• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  News >  Latest News >  కేసీఆర్‌...బీజేపీ బ్రాండ్...

కేసీఆర్‌...బీజేపీ బ్రాండ్ అంబాసిడ‌ర్‌!

By - Tupaki Desk
Update: 2016-12-18 07:47 GMT
తెలంగాణ‌ ముఖ్యమంత్రి కే చంద్రశేఖరరావు అసెంబ్లీ - మండలిలో  పెద్ద నోట్ల రద్దును సమర్థిస్తూ చేసిన ప్రసంగంపై విప‌క్షాలు మండిప‌డుతున్నాయి. కేసీఆర్ ప్ర‌సంగం ప్రజలను అవమానించేలా ఉందని టీపీసీసీ ఉపాధ్యక్షులు మల్లు రవి విమ‌ర్శించారు. బీజేపీకి బ్రాండ్‌ అంబాసిడర్ వ‌లే కేసీఆర్‌ మారిపోయారని విమ‌ర్శంచారు. బీజేపీ-టీఆర్‌ ఎస్‌ మధ్య కుదిరిన చీకటి ఒప్పందం కేసీఆర్ ప్రసంగంతో మరొసారి బయటపడిందని ధ్వ‌జ‌మెత్తారు. బీజేపీతో కేసీఆర్‌ కలిసిపోయారడానికి ఇంత కంటే నిదర్శనం ఏం కావాలని మ‌ల్లు ర‌వి ప్రశ్నించారు.

కేసీఆర్ త‌నవ్య‌క్తిగత లావాదేవీలు చక్కదిద్దుకున్న తర్వాతనే ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర‌ మోడీని నిర్ణయాన్ని సమర్థించడం మొదలు పెట్టారని మ‌ల్లు ర‌వి మండిప‌డ్డారు. బీజేపీ పాలిత రాష్ట్రాలైన‌ మధ్యప్రదేశ్‌ - రాజస్థాన్‌ - చత్తీస్‌ ఘడ్‌ రాష్ట్రాల ముఖ్యమంత్రుల కంటే ఎక్కువగా కేసీఆర్‌ నోట్ల రద్దును సమర్థిస్తున్నారని విమర్శించారు. ప్రజల ఇబ్బందులను చెప్పకుండా బీజేపీని ప్రసన్నం చేసుకునేందుకు కేసీఆర్‌ తాపత్రాయ పడుతున్నారన్నారు. ఈ రకంగా మాట్లాడి నాలుగు కోట్ల తెలంగాణ ప్రజలను అవమానించారని ఆవేదన వ్యక్తం చేశారు.  కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నిరంకుశంగా వ్యవహరిస్తున్నాయని, అక్కడ పెద్ద మోడీ, ఇక్కడ చిన్న మోడీ అంటూ రాహుల్‌ గాంధీ చేసిన వ్యాఖ్యలు నిజమవుతున్నాయని మ‌ల్లు ర‌వి వ్యాఖ్యానించారు.

మ‌రోవైపు నిబంధ‌నల‌కు విరుద్ధంగా వ్య‌వ‌హ‌రించిన శాసనసభా వ్యవహారాల మంత్రి హరీశ్‌ రావుపై సభా హక్కుల ఉల్లంఘన నోటీసు ఇవ్వాలని సీఎల్పీ నిర్ణయించినట్టు తెలిసింది.అసెంబ్లీలో వెల్‌లోకి వచ్చారంటూ కాం గ్రెస్‌ సభ్యులను సస్పెండ్‌ చేసిన సందర్భంగా వెల్‌ లోకి పోని కాంగ్రెస్‌ సభ్యు డు మల్లు భట్టి విక్రమార్కను సస్పెండ్‌ చేశారని కాంగ్రెస్‌ నేతలు భావిస్తున్నారు. అందుకే సభను తప్పుదొవ పట్టించిన హరీశ్‌ రావుపై హ‌క్కుల ఉల్లంఘ‌న‌ నోటీసు  ఇవ్వాల‌ని కాంగ్రెస్ వ‌ర్గాలు భావిస్తున్నాయి.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    
  • Mallu Ravi 
  • KCR 
  • Telguu NEws 

Similar News

50 టీఎంసీల వరద..?! ‘మురసు’తో నిండనున్న పులిచింతల, నాగార్జునసాగర్

2026-11-02 11:04 GMT

దక్షిణాదికి బుల్లెట్ ట్రైన్.. బెంగళూరు నుంచి చెన్నైకి కేవలం 73 నిమిషాల్లోనే!

2026-11-02 10:24 GMT

తుఫాన్ల నెల నవంబర్.. అసలు కారణాలు ఏంటి?

2026-11-02 10:00 GMT

అమెరికా ఎన్నికలతో భారత్‌కు కొత్త పరీక్ష.. ట్రంప్ ఓడితే భారత్ కు లాభమా? నష్టమా?

2026-11-02 10:00 GMT

రాప్తాడు ఉన్మాదికి పోలీసు శిక్ష.. కుళ్లిపోయిన కుడికాలు, తొలగించే అవకాశం!

2026-11-02 09:58 GMT

తెలంగాణపై బీజేపీ ఫుల్ ఫోకస్.. అమిత్ షా ‘హైదరాబాద్ వ్యూహం’ గేమ్ ఛేంజర్ అవుతుందా?

2026-11-02 09:50 GMT

నెల్లూరుకు సమీపంలో ‘మురసు’.. ఐదు జిల్లాలలో భారీ వర్షాలు

2026-11-02 08:24 GMT

రాప్తాడు బాలిక హెల్త్ బులిటెన్.. కీలక సమాచారం వెల్లడించిన మంత్రి లోకేశ్

2026-11-02 07:56 GMT

ఓడిపోతానని ట్రంప్ కు జ్ఞానోదయం.. ఇన్నాళ్లకు తెలిసి (తెలివి) వచ్చింది..

2026-11-02 07:05 GMT

మారథాన్‌లో విజయం.. జీవితంలో విషాదం.. పరుగుపందెం పూర్తి చేసి ప్రాణాలు విడిచిన టెక్కీ

2026-11-02 06:43 GMT

తొలిరోజే రూ.68 లక్షల జరిమానాలు.. ఢిల్లీలో కాలుష్యంపై యుద్ధం..

2026-11-02 05:28 GMT

నీతా అంబానీ గొప్ప మనసు.. 5 వేల మంది నిరాశ్రయులకు అండగా ‘అనంత్ ఆశ్రయ్’

2026-11-02 04:56 GMT

Copyright @2026

Powered by Blink CMS