• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  News >  Latest News >  గూఢచారులకే గూఢచర్యం.....

గూఢచారులకే గూఢచర్యం.. అమెరికా నిఘా కోటకు చైనా ఏఐ కన్నం.. పాపం అంకుల్ శామ్..

| చైనాకు చెందిన ఏఐ టూల్ సాయంతో హ్యాకర్లు అమెరికా నిఘా సంస్థలపై సైబర్ దాడికి పాల్పడినట్లు కథనాలు వస్తున్నాయి. సీఐఏ, ఓడీఎన్ఐ, ఎన్‌జీఏ వ్యవస్థలపై ఈ దాడి ప్రభావం పడినట్లు సమాచారం. అయితే అత్యంత రహస్య సమాచారం సురక్షితంగానే ఉందని అమెరికా అధికారులు చెబుతున్నారు. ఈ దాడి వెనుక చైనా ప్రభుత్వ హస్తం ఉందా అన్నది ఇంకా స్పష్టత రావాల్సి ఉంది.

By - A.N.Kumar
Update: 2026-11-25 07:05 GMT

ప్రపంచ దేశాల గదుల్లో ఏం జరుగుతుందో కళ్ళద్దాలేసి మరీ తొంగి చూసే అగ్రరాజ్యం అమెరికా నిఘా కోటకే.. ఇప్పుడు చైనా ఏఐ కన్నం వేయడం నిజంగా కాలానికి ఎదురైన వింత ట్విస్టు.. ఇన్నాళ్లూ మనుషుల కదలికలను పసిగట్టిన అమెరికా గూఢచారుల కదలికలను ఇప్పుడు కృత్రిమ మేధస్సు కనిపెట్టే పరిస్థితి రావడంతో గూఢచారులకే గూఢచర్యం అనే కొత్త సామెత పుట్టుకొచ్చినట్లయింది.

ప్రపంచంలో ఏ మూలన ఏ చీమ చిటుక్కుమన్నా ఇట్టే పట్టేస్తామని గొప్పలు చెప్పుకునే అమెరికా నిఘా సంస్థలకు ఇప్పుడు గట్టిగానే షాక్ తగిలింది. ఎదుటివారి కంటిలోని నలుసును చూసేవాడికి తన కంటిలోని దూలం కనిపించలేదు అన్నట్లుగా ఉంది అగ్రరాజ్యం పరిస్థితి.. ప్రపంచానికి నిఘా పాఠాలు చెప్పే అమెరికా సొంత డిజిటల్ గోడలకే ఇప్పుడు భారీ చిల్లు పడింది. అది కూడా సాదాసీదా హ్యాకర్ల వల్ల కాదు.. ఏకంగా ఒక చైనీస్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టూల్ సాయంతో ఈ సైబర్ దాడి జరిగిందన్న వార్త ఇప్పుడు వాషింగ్టన్ వర్గాల్లో గుబులు రేపుతోంది.

సాధారణంగా సినిమాల్లో.. వార్తల్లో అమెరికా నిఘా సంస్థల పేర్లు వింటేనే శత్రు దేశాలకు వణుకు పుడుతుంది. అలాంటిది ఈసారి ఏకంగా సీఐఏ, ఓడీఎన్ఐ, ఎన్.జీఏ వంటి మూడు అతిపెద్ద ఇంటెలిజెన్స్ వ్యవస్థల పైనే సైబర్ దాడి ప్రభావం పడిందట.

ఇన్నాళ్లూ ఇతర దేశాల నాయకులు ఎవరితో మాట్లాడుతున్నారు? ఏ దేశంలో ఏం కుట్రలు జరుగుతున్నాయి? అని తొంగి చూసే అమెరికా... ఇప్పుడు తన సొంత సర్వర్లలోకి ఎవరు తొంగి చూశారో వెతుక్కునే పనిలో బిజీ అయిపోయింది. పాపం.. గూఢచారులకే గూఢచర్యం చేసే పరిస్థితి రావడం నిజంగా కాలం ఆడిన వింత నాటకమే.. పాపం తన బుర్ర బద్దలు కొట్టుకొని ఏఐ లాంటి సూపర్ ఇంటెలిజెన్స్ కనిపెట్టిన అంకుల్ శామ్ ఆల్ట్ మన్ కూడా ఈ చైనా ఏఐ ఇలాంటి దాడిని ఊహించలేదేమో.. లేకపోతే ఆయన కనిపెట్టేవాడు కాదేమో.. అన్న సెటైర్లు పడుతున్నాయి.

