విశాఖకు నీటి కష్టాలు...సింగపూర్ ఫార్ములా బెటర్ !

విశాఖ ప్రస్తుత జనాభా పాతిక లక్షలు గా ఉంది. అది కాస్తా మరో పదేళ్లలో నలభై లక్షలకు చేరుకుంటుందని అంచనాలు ఉన్నాయి. అలాగే యాభై లక్షల జనాభాగా రూపాంతరం చెందడానికి కూడా అవకాశాలు ఉన్నాయి.

Update: 2026-09-18 02:17 GMT

విశాఖ వేగంగా ఎదుగుతున్న నగరం. అంతే కాదు ఇపుడు డేటా సెంటర్లు అనేకం వస్తున్నాయి. అలాగే ఐటీ పరిశ్రమలు ఏర్పాటు అవుతున్నాయి. అదే విధంగా మిట్టల్ స్టీల్ ప్లాంట్ వంటివి వస్తున్నాయి. దాంతో రానున్న రోజులలో విశాఖ జనాభా గణనీయంగా పెరిగే చాన్స్ ఉంది. విశాఖ పారిశ్రామికంగా పర్యటాకంగపరంగా వాణిజ్యపరంగా ఉపాధి కేంద్రంగా చూసుకున్నా ఆకాశమే హద్దుగా విస్తరించేందుకు వీలున్న నగరం. విశాఖ ప్రస్తుత జనాభా పాతిక లక్షలు గా ఉంది. అది కాస్తా మరో పదేళ్లలో నలభై లక్షలకు చేరుకుంటుందని అంచనాలు ఉన్నాయి. అలాగే యాభై లక్షల జనాభాగా రూపాంతరం చెందడానికి కూడా అవకాశాలు ఉన్నాయి. దాంతో విశాఖకు అత్యవసరం అయినది మౌలిక సదుపాయాల కల్పన. అందులో రవాణాతో పాటు విద్యుత్, నీటి వనరులు అన్నవి మేధావులు చెబుతున్నారు. విశాఖ తాగు నీటి అవసరాలతో పాటు పారిశ్రామిక అవసరాలు కూడా తీరాలీ అంటే గోదావరి జిలాలను తరలించడంతో పాటు సింగపూర్ దేశం అనుసరిస్తున్న విధానాలను కూడా అనుసరించాలని కోరుతున్నారు.

సింగపూర్ ఏమి చేస్తోంది :

ఇదిలా ఉంటే సింగపూర్ ప్రపంచంలోనే అత్యంత నీటి ఎద్దడి ఎదుర్కొంటున్న దేశాల్లో ఒకటి. అలాంటి దేశం నీటి కష్టాలను అధిగమించడానికి ఏమి చేస్తోంది అంటే చాలానే అంటున్నారు. సముద్రం నీటిని డీశాలినేషన్ చేయడం. అలాగే వ్యర్ధమైన నీటిని రీసైక్లింగ్ చేయడం, వర్షపు నీటిని ఒడిసిపట్టడం, నీరు అధికంగా ఉన్న ప్రాంతాల నుంచి నీటిని తీసుకుని రావడం ఈ విధంగా సింగపూర్ దేశం తన నీటి కష్టాలను ఎదుర్కొంటోంది. ప్రస్తుతం సింగపూర్ మొత్తం నీటి అవసరాలలో 40 శాతం వాటాను ఈ రీసైకిల్డ్ నీరే తీరుస్తోంది. అలాగే సముద్రపు నీటిని మంచి నీరుగా మార్చడం కూడా అక్కడ మంచి ఫలితాలు ఇస్తోంది. సముద్రం చుట్టూ ఉన్న దేశం కావడంతో,సింగపూర్ సముద్రపు నీటిలోని ఉప్పును తొలగించి తాగునీరు గా మార్చే సాంకేతికతను భారీగా వాడుతోంది. ఇలా అత్యాధునిక టెక్నాలజీ సాయంతో సింగపూర్ తన నీటి కొరతను అధిగమించి ప్రపంచ దేశాలకు ఒక రోల్ మోడల్‌గా నిలిచింది. ఇపుడు అదే ఫార్ముల విశాఖలో నీటి కొరతను తీర్చుకోవడానికి వినియోగించుకోవాలని మేధావులు సూచిస్తున్నారు.

రిజర్వాయర్లను పూర్తిగా :

విశాఖ చుట్టూ అనేక రిజర్వాయర్లు ఉన్నారు. వాటి నీటితోనే ఇప్పటిదాకా విశాఖ ఆధారపడి ఉంది. అయితే వాటిలో పూడిక తీయించి ఆధునీకరిస్తే ఇంతకు రెట్టింపు నీటి వనరులను అందిస్తాయి. ఆ పని సత్వరమే చేయాల్సి ఉంది. అలాగే పోలవరం నుంచి నీటిని తరలించే ప్రక్రియ మొదలైంది. ఇపుడు విశాఖ చుట్టూ సముద్రం ఉంది. సముద్రం నీటిని పెద్ద ఎత్తున డీశాలినేషన్ చేయడం ద్వారా వినియోగించుకోవాలని సూచిస్తున్నారు. అలాగే పోలవరం ద్వారా వచ్చే గోదావరి నీటిని రిజర్వ్ చేసుకునేందుకు నగరం చుట్టూ అయిదు బ్యాలెన్స్ రిజర్వాయర్లు నిర్మించాలని కూడా సూచనలు వస్తున్నాయి. ఇవన్నీ సమగ్రమైన కార్యాచరణతో చేపడితే విశాఖకు పాతిక టీఎంసీల నీరు లభిస్తుంది అని అంటున్నారు. అలాగే నగర ప్రజలకు పరిశ్రమలకు అందరికీ సరైన తీరులో నీటిని అందించే విధంగా విశాఖ వాటర్ గ్రిడ్ ని ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని మేధావులు సూచిస్తున్నారు.

Tags:    

Similar News