భారత్ - చైనా సరిహద్దుల్లో అలా జరుగుతోంది.. రాహుల్ సంచలనం
కాంగ్రెస్ అగ్రనేతల్లో ఒకరు.. దేశ భద్రతకు సంబంధించి సంచలన వ్యాఖ్యలు చేశారు. భారత్ - చైనా సరిహద్దుల్లో తలెత్తుతున్న వివాదాల గురించి ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. భారత భూభాగాన్ని చైనా అక్రమిస్తోందని.. అయినప్పటికీ మోడీ సర్కారు మాత్రం నిమ్మకు నీరెత్తినట్లుగా చూస్తుందన్నారు. ఒకవేళ..మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ అధికారంలో ఉన్నప్పుడు.. ఇలాంటివి జరిగి ఉంటే ఆయన తన పదవికి రాజీనామా చేసి ఉండేవారన్నారు. మన్మోహన్ ప్రధానిగా ఉన్నప్పుడు చైనా ఆక్రమణలు చేయలేదన్నారు.
సంఘ్ పరివార్ మీద విరుచుకుపడిన రాహుల్.. దేశంలో విద్వేషాన్ని పెంచి పోషిస్తోందన్నారు. దేశ ప్రజలంతా జాగ్రత్తగా ఉండాలని.. ఈ విద్వేషాన్ని ప్రేమతో ఎదుర్కోవాలన్నారు. డెవలప్ మెంట్ చేయలేని మోడీ సర్కారు.. తాము చేసిన పనుల్ని ప్రజలకు చూపించలేక.. మత రాజకీయాలకు పాల్పడుతుంటారని ఫైర్ అయ్యారు. రాజస్థాన్ రాజధాని జైపూర్ లో జరిగిన సమావేశంలో మాట్లాడిన రాహుల్.. భారత్ భూభాగాన్ని చైనా అక్రమిస్తోందన్నారు.
మన్మోహన్ హయాంను.. మోడీ హయాంను చూసినప్పుడు.. రెండు ప్రభుత్వాలు కొలువు తీరి ఉన్న వేళలో.. భారత్ - చైనా మధ్య సరిహధ్దు వివాదాలు ఉన్నప్పటికీ ఈ స్థాయిలో మాత్రం లేవని చెప్పాలి. మోడీ అధికారంలోకి వచ్చిన తర్వాత సరిహద్దు ఉద్రికత్తలు తరచూ చోటు చేసుకోవటంతో పాటు.. రెండు దేశాల మధ్య సంబంధాలు కనిష్ఠ స్థాయికి దిగజారినట్లుగా చెప్పక తప్పదు.
భారత్ సరిహద్దుల మీద కన్నేసిన చైనా విషయంలో అత్యంత జాగ్రత్తగా డీల్ చేయాలే తప్పించి.. తొందరపడితే మొదటికే మోసం వస్తుందన్న అభిప్రాయాన్ని పలువురు వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటివేళలోనే రాహుల్ చేసిన తాజా వ్యాఖ్యలు సంచలనంగా మారాయని చెప్పక తప్పదు. ఇంతకూ రాహుల్ చెప్పినట్లుగా.. సరిహద్దుల్లో చైనా దూకుడు మాటేమిటి? సరిహద్దులు ఆక్రమణకు గురయ్యాయా? అన్న అంశంపై మోడీ సర్కారు ఇప్పటికైనా స్పందించి.. అసలేం జరుగుతుందన్న విషయంపై దేశ ప్రజలకు స్పష్టత ఇవ్వాల్సిన అవసరం ఉంది.