• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  News >  Latest News >  జగన్ ను టార్గెట్ చేయటంలో...

జగన్ ను టార్గెట్ చేయటంలో ఈ తెలుగు తమ్ముడు సక్సెస్ అయ్యారట!

By - Tupaki Desk
Update: 2022-03-14 10:30 GMT
ప్రజాదరణ విషయంలో తిరుగులేని రీతిలో ఇమేజ్ ఉన్న పార్టీ అధినేతల్ని దెబ్బ తీయటం.. వారి ఇమేజ్ ను డ్యామేజ్ చేయటం అంత సులువైన విషయం కాదు. తమ రాజకీయ ప్రత్యర్థుల్ని 360 డిగ్రీస్ లో ఉతికి ఆరేసే విషయంలో వైసీపీ అధినేత ప్లానింగ్ ముందు మరెవరైనా బలాదూరే. టార్గెట్ చేయటంలో సరికొత్త విధానాల్ని పరిచయం చేసిన జగన్ అండ్ కో సాఫ్ట్ వేర్ ను అర్థం చేసుకోవటంలో తెలుగు తమ్ముళ్లు నానా ఇబ్బందులు పడిన పరిస్థితి. ఎవరి దాకానో ఎందుకు.. అధికారంలో ఉన్న వేళలో చంద్రబాబు కుమారుడు కమ్ మంత్రి లోకేశ్ తెలుగు భాషపై సంధించిన సెటైర్లు.. చేసిన వీడియోలు.. జరిగిన సోషల్ మీడియా ప్రచారంతో ఆయన ఇమేజ్ ఎంతలా డ్యామేజ్ అయ్యిందో తెలిసిందే.

ఆ మాటకు వస్తే లోకేశ్ ఎలా అయితే తెలుగు మాట్లాడటంలో ఇబ్బంది పడతారో.. కష్టసాధ్యమైన పదాల్ని పలకటంలో కిందా మీదా పడతారన్న విషయాన్ని చిట్టి వీడియోలు తీసి.. సోషల్ మీడియాలో పోస్టు చేయటం.. వాటిని వైరల్ చేయటం ద్వారా చినబాబు ఇమేజ్ దారుణంగా డ్యామేజ్ అయ్యింది. నిజానికి.. ఈ కారణంగా లోకేశ్ భాష మెరుగైందని చెప్పాలి. తనను టార్గెట్ చేసే వాళ్లకు సమాధానం చెప్పటానికి ఆయన తెలుగు ట్యూటర్ ను ప్రత్యేకంగా పెట్టుకొని మరీ తన భాషా ప్రావీణ్యాన్ని మెరుగుపర్చుకున్నారని చెప్పాలి.

నువ్వు ఒక వేలు చూపిస్తే.. నాలుగు వేళ్లు నీ వైపు చూపిస్తాయన్న నానుడికి తగ్గట్లే.. లోకేశ్ తెలుగును టార్గెట్ చేసిన జగన్ అండ్ కోకు.. తాజాగా టీడీపీ నేతలు పలువురు ముఖ్యమంత్రిగా ఉన్న జగన్మోహన్ రెడ్డి భాషా ప్రావీణ్యాన్ని చాటిచెప్పేలా ఒక చిట్టి వీడియోను సిద్ధం చేశారు. దీనికి సంబంధించిన క్రెడిట్ ఎవరికైనా ఇవ్వాలంటే అది టీడీపీ సీనియర్ నేత అయ్యన్న పాత్రుడికే.

తాజాగా 55 సెకన్ల వీడియోను ఆయన సోషల్ మీడియాలో పోస్టు చేశారు. ఈ సందర్భంగా జగన్ ను.. ఆయనకు అత్యంత సన్నిహితుడు.. తరచూ తమమీద ట్వీట్లతో విరుచుకుపడే రాజ్యసభ సభ్యులు విజయసాయి రెడ్డి ట్వీట్లపై పంచ్ లు వేస్తూ.. జగన్ మాటల్లో దొర్లే తప్పుల్ని.. ఆయన పదాల్ని పలికే విషయంలో చోటు చేసుకున్న పొరపాట్లను ఎత్తి చూపిస్తూ వీడియోను సిద్ధం చేశారు.

