ఏపీలో భారీగా పడిపోయిన మద్యం అమ్మకాలు..!
ఏపీలో అధికారంలో ఉన్న జగన్ సర్కార్ మద్యం అమ్మకాలపై పక్కా ప్రణాళికలు అమలు చేస్తున్న సంగతి తెలిసిందే. రాష్ట్రంలో సంపూర్ణ మద్యపాన నిషేధమే ద్యేయంగా ఏపీ సర్కార్ అడుగులు ముందుకు వేస్తుంది. ఇదిలా ఉంటే ఏపీలో మద్యం అమ్మకాలు ,ఆదాయం భారీగా తగ్గిపోయింది. పోయిన ఏడాది తో పోల్చి చుస్తే , ఈ ఏడాది దాదాపుగా 25శాతం మేర ఆదాయం పడిపోయింది. గతేడాది ఏప్రిల్, సెప్టెంబర్ లో బీర్ల అమ్మకాల ద్వారా రూ.10,282కోట్ల ఆదాయం వస్తే.. ఈ ఏడాది ఏప్రిల్-సెప్టెంబర్ మధ్య రూ.7,706 కోట్ల అమ్మకాలు జరిగాయి. బీర్ల అమ్మకాలు 89శాతం పడిపోయాయి. ఇక మద్యం అమ్మకాలు 64శాతం తగ్గిపోయాయి.
ఏప్రిల్-సెప్టెంబర్ మధ్య 159.35 లక్షల కేసుల బీర్లు మాత్రమే అమ్మకాలు జరిగాయి. ఈ ఏడాది కేవలం 16.82 లక్షల కేసుల బీర్లు మాత్రమే అమ్మమైయ్యాయి. గతేడాది ఏప్రిల్ సెప్టెంబర్ మధ్య 166 లక్షల కేసుల మద్యం అమ్మకాలు జరిగితే.. ఈ ఏడాది ఏప్రిల్ సెప్టెంబర్ మధ్య కేవలం 65.62 లక్షల కేసుల మద్యం అమ్మకం జరిగింది. ఈ మద్యం అమ్మకాలు తగ్గడానికి, ఆదాయం పడిపోవడానికి కరోనాతో పాటూ, ధరల పెరగడం కారణాలకు చెబుతున్నారు. మార్చిలో కరోనా, లాక్ డౌన్ తో మద్యం షాపులు మూతపడ్డాయి. మళ్లీ మేలో షాపులు ఓపెన్ అయ్యాయి.. ఆ తర్వాత అన్ని మద్యం ధరలు పెంచారు, అలాగే వైన్ షాపుల సంఖ్య తగ్గించారు. ఈ మధ్య మళ్లీ మద్యం ధరల్లో మార్పులు చేశారు. ఇక పొరుగు రాష్ట్రాల నుంచి మూడు మద్యం బాటిళ్లు తెచ్చుకోవడానికి కూడా అనుమతి ఉంది. దీనితో ఏపీలో మద్యం ఆదాయానికి గండి పడుతుంది.