తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తనయుడు కేటీఆర్ గురించి చెప్పాలంటే...కేవలం ముఖ్యమంత్రి తనయుడు అని మాత్రమే కాకుండా చాలా విశేషణాలు ఉన్నాయి. యువ మంత్రి, చురుకైన రాజకీయవేత్త, కలుపుకొని పోయే తత్వం ఉన్న లీడర్, సోషల్ మీడియాలో చురుకుగా ఉంటూ సమస్యలపై స్పందించే మంత్రి ఇలా. వీటన్నింటితో పాటు ఇప్పుడు తెలంగాణలో కేటీఆర్ పెద్ద సెలబ్రిటీ కూడా. సినిమా తారలు హాజరయ్యే కార్యక్రమాలకు కూడా కేటీఆర్‌ను స్పెషల్ గెస్ట్ హోదాలో పిలుస్తున్నారంటే ఆయన క్రేజ్ ఏ రేంజ్లో ఉందో అర్థం చేసుకోవచ్చు. యూత్‌లో అంత క్రేజ్ ఉన్న కేటీఆర్‌కు సంబంధించిన ఆశ్చర్యకరమైన ఫొటో ఒకటి తాజాగా వెలుగులోకి వచ్చింది.
సాధారణంగా కేటీఆర్ చాలా యంగ్ గా కనిపిస్తుంటారు. ఓ ముప్పై ఐదేళ్ల వయసు ఉంటుందేమో అన్నట్లుగా కేటీఆర్ అప్పియరెన్స్ ఉంటుంది. కానీ ఆయన వయస్సు 40 దాటిపోయింది. అయితే దాదాపు 20 ఏళ్ల కిందటి కేటీఆర్ పాత ఫొటో ఒకటి వెలుగులోకి వచ్చింది. దీన్ని చూస్తే అబ్బో కేటీఆర్ కూడా కాస్త సీనియరే అనిపించేలా ఉంది. సోషల్ మీడియాలో వైరల్ అయిన ఈ ఫొటో కేటీఆర్ దృష్టికి కూడా చేరింది. దీనిపై ఆయన స్పందిస్తూ...ఈ ఫొటోనూ చూస్తే వయసు మళ్లిన జాబితాలోకి చేరినట్లుంది అని అనేశారట.