బ్రేకింగ్ : తెలంగాణలో లాక్ డౌన్ ఎత్తివేత .. !

Update: 2021-06-19 10:07 GMT
దేశంలో కరోనా వైరస్ మహమ్మారి కారణంగా నమోదు అయ్యే పాజిటివ్ కేసులు తగ్గుముఖం పడుతున్నాయి. దీనితో పలు రాష్ట్రాలు కరోనా కట్టడి కోసం విధించిన లాక్ డౌన్ నుండి సడలింపులు ఇస్తూ వస్తున్నారు. అలాగే మరోవైపు దేశవ్యాప్తంగా వ్యాక్సినేషన్ ప్రక్రియ ను వేగవంతం చేస్తున్నారు. ఇదిలా ఉంటే .. కరోనా మహమ్మారి కట్టడి కోసం విధించిన లాక్ డౌన్ ను సంపూర్ణంగా ఎత్తివేయాలని తెలంగాణ రాష్ట్ర కేబినెట్ నిర్ణయించిందని ఓ వార్త బయట హల్ చల్ చేస్తుంది. ప్రస్తుతం కేబినెట్ భేటీ ఇంకా జరుగుతోంది.

తెలంగాణ రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య, పాజిటివిటీ శాతం గణనీయంగా తగ్గిందని, కరోనా పూర్తి నియంత్రణలోకి వచ్చిందని,  వైద్యశాఖ అధికారులు అందించిన నివేదికలను కేబినెట్ పరిశీలించింది.  కరోనా పూర్తి నియంత్రణలోకి వచ్చిందని, వైద్యశాఖ అధికారులు అందించిన నివేదికలను పరిశీలించిన కేబినెట్ ఈ మేరకు లాక్ డౌన్ ను ఎత్తివేయాలని నిర్ణయం తీసుకున్నది.  దీనికి సంబంధించి  పూర్తిగా లాక్ డౌన్ ను ఎత్తివేయాలని నిర్ణయం తీసుకుంది. రాత్రి సమయంలో విధించిన కర్ఫ్యూ కూడా అవసరం లేదు అని కేబినెట్ నిర్ణయం తీసుకుందట.

లాక్ డౌన్ సందర్భంగా విధించిన అన్ని రకాల నిబంధనలను పూర్తిస్థాయిలో ఎత్తివేయాలని అన్ని శాఖల అధికారులను కేబినెట్ ఆదేశించిందని తెలుస్తుంది. దీనిపై కాసేపట్లో మార్గదర్శకాలని విడుదల చేసే అవకాశం ఉంది. మరోవైపు.. జులై 1 నుంచి 50 శాతం వరకు ఆక్యుపెన్సీతో థియేటర్లు, బార్లు, జిమ్‎లకు అనుమతి ఇచ్చే అవకాశం ఉంది. ఇలా అన్ని విషయాలపై మరికాసేపట్లో  క్లారిటీ వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి.
Tags:    

Similar News