‘వార్’ భారత్ ఎంత ఆగమైంది? ఆ దేశాల సంగతేంటి?

అన్నియుద్ధాల మాదిరే.. సింఫుల్ గా తేల్చేస్తామన్నట్లు గర్జించిన అమెరికా.. రోజులు గడుస్తున్న కొద్దీ.. ఈ యుద్ధాన్ని ఒక కొలిక్కి తేవటం అంత తేలికైన విషయం కాదన్నది అర్థం చేసుకుంటోంది.;

Update: 2026-03-13 10:52 GMT

ప్రపంచం కోరుకోని యుద్ధాన్ని ఇజ్రాయెల్ - అమెరికాలు మొదలు పెట్టాయి. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఒక దేశాన్ని ఆర్థికంగా ఇబ్బందులకు గురి చేయాలన్నా.. ఆంక్షల పేరుతో ఉక్కిరిబిక్కిరి చేసే అవకాశాలున్నా.. వాటిని వదిలేసి.. చెప్పాపెట్టకుండా ఇరాన్ మీద బాంబులేసిన ఇజ్రాయెల్.. దానికి జత కలిసిన అమెరికా కారణంగా ఈ రోజున యావత్ ప్రపంచంలో కిందా మీదా పడుతోంది. మిగిలిన ప్రపంచం సంగతి ఎలా ఉన్నా.. తాజా యుద్ధం ఆసియా కేంద్రంగా సాగుతోంది. ప్రపంచ జనాభాలో 60 శాతం ఆసియా ఖండంలోనే ఉంది. అదే సమయంలో ప్రపంచ దేశాల్లో ఆసియాలో ఉన్న దేశాలు 48.కొన్ని లెక్కల ప్రకారం చూస్తే 51గా చెబుతారు. ఆ లెక్కల్ని పక్కన పెడితే.. మధ్యప్రాచ్యం కేంద్రంగా సాగుతున్న తాజా యుద్ధంతో యావత్ ప్రపంచం ఉక్కిరిబిక్కిరి అవుతోంది.

అన్నియుద్ధాల మాదిరే.. సింఫుల్ గా తేల్చేస్తామన్నట్లు గర్జించిన అమెరికా.. రోజులు గడుస్తున్న కొద్దీ.. ఈ యుద్ధాన్ని ఒక కొలిక్కి తేవటం అంత తేలికైన విషయం కాదన్నది అర్థం చేసుకుంటోంది. అంతేనా.. యుద్ధం మొదలు పెట్టటం ఎంత తేలికో..విజయవంతంగా ముగించటం అంత కష్టమన్న విషయం తాజా యుద్ధం మరోసారి రుజువు చేస్తోంది. అంతేకాదు.. నాగరిక ప్రపంచంలో యుద్ధానికి దిగటం దుస్సాహసమన్న సత్యాన్ని మరోసారి రుజువు చేసేలా తాజా యుద్ధం ఉందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఇందులో నిజం ఎంతన్నది రానున్న రోజులు స్పష్టం చేస్తాయని చెప్పాలి.

తాజా యుద్ధంతో ఆసియాలో ఏ దేశాలు దారుణంగా ప్రభావితం అయ్యాయి? ఏ దేశాలు లాభ పడ్డాయి? అన్నది చూసినప్పుడు ఆసక్తికర సమాధానాలు వస్తాయి. అదే సమయంలో భారత్ లాంటి దేశాల ప్రభావం ఏమిటి? భారత్ తరహాలో ఉన్న ఇతర దేశాలు.. వాటికి కారణాలు చూస్తే.. తాజాగా జరుగుతున్న యుద్ధాన్ని చూసే కోణం మారుతుందని చెప్పక తప్పదు.

ఇంతకూ యుద్ధం కారణంగా దారుణంగా ఆగమైన టాప్ 10 దేశాలు..కారణాల్నిచూస్తే..

1. లెబనాన్

ఇజ్రాయెల్ తో నేరుగా సరిహద్దు పంచుకోవటం వల్ల యుద్ద రణరంగంగా ఈ దేశం మారింది. మౌలిక సదుపాయాలు దారుణంగా ధ్వంసమయ్యాయి. 8 లక్షల మంది నిర్వాసితులయ్యారు. కోలుకోవటం చాలా కష్టంగా మారింది. ప్రజలు పెద్ద ఎత్తున వలసలు వెళుతున్నారు.

2. సిరియా

తాజా యుద్ధం కారణంగా సరఫరా మారగాలు పూర్తిగా మూతపడి.. తీవ్రమైన ఇంధన కొరతను మాత్రమే కాదు.. ఆహార కొరతను ఎదుర్కొంటోంది.

3. జోర్డాన్

యుద్ధం దెబ్బకు ఆ దేశానికి వెళ్లే పర్యాటకం పూర్తిగా నిలిచిపోయింది. శరణార్ధుల రాకతో ఆర్థిక భారం పెరిగింది.

4. శ్రీలంక

ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న ఈ దేశానికి ఈ యుద్ధంతో పడిన చమురు భారాన్ని భరించే ఆర్థిక స్థితి లేదు. ద్రవ్యోల్బణం మళ్లీ రికార్డు స్థాయికి చేరుకుంది. ఆ దేశ ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు.

