా..

మొత్తంగా రాజ‌ధాని అమ‌రావ‌తి వ్య‌వ‌హారం.. ప్రారంభంలోనే అధ‌ర‌గొడుతోంది. వేలాది మందికి ఉపాధి క‌ల్పిస్తోంది. ఇక‌, అమ‌రావ‌తి పూర్త యితే ఏర్ప‌డే శాస్వ‌త సంస్థ‌లు, పెట్టుబ‌డుల రాక‌తో ఉద్యోగాలు, ఉపాధి సంఖ్య ల‌క్ష‌ల్లోనే ఉంటుంద‌ని చంద్ర‌బాబు తెలిపారు. వీటిలో శాస్వ‌త ఉద్యోగాలు స‌హా.. కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ ఉపాధి, ఉద్యోగాలు కూడా ల‌భించ‌నున్నాయ‌ని చెబుతున్నారు. ఇలా.. అమ‌రావ‌తి పూర్తి నిర్మాణం కాక‌ముందే.. `దేశంలోనే అతి పెద్ద ఉపాధిక‌ల్ప‌న` కేంద్రంగా మార‌డం ప‌ట్ల సీఎం చంద్ర‌బాబు హ‌ర్షం వ్య‌క్తం చేశారు.

Tags:    

Similar News