అధికారులపై రాజకీయ వేట.... ప్రవీణ్ ప్రకాష్ సంచలన కామెంట్స్

ప్రభుత్వ ఉద్యోగుల మీద పొలిటికల్ విచ్ హంటింగ్ అన్నది ఒక క్యాన్సర్ మాదిరిగా మారుతుందని ఆందోళనను ఆయన అందులో వ్యక్తం చేయడం విశేషం.;

Update: 2026-01-07 15:29 GMT

గతంలో రాజకీయాలు వేరు ప్రస్తుతం నడుస్తున్న రాజకీయాలు వేరు. అప్పట్లో ఫిలాసఫీ ఒకటి ఉండేది. కానీ ఇపుడు పూర్తిగా సర్వం రాజకీయం అయిపోయిన నేపథ్యంలో రాజకీయాలలో ఒక వింత వేట స్టార్ట్ అయింది. అది ప్రత్యర్థి రాజకీయ పార్టీలతో ఆగడం లేదు, అపుడు ప్రభుత్వ విధానాలను అమలు చేసిన అధికారులు మీదకు కూడా పోతోంది. దాంతో బలి అవుతున్నది ప్రభుత్వ సర్వీసులలో ఉన అధికారులే అన్నది అంతా అంటున్న మాట.

ఆయన స్వీయ అనుభవంతో :

ఇదిలా ఉంటే మాజీ ఐఏఎస్ అధికారి ప్రవీణ్ ప్రకాష్ అయితే వాలంటరీ రిటైర్మెంట్ అయ్యారు. ఆయన ఈ మధ్య వీడియో బైట్స్ అనేక అంశాల గురించి రిలీజ్ చేస్తున్నారు. అందులో భాగంగా తాజాగా ఆయన రిలీజ్ చేసిన ఒక వీడియో బైట్ అయితే సంచనలం రేపుతోంది. అందులో ఆయన టీడీపీ వైసీపీలను ఉద్దేశించి ఒక రిక్వెస్ట్ పెడుతూ మాట్లాడడం విశేషం. ఇక తన అనుభవం గురించి చెబుతూ ఒకే ఒక్క తప్పు తాను చేశాను అని దాని కారణంగా హీరో నుంచి విలన్ అయ్యాను అని గతంలో చెప్పిన సంగతి కూడా ఉంది. తాను తప్పు చేశాను అన్న ఆలోచనతోనే తన ఉద్యోగానికి స్వచ్చందంగా రాజీనామా చేశాను అని చెప్పారు. ఇవన్నీ దృష్టిలో ఉంచుకుని ఆయన రాజకీయ పార్టీలకు ఒక విన్నపం అయితే పెట్టారు.

అది ఒక క్యాన్సర్ వంటిది :

ప్రభుత్వ ఉద్యోగుల మీద పొలిటికల్ విచ్ హంటింగ్ అన్నది ఒక క్యాన్సర్ మాదిరిగా మారుతుందని ఆందోళనను ఆయన అందులో వ్యక్తం చేయడం విశేషం. అది మహమ్మారి కాకముందే టీడీపీ వైసీపీ కలిసి దానిని నిర్మూలించేలా ఆలోచన చేయాలని కోరారు. ఇక గతంలో పొలిటికల్ విచ్ హంటింగ్ బారిన పడిన వారు ఇద్దరు లేక ముగ్గురు మాత్రమే ఉండేవారు అని ఆయన అన్నారు. అలా గురి అయిన వారిలో అప్పటి ఉమ్మడి ఏపీలో ఎన్నికల కమిషనర్ భన్వర్ లాల్ అని ఆయన గుర్తు చేశారు. అయితే ఈ నంబర్ కాస్తా పది దాకా చేరింది 2014 నుంచి 2019 మధ్యలో అని ఆయన అన్నారు. ఇలా అందులో తీవ్రంగా ప్రభావానికి గురి అయింది. ఇంటలిజెన్స్ మాజీ చీఫ్ ఏబీ వెంకటేశ్వరరావు అని ఆయన చెప్పడం విశేషం.

అలా పెరిగిపోతూ :

ఇక ఈ సంఖ్య తరువాత కాలంతో పాటుగా పెరిగిపోతూ ఈ రోజుకు పదింతలుగా మారిందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. అయితే మరోసారి వైసీపీ ప్రభుత్వం వస్తే కనుక ఈ పొలిటికల్ విచ్ హంటింగ్ కి బలి అయ్యేవారి సంఖ్య ఇంకా పెద్ద నంబర్ కి పెరిగే అవకాశం ఉందని ఆయన చెప్పడం గమనార్హం. అందువల్ల దీనిని నివారించాల్సిన అవసరం ఉంది. ఇక ప్రభుత్వాలు వస్తూ పోతూ ఉంటాయి. కానీ అధికారులు పొలిటికల్ విచ్ హంటింగ్ కి గురి కాకూడదని ఆయన అభిప్రాయపడ్డారు. దీనికి ఎక్కడో ఒక చోట చెక్ పెట్టాల్సిందే అని అన్నారు. ఆ బాధ్యతను టీడీపీ వైసీపీ రెండు పార్టీలు తీసుకోవాల్సిన అవసరం ఉందని అన్నారు ఎవరైనా అధికారులు చిన్న పొరపాటు చేస్తే దానిని పెద్దదిగా మార్చి రాజకీయంగా వేటాడే విధానం అయితే కరెక్ట్ కాదని అన్నారు.

క్షమాపణలతో :

ఇక వైసీపీ హయాంలో ప్రవీణ్ ప్రకాష్ అయితే తన హవా చూపించారు. ఆ సమయంలో కొంతమంది అధికారుల విషయంలో తాను వ్యవహరించిన తీరు పట్ల ఆయన పశ్చాత్తాపం వ్యక్తం చేయడం విశేషం. అంతే కాదు ఇంటలిజెన్స్ మాజీ చీఫ్ ఏబీ వెంకటేశ్వరరావు, అలాగే మరో రిటైర్డ్ ఐఆర్ఎస్ అధికారి జాస్తి కృష్ణ కిశోర్ లకు కూడా బహిరంగ క్షమాపణలు చెప్పడం విశేషం. ఇవన్నీ ఎలా ఉన్నా ప్రవీణ్ ప్రకాష్ ఒక డిబేటబుల్ పాయింట్ ని అయితే జనంలో ఉంచారు. ప్రభుత్వంలో కానీ పార్టీలలో కానీ దీని మీద చర్చ సాగుతుందా లేదా అన్నది కూడా చూడాల్సి ఉంది.

Tags:    

Similar News