లోన్ మారటోరియం వడ్డీ రద్దు .. అధ్యయనానికి కమిటీ!
కరోనా విజృంభణ నేపథ్యంలో కేంద్రం లోన్స్ పై మారటోరియం ప్రకటించిన సంగతి తెలిసిందే. ఆ లోన్ మారటోరియం గడువు ఇప్పటికే రెండు సార్లు పెంచింది. ఇకపై పెంచే అవకాశం లేదని చెప్పింది. అయితే , లోన్ మారటోరియం సమయంలో లోన్ కి వడ్డీ కట్టాలని బ్యాంకులు చెప్తుండగా .. వడ్డీ మాఫీ చేయాలనీ బాధితులు కోరుతున్నారు. దీనిపై ప్రస్తుతం సుప్రీం కోర్టు లో కేసు నడుస్తుంది. లోన్ మారటోరియం రుణాలకు సంబంధించి వడ్డీ మాఫీని అంచనా వేయడానికి, ఇతర అన్ని అంశాలను పరిష్కరించేందుకు నిపుణుల కమిటీని ఏర్పాటు చేశామని, అధ్యయనం చేసి రుణగ్రహీతలకు ఉపశమనం కలిగించే సూచనలు చేయాలని కోరినట్లు కేంద్ర ఆర్థికమంత్రిత్వ శాఖ గురువారం సుప్రీం కోర్టుకు తెలిపింది.
మాజీ కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ జనరల్ రాజీవ్ మెహర్షి, నేతృత్వంలో ఈ కమిటీని ఏర్పాటు చేసినట్లు తెలిపింది. ఈ కమిటీ వారంలో నివేదికను సమర్పించనుంది. ఈ కమిటీని ఏర్పాటు చేసినట్లు తెలిపింది. ఈ కమిటీలో మాజీ మానిటరీ పాలసీ కమిటీ సభ్యులు రవీంద్ర హెచ్ ధోలారియా, ఎస్బీఐ మాజీ మేనేజింగ్ డైరెక్టర్-ఐడీబీఐ బ్యాంకు బీ శ్రీరామ్ సభ్యులుగా ఉన్నారు. లోన్ మారటోరియంకు సంబంధించి సుప్రీం కోర్టులో విచారణ కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఆగస్ట్ 31వ తేదీ వరకు ఎన్పీఏల కిందకు రాని అకౌంట్లను వేటిని కూడా ఎన్పీఏలుగా ప్రకటించవద్దని గతంలో ఇచ్చిన మధ్యంతర ఆదేశాలను సుప్రీం కోర్టు మరో రెండు వారాలు పొడిగించింది. మారటోరియం కాలంలో చెల్లించని వాయిదాలపై వడ్డీ విధింపు అంశానికి సంబంధించి రెండు వారాల్లో అఫిడవిట్లు దాఖలు చేయాలని ఆర్బీఐ, కేంద్రాన్ని ఆదేశించింది. అన్ని అంశాలను సమగ్రంగా పరిగణలోకి తీసుకొని నిర్ణయం తీసుకోవాలని సూచించింది. తదుపరి విచారణను సెప్టెంబర్ 28వ తేదీకి వాయిదా వేసింది
కరోనా కారణంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న వివిధ వర్గాలకు ప్రయోజనాలను పొడిగించేందుకు చేపట్టే చర్యలపై 2వారాల్లో నిర్ణయం తీసుకుంటామన్నారు. ప్రస్తుతం ఉన్న రుణ పునర్వ్యవస్థీకరణతో 95 శాతం మంది రుణగ్రహీతలకు న్యాయం జరగదని క్రెడాయ్ తరఫు లాయర్ కపిల్ సిబాల్ కోర్టుకు తెలిపారు. బ్యాంకులు రుణగ్రహీతల అకౌంట్ల డౌన్ గ్రేడింగ్ చేస్తున్నాయని, దీనిని నిలిపివేయాలని, మారటోరియంను పొడిగించాలని కోరారు. బ్యాంకులు మారటోరియం సమయానికి చక్రవడ్డీలు వేస్తున్నాయని మరో న్యాయవాది చెప్పారు.