ఒకప్పుడు యుద్ధం అంటే సరిహద్దుల్లో సైనికులు.. ఆకాశంలో యుద్ధ విమానాలు.. క్షిపణులు కనిపించేవి. కానీ ఇప్పుడు కాలం మారిపోయింది. చైనా ఏఐ టూల్‌ను వాడి హ్యాకర్లు చేసిన ఈ దాడి చూస్తుంటే.. యుద్ధ రంగం సరిహద్దుల నుంచి సర్వర్లకు షిఫ్ట్ అయినట్లు స్పష్టంగా అర్థమవుతోంది.

కంప్యూటర్ ముందు కూర్చుని.. ఒక కప్పు కాఫీ తాగుతూ ఏఐ సాయంతో అగ్రరాజ్య భద్రతా వ్యవస్థలకే సవాలు విసరడం చూస్తుంటే భవిష్యత్తులో సైనికుల కంటే సాఫ్ట్‌వేర్ ఇంజనీర్లు.. హ్యాకర్లకే డిమాండ్ ఎక్కువగా ఉండేలా ఉంది. అయితే ఈ దాడి వెనుక నేరుగా డ్రాగన్ దేశం హస్తం ఉందా? లేక చైనా తయారు చేసిన ఏఐ ఆయుధాన్ని వేరే ఎవరైనా అద్దెకు తెచ్చుకుని వాడారా? అన్నది తేలడానికి అమెరికా అధికారులు తలలు పట్టుకుంటున్నారు.

ఎప్పటిలాగే ఈ దాడి తర్వాత కూడా అమెరికా అధికారులు ఒక రెడీమేడ్ డైలాగ్ వదిలారు. దాడి జరిగిన మాట వాస్తవమే కానీ.. మా అత్యంత రహస్య సమాచారం మాత్రం పూర్తిగా సురక్షితంగా ఉంది అని ప్రకటించారు. ఇది వినడానికి బాగానే ఉన్నా.. ఇంట్లోకి దొంగలు పడ్డారు కానీ బీరువా తాళం తీయలేదు అన్నట్లుంది ఈ వివరణ.. నిఘా సంస్థల వ్యవస్థల్లో చిన్నపాటి అంతరాయం కలిగినా.. సమాచార సేకరణ.. కమ్యూనికేషన్ వ్యవస్థలు కాసేపు మొరాయించినా అది దేశ భద్రతకు పెద్ద ముప్పే.

టెక్నాలజీ ఆధిపత్య పోరులో చైనా ఏఐ దూకుడు అమెరికాకు మింగుడు పడటం లేదు. రేపు ఏఐతోనే నిఘా.. ఏఐతోనే దాడి.. ఏఐతోనే రక్షణ జరిగే రోజులు వస్తే... కోట్లు ఖర్చు పెట్టి నియమించుకున్న మనుషులైన గూఢచారులకు కూడా లే ఆఫ్స్ తప్పవేమో.. ప్రపంచాన్ని స్కాన్ చేసే అమెరికాను ఇప్పుడు హ్యాకర్లు స్కాన్ చేయడం మాత్రం టెక్ ప్రపంచంలో హాట్ టాపిక్‌గా మారింది.

Tags:    
  • chineseai 
  • cyberattack 
  • usintelligence 
  • artificialintelligence 

Similar News

మళ్లీ టారిఫ్ లా? కుక్కతోక వంకర.. ఈ ట్రంప్ బుద్ది ఇక మారదా?

2026-11-25 07:06 GMT

బంగారం కొనాలనుకునే వారికి గుడ్ న్యూస్.. భారీగా తగ్గిన ధరలు!

2026-11-25 07:05 GMT

'వందల కోట్ల' బాంబుతో రేవంత్ పై కేఏ పాల్ సంచలన ఆరోపణలు

2026-11-25 07:04 GMT

యూఏఈలో ఘోర రోడ్డు ప్రమాదం.. 13 మంది మృతి.. మృతుల్లో భారతీయులు!

2026-11-25 04:22 GMT

విశాఖ పేరు మారుతోందా...క్లారిటీ ఇదే !

2026-11-25 04:03 GMT

అటు గుండమ్మ...ఇటు రాధమ్మ

2026-11-25 04:02 GMT

కాంగ్రెస్ కి ఎస్పీ షాక్...మొదటి జాబితా రిలీజ్ !

2026-11-25 04:02 GMT

సందీప్ సర్దుబాట ... కాంగ్రెస్ కి రాచ బాటేనా ?

2026-11-25 04:02 GMT

సీట్లు పెరగకపోతే కూటమికి కష్టమే సుమా !

2026-11-24 18:22 GMT

గుడివాడలో అగ్గి రాజుకుంటోంది... కోస్తాంధ్రాలో మరో తాడిపత్రి !

2026-11-24 18:22 GMT

కవితక్క...సెటిలర్ల అస్త్రం..

2026-11-24 18:21 GMT

Copyright @2026

Powered by Blink CMS