కాంగ్రెస్ గుస‌గుస‌: రాములమ్మ.. నాడు ఏమైంది?!

కాంగ్రెస్ పార్టీ నాయ‌కురాలు.. ఎమ్మెల్సీ విజ‌య‌శాంతి.. ఉర‌ఫ్ రాముల‌మ్మ‌.. ఇటీవ‌ల మండ‌లి స‌మావేశా ల్లో చివ‌రి రోజు పెద్ద ఎత్తున మాట్లాడిన విష‌యం తెలిసిందే.;

Update: 2026-04-03 18:30 GMT

కాంగ్రెస్ పార్టీ నాయ‌కురాలు.. ఎమ్మెల్సీ విజ‌య‌శాంతి.. ఉర‌ఫ్ రాముల‌మ్మ‌.. ఇటీవ‌ల మండ‌లి స‌మావేశా ల్లో చివ‌రి రోజు పెద్ద ఎత్తున మాట్లాడిన విష‌యం తెలిసిందే. తెలంగాణ ఉద్య‌మంలో పాలు పంచుకున్న వారికి న్యాయం చేయాల‌ని.. లేక పోతే.. కాంగ్రెస్ ప్ర‌భుత్వం చ‌రిత్ర హీనంగా మిగిలిపోతుంద‌ని ఆమె సంచ ల‌న వ్యాఖ్య‌లు చేశారు. అంతేకాదు.. 25 వేల రూపాయ‌ల పింఛ‌ను, ఉద్యోగాలు, భూములు ఇవ్వాల‌ని కూడా సూచించారు. దీనిపై వేసిన కమిటీ కాల‌యాప‌న క‌మిటీగా ఉంద‌న్నారు.

ఇలా.. ఉద్య‌మ కారుల త‌ర‌ఫున విజ‌య‌శాంతి మండ‌లిలో ప‌లు వ్యాఖ్య‌లు చేశారు. గ‌త ప్ర‌భుత్వంపై( బీ ఆర్ ఎస్)పైనా విమ‌ర్శ‌లు చేసినా.. అవి సునిశితంగా సున్నితంగా ఉన్నాయ‌న్న వాద‌న వినిపించింది. ఇక‌, ఈ వ్య‌వ‌హారంపై కాంగ్రెస్ పార్టీలో గుస‌గుస మొద‌లైంది. ఆమె లేవ‌నెత్తిన అంశాల‌పై ఎవ‌రూ విభేదిం చ‌క‌పోయినా.. ఆమె తీరును మాత్రం కొంద‌రు త‌ప్పుబ‌డుతున్నారు. కాంగ్రెస్ పార్టీ ప్ర‌భుత్వాన్ని ఇరుకున పెట్టేలా.. బీఆర్ ఎస్ వంటి ప్ర‌త్య‌ర్థి పార్టీల‌కు ఊత‌మిచ్చేలా ఆమె వ్యాఖ్యానించార‌ని ఓ మంత్రి ఆఫ్ దిరికార్డుగా అన్నారు.

ఇదే మాట మ‌రికొంద‌రు కూడా చెబుతున్నారు. గ‌తంలో బీఆర్ ఎస్ ప్ర‌భుత్వం ఉన్న‌ప్పుడు.. విజ‌య‌శాం తి ప్ర‌క‌ట‌న‌ల‌కే ప‌రిమితం అయ్యార‌ని అప్ప‌ట్లో ఎందుకు ప్ర‌శ్నించ‌లేద‌ని వ్యాఖ్యానించ‌డం గ‌మ‌నార్హం. అంతేకాదు.. ఇప్పుడు సొంత పార్టీ ప్ర‌భుత్వం ఎన్నో అమ‌లు చేస్తోంద‌ని.. కానీ, విజ‌య‌శాంతికి అవేవీ క‌నిపించ‌డం లేదా? అని ప్ర‌శ్నించారు. తెలంగాణ ఉద్య‌మ‌కారుల‌కు ప్ర‌భుత్వం పింఛ‌న్లు ఇస్తున్న విష‌యాన్ని ప్ర‌స్తావించారు. కానీ.. విజ‌య‌శాంతి ప్ర‌త్యేక ఎజెండా పెట్టుకుని మాట్లాడార‌ని.. ఒక వ‌ర్గాన్ని రెచ్చ‌గొట్టే ధోర‌ణి క‌నిపించింద‌ని మెజారిటీ నాయ‌కులు వ్యాఖ్యానించారు.

కాగా.. కాంగ్రెస్ పార్టీలోనే ఉన్న‌ప్ప‌టికీ.. రాముల‌మ్మ ప్ర‌త్యేక శైలిని అవలంభిస్తున్న విష‌యం తెలిసిందే. రాష్ట్ర‌స్థాయి నాయ‌కుల కంటే కూడా ఆమె జాతీయ స్థాయి నాయ‌కుల‌తోనే ఎక్కువ‌గా ట‌చ్‌లో ఉంటున్నారు. అంతేకాదు.. రాష్ట్ర ప్ర‌భుత్వ ప‌నిలోనూ ఆమె భాగ‌స్వామ్యం త‌క్కువ‌గానే ఉంది. కొన్ని కొన్నిసంద‌ర్భాల్లో అస‌లు లేనే లేద‌న్న వాద‌న కూడా ఉంది. ఈ నేప‌థ్యంలోనే గ‌త రెండు రోజులుగా విజ‌య‌శాంతి వ్య‌వ‌హారంపై పార్టీలో చ‌ర్చ‌సాగుతోంది.

Tags:    

Similar News