5. పాకిస్థాన్

పెట్రోల్ ధరలు విపరీతంగా పెరిగాయి. ఆహారపదార్థాల ధరలు పెరిగాయి. రవాణా వ్యవస్థ స్తంభించింది. దేశ ఆర్థిక పరిస్థితి మింత దిగజారింది.

6. ఈజిప్టు

సూయిజ్ కాలువతో వచ్చే ఆదాయం తగ్గింది. ఎరువుల కొరతతో తీవ్ర ఇబ్బందులు. ఆహార సంక్షోభంతో ఉక్కిరబిక్కిరి అవుతోంది.

7. జపాన్

ఈ సంపన్న దేశం తన ఇంధన అవసరాల్లో 90 శాతం దిగుమతలు మీద ఆధారపడింది. దీంతో యెన్ విలువ పడిపోయి.. ధరలు విపరీతంగా పెరిగాయి. దీంతో.. జపనీయులు ఉక్కిరిబిక్కిరి అవుతోంది.

8. దక్షిణ కొరియా

యుద్ధం కారణంగా ఈ సంపన్న దేశం తీవ్ర ప్రభావితమైన దేశాల్లో ఒకటిగా నిలిచింది. యుద్ధంతో దీనికి ఏ మాత్రం సంబంధం లేకున్నా.. ఎనర్జీ బిల్లులు భారీగా పెరిగాయి. దీంతో తయారీ రంగం మీద ప్రభావితమైంది. దీంతో.. ఇప్పుడా దేశం కిందా మీదా పడుతోంది.

9. నేపాల్

గల్ప్ దేశాల నుంచి వచ్చే ఆదాయం భారీగా తగ్గిపోవటంతో ఆ దేశం తీవ్ర ఇబ్బందులకు ఎదుర్కొంటోంది. విదేశ మారక ద్రవ్య కొరత ఇప్పుడా దేశాన్ని వేధిస్తోంది.

10. ఫిలిప్పీన్స్

ఈ దేశానికి చెందిన లక్షలాది మంది వలస కార్మికులు వేర్వేరు దేశాల్లో ఉండటం.. యుద్ధం కారణంగా వారి ఆదాయం మీదా.. వారు పంపే డబ్బుల మీద ఆధారపడిన కుటుంబాలు పెద్ద ఎత్తున ప్రభావితమయ్యాయి. ధరలు కూడా పెరగటం వారికి ఇబ్బందికరంగా మారింది.

ఇలా యుద్ధం కారణంగా పలు దేశాలు తీవ్ర ఇబ్బందులకు గురవుతుంటే.. ఆశ్చర్యకరంగా మరికొన్ని దేశాలు లాభపడ్డాయి. ఇది చదివినప్పుడు ఒకరి నష్టం మరొకరికి లాభంగా మారుతుందన్న మాట గుర్తుకు వస్తుంది. తాజా యుద్ధం కారణంగా ఆర్థికంగా లాభపడిన టాప్ 10 దేశాలు చూస్తే..

1. రష్యా

రష్యా ఆసియా, ఐరోపా ఖండాలు రెండింటిలోనూ విస్తరించిన దేశమన్న సంగతి తెలిసిందే. రష్యాలో ఎక్కువ భూభాగం.. దాదాపు 77 శాతం ఆసియా ఖండంలో ఉంటే.. దాని జనాభాతో పాటు పొలిటికల్ సెంటర్ ఐరోపాలో ఉండటం తెలిసిందే. భౌగోళికంగా రష్యా ఆసియాలో ఉన్నప్పటికి.. రాజకీయంగా మాత్రం ఈ దేశం యూరోపియన్ దేశంగానే పరిగణించటం తెలిసిందే. తాజా యుద్ధం కారణంగా అంతర్జాతీయంగా చమురు.. గ్యాస్ ధరలు పెరగటంతో ఈ దేశం ఎగుమతుల ద్వారా భారీ లాభాల్ని గడించింది.

2. సౌదీ అరేబియా

ప్రపంచంలోనే అతి పెద్ద చమురు ఎగుమతిదారుగా పెరిగిన ముడిచమురు ధరలతో ఆ దేశ ఖజానా కాసుల మోత మోగుతోంది.

3. ఇరాక్

పెరిగిన ముడి చమురు ధరల కారణంగా గతంలో కంటే ఎక్కువ ఆదాయం లభించింది. ఈ యుద్ధంతో లాభపడిన దేశాల్లో ఇదొకటిగా చెప్పాలి.

4. ఖతార్

ఐరోపా దేశాలకు లిక్విఫైడ్ నేచురల్ గ్యాస్ సరఫరా చేయటం ద్వారా విపరీతమైన లాభాల్ని గడిచింది.

