ఇమేజ్ టవర్ల ఫస్ట్ లుక్ వచ్చేసింది

Update: 2016-11-11 13:22 GMT
అటు ఐటీ మినిస్టర్ గా - ఇటు పురపాలక శాఖ మంత్రిగా తనమార్కు పనితీరును కనబరుస్తున్నారు తెలంగాణ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు! ఈ క్రమంలో త్వరలో హైదరాబాద్‌ లో నిర్మించబోయే "ఇమేజ్" టవర్స్ ఫస్ట్ లుక్‌ ను తారకరామారావు విడుదల చేశారు. హైదరాబాద్‌ లో నిర్వహిస్తున్న నాస్‌ కామ్‌ గేమ్ డెవలపర్ల సదస్సును ప్రారంభించిన అనంతరం ఈ నమూనాను ఆవిష్కరించారు కేటీఆర్. ఈ టవర్స్ ఫస్ట్ లుక్ చూస్తుంటే... అత్యాధునిక డిజైన్‌ లో వీటిని నిర్మించడానికి తలపెట్టినట్లు తెలుస్తోంది.
 
ఈ విషయాలపై ట్వీట్ చేసిన కేటీఆర్ ఇమేజ్ అంటే.. ఇన్నోవేషన్ ఇన్ మల్టీమీడియా - యానిమేషన్ - గేమింగ్ అండ్ ఎంటర్‌ టైన్‌ మెంట్ (IMAGE - Innovation in Multimedia - Animation - Gaming & Entertainment) అని వివరించారు. వీటిలో నాలుగు వైపులా నాలుగు టవర్లతో పాటుగా పై భాగంలో వాటన్నింటినీ కలుపుతూ ఈ నిర్మాణం కనిపిస్తోంది. ఇదే క్రమంలో టవర్ల మధ్యభాగంలో పెద్ద పరిమాణంలో ఉండే టీవీ స్క్రీన్లు మోడల్‌ లో కనిపిస్తుండగా, కింది భాగంలో రెండు స్విమ్మింగ్ పూల్స్ కూడా డిజైన్‌ లో భాగంగా దర్శనమిస్తున్నాయి. ముఖ్యంగా మల్టీమీడియా - గేమింగ్ పరిశ్రమను దృష్టిలో పెట్టకుని ఈ టవర్స్ నిర్మాణం చేపట్టబోతున్నట్లు చెబుతున్నారు!

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News