"విజయసాయి రెడ్డి ట్వీట్ల ఆయాసం.. ప్రత్యేక కోరిక మేరకు నత్తి పకోడీ ఐటమ్ వీడియోలు మీకోసం" అంటూ పలు సందర్భాల్లో జగన్మోహన్ రెడ్డి పలికిన మాటల్లోని తప్పుల్ని ఎత్తి చూపిస్తూ.. ఒక వీడియోను పోస్టు చేశారు. "ఏం భాష స్వామి అది" అంటూ.. జగన్ పలకలేకపోయిన పదాల్ని.. ఆయన ఎలా పలికారో వాటిని స్క్రీన్ మీద అక్షరాల రూపంలో అచ్చేయటం ద్వారా.. జగన్ ఇలా మాట్లాడతారా? అన్న భావన కలిగేలా చేయటంలో సక్సెస్ అయ్యారు.

55 సెకన్ల చిట్టి వీడియోలో మొత్తం 9 పదాల్ని జగన్ పలకలేని వైనాన్ని సిద్ధం చేశారు. ఆ మాటల్లో చాలా వరకు పెద్ద కష్టమైన.. క్లిష్టమైనవి కాకపోవటం గమనార్హం. రోటీన్ గా చాలా సింఫుల్ గా ఉండే పదాల్ని పలకటంలో జగన్ పడుతున్న ప్రయాస చూస్తే.. ఆయన తన భాష మీద పట్టును మరింత పెంచుకోవాల్సిన అవసరం ఉందని ఈ చిట్టి వీడియో చెబుతుంది.

జగన్ పలకాల్సిన పదం.. పలికిన తీరును చూస్తే..
పలకాల్సిన  పదం                               జగన్ పలికిన తీరు
తల్లడిల్లిన                                           తల్లడిన్న
అక్కచెల్లెళ్లమ్మలు                                అక్కచమ్మలు
ఆరోగ్య                                                 ఆరోరగ్య
ఒక్క అంశం                                          అక్క అంశం
వైద్యం కోసం                                         వైద్య కోసం
సుపరిపాలన                                        సుప.. సుప
సమర్థంగా                                         సమర్చవించ
సమాన స్వేచ్ఛ                                   సమాస స్వేచ్ఛ

Full View


Full ViewFull View
Tags:    
  • YSJagan 
  • YSRCP 
  • Lokesh 
  • TDP 
  • ChiefMinister 
  • AndhraPradesh 
  • VijayasaiReddy 
  • SocialMedia 
  • Politics 

Similar News

అమెరికాలో దీపావళి వేడుకలపై ఆంక్షలు.. బాణసంచా కాల్చితే $2,000 ఫైన్!

2026-11-05 04:16 GMT

ట్రంప్‌కు బిగ్ షాక్.. రెండు సభలూ డెమొక్రాట్ల ఖాతాలో!

2026-11-05 04:15 GMT

గూగుల్‌లో ఉద్యోగాలపై ఏఐ ప్రభావం.. మారుతున్న టెక్ కంపెనీల ఆలోచనా విధానం!

2026-11-05 04:14 GMT

డిప్యూటీ మేయర్లు...వైఎస్ చైర్మన్ల ఎన్నికకు కౌంట్ డౌన్

2026-11-05 04:10 GMT

అక్కడా 11 శాతం సీట్లే... వైసీపీకి మళ్ళీ ట్రోలింగ్ !

2026-11-05 04:09 GMT

బ్యూరోక్రాట్స్ హిట్ కొట్టలేకపోతున్నారు..రీజన్ అదే ?

2026-11-04 18:30 GMT

కోస్తా గేట్ తాకని వైసీపీ...సేమ్ సీన్ రిపీట్

2026-11-04 18:03 GMT

విశాఖ డిప్యూటీ మేయర్ మీద బీజేపీ కర్చీఫ్ ?

2026-11-04 18:01 GMT

ఎన్టీఆర్ ఆత్మ గౌరవ నినాదం...కేటీఆర్ కామెంట్స్ వెనక ?

2026-11-04 18:01 GMT

బ్యాలెట్ పేపర్లే.. కానీ కౌంటింగ్ మాత్రం రాకెట్ స్పీడ్.. అమెరికా ఎన్నికల్లో అసలు టెక్నాలజీ ఇదే..

2026-11-04 18:00 GMT

భారత్, చైనా సహా ఈ నాలుగు దేశాలకు హార్మూజ్ ను ఓపెన్ చేసిన ఇరాన్.. కానీ ట్విస్ట్

2026-11-04 17:52 GMT

పవన్ ఇలాకాలో ఏంటీ తేడా...బిగ్ నంబర్ తోనే !

2026-11-04 17:46 GMT

Copyright @2026

Powered by Blink CMS