హైదరాబాద్ 18 ఏళ్ల అమ్మాయి వంటిది:వెంకయ్య
హైదరాబాద్ నగరం చార్మింగ్ (మనోహర) నగరమని ఉపరాష్ట్రపతి ఎం వెంకయ్యనాయుడు ప్రశంసించారు. హైదరాబాద్ నగరాన్ని 18 ఏళ్ల అమ్మాయి వంటిదని అభివర్ణించిన ఉపరాష్ట్రపతి వెంకయ్య అంతర్జాతీయంగా హైదరాబాద్ నగరంపై దృష్టి ఉన్నందున మరింత అభివృద్ధి చేసుకోవాలని సూచించారు. మాదాపూర్ శిల్పాకళావేదికలో జాతీయ ఖనిజాభివృద్ధి సంస్థ (ఎన్ ఎండీసీ) వజ్రోత్సవ వేడుకలకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. హైదరాబాద్ బిర్యానీ గురించి ప్రత్యేకంగా ప్రస్తావించిన వెంకయ్యనాయుడు.. ఇది ప్రపంచ ప్రసిద్ధిగాంచిందని చెప్పారు.
స్వాతంత్య్రం వచ్చిన మొదట్లో ప్రాంతీయ అసమానతలు తొలిగించేందుకు - ఉద్యోగావకాశాలు కల్పించేందుకు - ప్రాంతాల అభివృద్ధికి ప్రభుత్వరంగ సంస్థలను అప్పటి ప్రధాని నెహ్రూ పెద్ద ఎత్తున ఏర్పాటు చేశారని ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు అన్నారు. ఆ కాలంలో వ్యక్తుల చేతుల్లో తక్కువగా డబ్బు ఉండేదని - ప్రైవేటు పెట్టుబడులు తక్కువన్నారు. కానీ, నేడు వ్యక్తులు - ప్రైవేటు కంపెనీల చేతుల్లో పెద్ద ఎత్తున డబ్బుందని చెప్పారు. బాత్రూంలు - బెడ్రూంల్లో ఉన్న డబ్బంతా పెద్దనోట్ల రద్దుతో బ్యాంకుల్లో వచ్చి చేరిందని వ్యాఖ్యానించారు. బుల్లెట్ కన్నా బ్యాలెట్ బలమైనదని ఉపరాష్ట్రపతి అన్నారు. మవోయిస్టులు తమ లక్ష్యాల సాధనకు బ్యాలెట్ విధానాన్ని ఎంచుకోవాలని - జనజీవన స్రవంతిలో కల వాలని పిలుపునిచ్చారు. గిరిజనులకు చదువుకునే అవకాశం కల్పిస్తే అద్భుతాలు సాధిస్తారని చెప్తూ.. ఛత్తీస్ గఢ్ బస్తర్ ప్రాంతానికి చెందిన గిరిజన యువతి యూపీఎస్సీ పరీక్షల్లో 99% మార్కులు సాధించిన విషయాన్ని ప్రస్తావించారు.
ఎన్ ఎండీసీ గురించి వెంకయ్యనాయుడు మాట్లాడుతూ.. ఒక సంస్థ 60 ఏళ్లు పూర్తిచేసుకోవడం మామూలు విషయం కాదన్నారు. ఈ విజయం వెనుక ఎంతో మంది కృషి దాగి ఉందని అంటూ ఎన్ ఎండీసీ సిబ్బందిని అభినందించారు. ఎన్ ఎండీసీ అంటే నేషన్స్ మెయిన్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ గా ఆయన కొత్త నిర్వచనం చెప్పారు. ఏపీ పునర్వ్యవస్థీకరణ చట్టంలో పేర్కొన్న విధంగా రెండు తెలుగు రాష్ట్రాలకు రెండు ఉక్కు ఫ్యాక్టరీలు.. ఒకటి బయ్యారంలో మరోటి కడపలో ఏర్పాటు చేయాల్సి ఉందని - దీనిపై ఉక్కు శాఖ త్వరలో నివేదిక ఇవ్వనుందని తెలిపారు. ఆ తరువాత ఏర్పాటుపై తుది నిర్ణయం తీసుకుంటారని చెప్పారు.
కేంద్ర ఉక్కు శాఖ మంత్రి చౌదరి బీరేందర్ సింగ్ మాట్లాడుతూ ఏపీ పునర్విభజన చట్టంలో పేర్కొన్న విధంగా తెలంగాణ - ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో ఉక్కు పరిశ్రమల ఏర్పాటుపై టాస్క్ ఫోర్స్ కమిటీని ఏర్పాటుచేశామని, ఈ కమిటీ సాధ్యసాధ్యాలపై నెలలో నివేదిక ఇస్తుందని తెలిపారు. ఎన్ ఎండీసీ ఉద్యోగులు కొత్త పే స్కేలును అమలుచేయనున్నట్టు ప్రకటించారు. గనుల రంగంలో ఛత్తీస్ గఢ్ కు ప్రత్యేక స్థానం ఉందన్నారు. ఛత్తీస్ గఢ్ ముఖ్యమంత్రి రమణ్ సింగ్ - కేంద్ర సైన్స్ టెక్నాలజీ శాఖ మంత్రి వైఎస్ చౌదరి కూడా ప్రసంగించారు.