5. అమెరికా

ఓపక్క యుధ్దం కారణంగా ఈ దేశానికి భారీ ఆర్థిక నష్టం జరిగిన లెక్కలు ఉన్నప్పటికి.. చమురు ఎగుమతులతో పాటు.. యుద్ధం కారణంగా రక్షణ పరికరాల అమ్మకాలు పెరిగాయి. అయితే.. ఓచేత్తో నష్టం వచ్చినట్లు కనిపిస్తున్నా.. అంతిమంగా తాను నష్టపోయే కన్నా.. ఇతర దేశాల్ని నష్టపోయేలా చేయటంలో ఆ దేశ వ్యూహాలు ఉంటాయన్నది తెలిసిందే.

6. కువైట్

ముడి చమురు ధరల పెరుగుదలతో బడ్జెట్ మిగిలులోకి వెళ్లటమే కాదు.. విదేశీ మారక నిల్వలు పెంచుకుంటోంది.

7. నార్వే

ఐరోపాకు ప్రధాన గ్యాస్ సరఫరాదారుగా మారి ఆర్థికంగా లాభపడింది. అంతేకాదు.. భారత్ కు సైతం ఎల్పీజీ గ్యాస్ ఎగుమతి చేయటం ద్వారా మరింత లాభపడనుంది.

8. బ్రెజిల్

చమురు.. వ్యవసాయ ఉత్పత్తుల ఎగుమతుల ద్వారా ఈ దేశ ఆదాయం పెరిగింది.

9. ఆస్ట్రేలియా

బొగ్గు.. గ్యాస్ ధరలు పెరగటం ఈ దేశానికి వరంగా మారాయి. ఎగుమతులతో లాభాల పంట పండుతోంది.

10. కజికిస్తాన్

మధ్య ఆసియాలో ప్రధాన చమురు ఉత్పత్తిదారుగా ఉంటూ భారీ ఆదాయాన్ని పొందింది.

ఈ రెండు జాబితాల్లో భారతదేశం కనిపించదు. దీనికి కారణం ఈ యుద్ధం కారణంగా దారుణమైన పరిస్థితి లేదు. అలా అని లాభం లేదు. అంటే.. మధ్యస్త ప్రభావం ఉందనిచెప్పాలి. భారత్ తరహాలో మధ్యస్త ప్రభావానికి గురైన టాప్ 10 దేశాల వివరాల్లో వెళితే..

1. భారతదేశం

భారీ విదేశీ నిల్వలు..రష్యా నుంచి తక్కువ ధరకు చమురు కొనటంతో ఆర్థికంగా నిలబడే పరిస్థితి.

2. చైనా

ఇంధన ధరల భారం ఉన్నా.. వైవిధ్యమైన సరఫరా మార్గాల ద్వారా యుద్ధ ప్రభావాన్ని తగ్గించుకుంటోంది.

3. ఇండోనేషియా

సొంతంగా బొగ్గు.. పామాయిల్ నిల్వలు ఉండటంతో ఆహార ధరలను అదుపు చేసే పరిస్థితి.

4. మలేషియా

చమురు ఎగుమతి లాభాలు.. దిగుమతి చేసుకునే వస్తువుల ధరల భారాన్ని తగ్గించాయి,

5. వియత్నాం

ఎగుమతి ఆధారిత ఆర్థిక వ్యవస్థలతో ఆదాయం స్థిరంగా ఉండి.. ద్రవ్యోల్బణాన్ని తట్టుకుంది.

6. సింగపూర్

యుద్ధం కారణంగా ఈ దేశంలో పెట్రోల్ ధరల్ని భారీగా పెంచినప్పటికీ.. సగటు జీవి మీద ప్రభావం తక్కువ. దీనికి కారణం ఇక్కడి ప్రజలు సొంత వాహనాల కంటే ప్రజా రవాణా మీద 95 శాతం మంది ఆధారపడటంతో.. పెరిగిన పెట్రోల్ ధరలు పెద్దగా ప్రభావాన్ని చూపిన పరిస్థితి అంతంతమాత్రమే. దీనికి తోడు బలమైన కరెన్సీ.. బ్యాంకింగ్ వ్యవస్థలతో ధరల పెరుగుదలకు అడ్డుకట్ట వేయగలిగింది.

7. తైవాన్

సెమీ కండక్టర్ల ఎగుమతుల వల్ల వచ్చే ఆదాయం దేశ ఆర్థిక వ్యవస్థను గట్టెక్కించింది. దీనికి తోడు ఇటీవల వీటికిపెరిగిన డిమాండ్ తో ధరలు పెరగటం.. మరింత మేలు చేసింది.

8. యూఏఈ

చమురు లాభాలు ఉన్నా.. పర్యాటక రంగంలో ఎదురైన ఆటంకంతో లాభాలు పొందే దేశం నుంచి మధ్యస్త ప్రభావానికి గురైన దేశంగా మారింది

9. బ్రిటన్

ఇంధన ధరలు పెరిగినా.. సేవా రంగం.. ఆర్థిక పటిష్టత కారణంగా నిలబడగలిగింది.

10. జర్మనీ

గ్యాస్ ధరల భారం ఉన్నా.. ప్రత్యామ్నాయ ఇంధన మార్గాల ద్వారా సంక్షోభాన్ని అదుపు చేయగలుగుతుంది.

Tags:    

Similar News