అమరావతికి చట్టబద్దత బిల్లుకు మోక్షం
అమరావతి రాజధానికి చట్టబద్ధత కల్పిస్తే మరింతగా అభివృద్ధి జరుగుతుందని ముఖ్యమంత్రి చంద్రబాబు కేంద్ర మంత్రి అమిత్ షాకు వివరించారు అని అంటున్నారు.;
ఏపీ రాజధాని అమరావతికి చట్టబద్ధత కల్పించే విధంగా బిల్లుని ప్రవేశపెట్టేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందా అంటే ఢిల్లీ వర్గాల సమాచారం ప్రకారం అవును అని అంటున్నారు. ఇక ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు కేంద్ర హోంమంత్రి అమిత్ షాను బుధవారం రాత్రి కలసి ఇదే విషయం మీద చర్చించారు అని అంటున్నారు. అమరావతి రాజధానికి చట్టబద్ధత కల్పించండి అంటూ బాబు కోరినట్లుగా చెబుతున్నారు.
రాజధాని మరింత అభివృద్ధి :
అమరావతి రాజధానికి చట్టబద్ధత కల్పిస్తే మరింతగా అభివృద్ధి జరుగుతుందని ముఖ్యమంత్రి చంద్రబాబు కేంద్ర మంత్రి అమిత్ షాకు వివరించారు అని అంటున్నారు. అంతే కాకుండా అమరావతి రాజధాని అన్నది ఏపీ ప్రజల ఆశలకు సెంటిమెంట్ కి కీలకంగా కూడా తెలియచేశారు. దాంతో ఈ పార్లమెంట్ సమావేశాలలో విభజన చట్టంలో సవరణలు తెస్తూ అమరావతి ఏపీ రాజధనిగా గుర్తిస్తూ బిలు ప్రవేశపెడతారు అని అంటున్నారు. బడ్జెట్ సెషన్ ఎక్కువ రోజులు సాగనుంది, దాంతో పాటు అనేక కీలక బిల్లులు ఈ సమావేశంలో సభ ముందుకు వస్తాయి. అందులో ఏపీ నుంచి అమరావతి రాజధానికి చట్టబద్ధత కల్పించే బిల్లు ఉంటుందని చెబుతున్నారు.
జీ రామ్ జీ భారం :
ఇదిలా ఉంటే కేంద్రం జాతీయ ఉపాధి హామీ పధకాన్ని మార్పు చేస్తూ శీతాకాల పార్లమెంట్ సమావేశాలలో తీసుకుని వచ్చిన జీ రామ్ జీ పధకం వల్ల రాష్ట్రాల మీద ఆర్ధిక భారం పడుతోంది. కేంద్రం ఈ పధకం కోసం అరవై శాతం నిధులు వెచ్చిస్తే రాష్ట్రాలు మరో నలభై శాతం ఖర్చు చేయాల్సి ఉంది. దాంతో మిగిలిన రాష్ట్రాల మాట ఎలా ఉన్నా అసలే అనేక ఆర్ధిక ఇబ్బందుల్లో ఉన్న ఏపీకి ఇది పెను భారంగా మారుతోంది. దాంతో ఈ నేపథ్యంలో జీ రామ్ జీ పథకం కింద అదనంగా అయ్యే ఖర్చుకు తగినట్లుగా కేంద్రం ప్రత్యామ్నాయ ఆర్థిక సాయం చేసి సహకరించాలని బాబు కోరినట్లుగా చెబుతున్నారు.
మరి ఈ విషయంలో ఏపీ విన్నపాన్ని కేంద్రం మన్నిస్తే ఒడ్డున పడినట్లే. ఎందుకంటే అసలే రాష్ట్రంలో అనేక సమస్యలు ఉన్నాయని అంటున్నారు. ఇదిలా ఉంటే అమరావతి రాజధానికి చట్టబద్ధత అన్న అంశం రెండవ దశ భూ సమీకరణ విషయంలో రైతుల నుంచి వచ్చింది. దాంతో పాటుగా ఏపీ ప్రజలు కూడా ఇదే అంశం మీద చర్చించుకుంటున్నారు. కేంద్రానికి అయితే ఈ విషయంలో పార్లమెంట్ లో చట్ట సవరణ చేసి గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేయించడం సులువైనదే అని అంటున్నారు. మరి చూడాలి ఏమి జరుగుతుందో.