మనకీ ‘‘టౌన్ హాల్’’ అవసరమా కేటీఆర్..?
మాంచి జోరు మీదున్న తెలంగాణ రాష్ట్ర ఐటీ మంత్రి కేటీఆర్ ఒక పెద్ద సాహసమే చేస్తున్నారు. చైతన్యానికి నిలువెత్తు రూపమైన తెలంగాణ రాష్ట్రంలో ఆయన విప్లవాత్మక నిర్ణయమే తీసుకున్నారు. అగ్రరాజ్యమైన అమెరికాలో ‘టౌన్ హాల్’ పేరిట సమావేశాలు ఏర్పాటు చేస్తారు. ఈ సమావేశాల్లో పాల్గొనే రాజకీయ నేతల్ని ప్రజలు తమకున్న సందేహాలు అడిగేయొచ్చు. ఇదే తరహా ప్రయోగాన్ని హైదరాబాద్ లోని శిల్పారామంలో ఈ రోజు (మంగళవారం) సాయంత్రం 6.45 గంటల ప్రాంతంలో టౌన్ హాల్ కార్యక్రమాన్ని నిర్వహించాలని నిర్ణయించారు.
తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి 20 నెలలు అవుతోంది. ఈ వ్యవధిలో తెలంగాణ సర్కారు నుంచి ప్రజలు ఎంతో ఆశించారు. కానీ.. అందుకు సంబంధించి జరిగింది చాలా తక్కువ. పెద్ద పెద్ద విషయాల్ని పక్కన పెట్టి..హైదరాబాద్ మహానగరానికి సంబంధించిన అంశాల్నే తీసుకుంటే.. హైదరాబాద్ రోడ్లు గుంతలతో నిండిపోయాయి. రోడ్లు సరిగా ఉన్నదే లేదు. ఇక.. ట్రాఫిక్ గురించి చెప్పాల్సిన అవసరమే లేదు. ట్రాఫిక్ ను కంట్రోల్ చేస్తామని చెప్పినా దానికి సంబంధించి ఎలాంటి మార్పు లేదు. పారిశుద్ధ్యం.. డ్రైనేజీ గురించి ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది. ఇక.. తాగునీటి సమస్య తీవ్రస్థాయిలో ఉంది. నగర శివారు ప్రాంతాల మొదలు నగరం నడిబొడ్డు వరకూ తాగు నీటి కోసం.. కనీస అవసరాల కోసం వినియోగించే నీటి కోసం భారీగా ఖర్చులు పెట్టాల్సిన దుస్థితి. ఇవన్నీ ఒక ఎత్తు అయితే.. వర్షం పడితే రోడ్లు చెరువుల్ని తలపించే పరిస్థితి. దీన్ని సమూలంగా మార్చేస్తామని చెప్పినా ఎలాంటి మార్పు ఇంతవరకూ చోటు చేసుకున్నది లేదు.
ఇవన్నీ నిత్యం సాదాసీదా ప్రజలు ఎదుర్కొనే సమస్యలు. ఇవి కాకుండా ఇచ్చిన వరాలు.. చెప్పిన తీపికబుర్లు చాలానే ఉన్నాయి. ఇలాంటి వాటికి సంబంధించిన ప్రశ్నలకు కేటీఆర్ ఏం చెబుతారన్నది ఒక పెద్ద ప్రశ్న. ప్రయోగాత్మకంగా నిర్వహించనున్న ఈ టౌన్ హాల్ కార్యక్రమంలో ప్రజలేం అడుగుతారు? దీనికి కేటీఆర్ ఏం సమాధానాలు ఇస్తారన్నది ఆసక్తికరమే. గ్రేటర్ ఎన్నికలు ముంగిట్లోకి వచ్చిన వేళ.. ఇలాంటి కార్యక్రమాన్ని నిర్వహించటం అధికారపార్టీ పెద్ద సాహసమే చేస్తుందని చెప్పాలి.
అయితే.. ఇలాంటి ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహిస్తే ఎదురయ్యే సమస్యల గురించి జాగ్రత్తగా స్టడీ చేసిన తర్వాతే.. కేటీఆర్ అండ్ కో ‘టౌన్ హాల్’ కార్యక్రమానికి డిజైన్ చేసినట్లుగా చెబుతున్నారు. ఎందుకంటే.. ఈ కార్యక్రమాన్ని నిర్వహించేది శిల్పారామంలో అన్న విషయాన్ని మర్చిపోకూడదు. మాదాపూర్ నడిబొడ్డున ఉండే శిల్పారామంలో నిర్వహించే ఈ కార్యక్రమానికి కొన్ని వర్గాలు మాత్రమే వచ్చే అవకాశమే ఉందని భావిస్తున్నారు. ఏ పాతబస్తీలోనో.. లేదంటే.. ఇందిరా పార్కు వద్దో కాకుండా శిల్పారామం లాంటి డీసెంట్ ప్లేస్ ను ఎంపిక ద్వారా.. కేటీఆర్ టౌన్ హాల్ కార్యక్రమం వ్యూహాత్మకంగా నిర్వహిస్తున్నట్లుగా చెబుతున్నారు.
ఏది ఏమైనా.. ప్రభుత్వాన్ని సూటిగా ప్రశ్నించే అవకాశంతో పాటు.. ప్రజాభిప్రాయాన్ని తెలుసుకునే అవకాశం ఉన్న ఈ కార్యక్రమాన్ని నిర్వహించటం అంత చిన్న విషయం కాదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. మరి.. కేటీఆర్ ఎలాంటి ప్రశ్నలు ఎదుర్కొంటారన్నది ఆసక్తికరం. సామాన్యుల నుంచి ప్రముఖుల వరకూ ఎవరైనా సరే ఈ కార్యక్రమానికి హాజరు కావొచ్చని తమ మనసులో ఉన్న సందేహాల్ని తీర్చుకోవచ్చని చెబుతున్నారు. మరి.. కేటీఆర్ ను ఎలాంటి ప్రశ్నలు సంధిస్తారో చూడాలి.