ఈరోజు ఏమి జరుగుతుందో చూడండి.. ప్రపంచాన్ని ఉలిక్కిపడేలా చేస్తోన్న ట్రంప్ వ్యాఖ్యలు
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి ప్రపంచ రాజకీయాలను కుదిపేసేలా చేసిన వ్యాఖ్యలు అంతర్జాతీయంగా తీవ్ర కలకలాన్ని రేపాయి.;
"ఈరోజు ఏం జరుగుతుందో చూడండి!" అంటూ డొనాల్డ్ ట్రంప్ విసిరిన ఈ ఒక్క హెచ్చరిక ఇప్పుడు ప్రపంచాన్ని ఉలిక్కిపడేలా చేస్తోంది. ఇరాన్ తో యుద్ధానికి తెరదించేందుకు అమెరికా అణుబాంబు వేయబోతోందా? లేక ఇది కేవలం దౌత్యపరమైన ఒత్తిడి వ్యూహమా? మధ్యప్రాచ్యంలో నెలకొన్న తాజా పరిణామాలు గ్లోబల్ పాలిటిక్స్‌ను మరోసారి ప్రమాదకరమైన మలుపులోకి నెట్టాయి.
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి ప్రపంచ రాజకీయాలను కుదిపేసేలా చేసిన వ్యాఖ్యలు అంతర్జాతీయంగా తీవ్ర కలకలాన్ని రేపాయి. ఇరాన్‌తో ఇప్పటికే దశాబ్దాలుగా కొనసాగుతున్న విరోధం.. ఇటీవలి కాలంలో పతాక స్థాయికి చేరడం ప్రపంచ దేశాలను ఆందోళనలో ముంచెత్తుతోంది. “ఈరోజు ఏం జరుగుతుందో చూడండి” అంటూ ట్రంప్ చేసిన సంచలన ప్రకటన.. త్వరలో జరగబోయే ఏదో ఒక భారీ సైనిక చర్యకు సంకేతమని అంతర్జాతీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
యుద్ధ మేఘాలు.. ఆందోళనలో మధ్యప్రాచ్యం
అమెరికాకు అపారమైన సైనిక శక్తి ఉందని.. అధునాతన ఆయుధ సంపత్తితో తాము సిద్ధంగా ఉన్నామని ట్రంప్ స్పష్టం చేశారు. ఇరాన్ గత 47 ఏళ్లుగా ప్రపంచవ్యాప్తంగా అస్థిరతను సృష్టిస్తోందని, నిరపరాధులపై దాడులకు పాల్పడుతోందని ఆయన తీవ్రంగా విమర్శించారు. అమెరికా 47వ అధ్యక్షుడిగా ఈ అరాచకాలను అణచివేయడం తన బాధ్యత అని ఆయన పేర్కొనడం.. ఆ దేశంపై ప్రత్యక్ష అణు దాడికి వెనుకాడబోమని చెప్పకనే చెప్పడం వంటిదని భద్రతా నిపుణులు విశ్లేషిస్తున్నారు.
ప్రస్తుతం టెహ్రాన్ నుండి దుబాయ్, అబుదాబి వరకు మధ్యప్రాచ్యంలోని కీలక నగరాల్లో భద్రతను కట్టుదిట్టం చేశారు. దౌత్యపరమైన చర్చలకంటే సైనిక ఒత్తిడికే ట్రంప్ ప్రాధాన్యతనిస్తుండటంతో అక్కడ యుద్ధ వాతావరణం నెలకొంది.
హార్ముజ్ జలసంధి.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై ప్రభావం
ఈ ఉద్రిక్తతల నేపథ్యంలో అందరి కళ్లు 'హార్ముజ్ జలసంధి'పై ఉన్నాయి. ప్రపంచ చమురు సరఫరాలో అత్యంత కీలకమైన ఈ జలమార్గంపై ఇరాన్ పట్టు సాధించడం వల్ల ఆ దేశం దాన్ని మూసివేసే ప్రమాదం ఉంది. ఒకవేళ ఇరాన్ ఈ మార్గాన్ని అడ్డుకుంటే అంతర్జాతీయ మార్కెట్లో చమురు ధరలు ఆకాశాన్ని తాకడం ఖాయం. ఇది ఇప్పటికే ఆర్థిక మందగమనంతో సతమతమవుతున్న ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై కోలుకోలేని దెబ్బ తీసే అవకాశం ఉంది.
భారత్‌పై పడే ప్రభావం
భారతదేశం తన ఇంధన అవసరాల కోసం ప్రధానంగా మధ్యప్రాచ్య దేశాలపైనే ఆధారపడుతుంది. ఇక్కడ యుద్ధం జరిగితే.. యుద్ధంతో
చమురు ధరల పెరిగితే రవాణా ఖర్చులు పెరిగి, నిత్యావసర ధరల పెరుగుదలకు దారితీస్తుంది. చమురు దిగుమతులు తగ్గడం వల్ల ఇంధన భద్రతకు ముప్పు వాటిల్లుతుంది. మధ్యప్రాచ్యంలో లక్షలాది మంది భారతీయులు పనిచేస్తున్నారు. వారి భద్రత, స్వదేశానికి వారిని సురక్షితంగా రప్పించడం భారత ప్రభుత్వం ముందున్న పెద్ద సవాలు.
రాజకీయ వ్యూహమా? సైనిక దాడికి సన్నద్ధమా?
ట్రంప్ వ్యాఖ్యలు కేవలం రాజకీయ ఒత్తిడి పెంచి ఇరాన్‌ను లొంగదీసుకోవడానికి చేస్తున్న ప్రయత్నమా? లేదా నిజంగానే భారీ సైనిక దాడికి రంగం సిద్ధం చేసుకున్నారా? అన్నది ఇప్పుడు మిలియన్ డాలర్ల ప్రశ్న. ఏది ఏమైనప్పటికీ ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే ప్రపంచం మరో క్లిష్టమైన మలుపులో ఉందని స్పష్టమవుతోంది. అమెరికా తదుపరి అడుగు ఏమిటన్నది తెలియాలంటే వేచి చూడక తప్పదు.
అమెరికా-ఇరాన్ మధ్య నెలకొన్న ఈ ఉద్రిక్తతలు కేవలం రెండు దేశాలకు పరిమితం కాకుండా ప్రపంచ భద్రతకు, ఆర్థిక స్థిరత్వానికి సవాలుగా మారాయి. అంతర్జాతీయ సమాజం ఈ విషయంలో దౌత్యపరమైన పరిష్కారాల వైపు అడుగులు వేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది.