పాక్ పై భారత్ గెలుపు..టర్నింగ్ పాయింట్ ఇదే

Update: 2019-06-17 04:31 GMT
ఇండియా -పాకిస్తాన్ ప్రపంచకప్ క్రికెట్ పోటీ..  దాయాది శత్రుదేశాలైన ఈ రెండు దేశాల మధ్య పోటీ అంటే దేశ ప్రధానుల నుంచి సామాన్య ప్రజల దాకా ఎక్కడి లేని ఆసక్తి చూపిస్తారు. ప్రపంచవ్యాప్తంగా ఈ మ్యాచే అన్నింటికంటే ఎక్కువ వ్యూస్ తెచ్చుకుంటుంది. అలాంటి అసలు సిసలు సమరంలో మరోసారి భారత్ ఆదిపత్యం చాటింది..

ప్రపంచకప్ చరిత్రలో పాకిస్తాన్ పై భారత్ ఇంతవరకు ఓడిపోలేదు. 1992 నుంచి ఇప్పటివరకు పాక్ ను ఓడిస్తూనే ఉంది. ఈసారి కూడా భారత క్రికెటర్లు అంతులేని పట్టుదలతో పాక్ పై చెలరేగి ఆ జట్టును ఓడించారు. మొదట రోహిత్ అజేయ శతకంతో టీమిండియాకు భారీ స్కోరు అందించగా.. ఆ తర్వాత బ్యాంటింగ్ కు దిగిన పాక్ కూడా చేధనలో గట్టిగానే మొదలు పెట్టింది. ముఖ్యంగా తొలి వికెట్ పడ్డాక బాబర్ - ఫకార్ లు భారత బౌలర్లను కాచుకుని విరుచుకుపడ్డారు. ఒకానొక దశలో పాకిస్తాన్ కు అవకాశాలు మెరుగయ్యాయి..

అందరి బౌలర్లపై విరుచుకుపడ్డ ఈ జోడీని విడదీయడానికి టీమిండియా చాలా కష్టపడింది. అయితే కులదీప్ వరుస ఓవర్లలో ఈ ఇద్దరు పాక్ టాప్ ఆర్డర్ బ్యాట్స్ మెన్ ను ఔట్ చేసి మ్యాచ్ ను మలుపుతిప్పాడు. ఇక ఆ తర్వాత హార్ధిక్ పాండ్యా వరుస బంతుల్లో హఫీజ్ - మాలిక్ ను ఔట్ చేసి మ్యాచ్ ను భారత్ వైపు మలుపుతిప్పాడు..

భారత్-పాకిస్తాన్ మ్యాచ్ లో కులదీప్ ఓవరే టర్నింగ్ పాయింట్. ఇక్కడే మ్యాచ్ భారత్ వైపు తిరిగింది. ఆ తర్వాత వరుసగా వికెట్లు కోల్పోయిన పాకిస్తాన్ ఓడిపోయింది.
Tags:    

Similar News