ఏపీలో స్థానిక స‌మ‌రం.. కీల‌క అప్డేట్‌!

స్థానిక ఎన్నిక‌ల‌కు సంబంధించి ప్ర‌ధానంగా స్థానికంగా జ‌రుగుతున్న అభివృద్ధి సంక్షేమ కార్య‌క్ర‌మా ల‌పై నే కూట‌మి ప్ర‌భుత్వం దృష్టి పెట్ట‌నుంది.

Update: 2026-07-13 12:30 GMT

ఏపీలో స్థానిక ఎన్నిక‌లకు సంబంధించి ప్ర‌భుత్వం కీల‌క అప్డేట్ ఇచ్చింది. ఈ ఏడాది సెప్టెంబ‌రు-అక్టోబరు మాసాల్లోనే స్థానిక ఎన్నిక‌లు నిర్వ‌హించేందుకు ప్ర‌భుత్వం అన్ని ఏర్పాట్లు చేస్తున్న‌ట్టు ప్ర‌భుత్వం క్లారిటీ ఇచ్చేసింది. అంటే.. మ‌రో రెండు మాసాల్లోనే స్థానిక స‌మరానికి రంగం రెడీ అవుతోంది. ఇప్ప‌టికే పార్టీ ప‌రంగా దీనికి సంబంధించిన కార్యాచ‌ర‌ణ‌ను కూడా సిద్ధం చేస్తున్నార‌ని పార్టీ పేర్కొన‌డం గ‌మ‌నార్హం.

సెప్టెంబరు-అక్టోబ‌రు మాసాల్లోనే పంచాయ‌తీ ఎన్నిక‌లు నిర్వ‌హించ‌నున్నారు. ప్ర‌స్తుతం గ్రామీణ ప్రాంతా ల్లో దీనికి సంబంధించిన సంద‌డి మొద‌లైంది. ఆ త‌ర్వాత‌.. జ‌న‌వ‌రి-ఫిబ్ర‌వ‌రి మ‌ధ్య మునిసిప‌ల్ ఎన్నికలు, ఆ త‌ర్వాత కార్పొరేష‌న్ ఎన్నిక‌లు ఇలా.. వేర్వేరుగా నిర్వ‌హించాల‌ని నిర్ణ‌యించారు. త‌ద్వారా.. ఎక్కు వ స‌మ‌యం ఉండ‌డంతో ప్ర‌చారం చేసుకునేందుకు, నాయ‌కుల ఎంపిక‌కు కూడా అవ‌కాశం ఉంటుంద‌ని అంచ‌నా వేస్తున్నారు.

స్థానిక ఎన్నిక‌ల‌కు సంబంధించి ప్ర‌ధానంగా స్థానికంగా జ‌రుగుతున్న అభివృద్ధి సంక్షేమ కార్య‌క్ర‌మాల‌ పైనే కూట‌మి ప్ర‌భుత్వం దృష్టి పెట్ట‌నుంది. పంచాయ‌తీల్లో ఇప్ప‌టికే సాగుతున్న ప‌నులు.. ఆగ‌స్టు చివ‌రి నాటికి పూర్తికానున్నాయి. దీంతో ఆ త‌ర్వాతే ఎన్నిక‌ల‌కు వెళ్లాల‌ని నిర్ణ‌యించారు. అలానే.. కార్పొరేష‌న్ ఎన్నిక‌ల స‌మ‌యానికి న‌గ‌రాల్లో అభివృద్ధి కార్య‌క్ర‌మాలు పూర్తి చేయ‌నున్నారు. అంటే.. ర‌హ‌దారుల నిర్మాణం.. సంక్షేమ ప‌థ‌కాల అమ‌లుపై దృష్టి పెట్ట‌నున్నారు.

ఇదే స‌మ‌యంలో కూట‌మి పార్టీల మ‌ధ్య స‌మ‌న్వ‌యం మ‌రింత పెంచేదిశ‌గా రానున్న నెల రోజుల్లో మూడు పార్టీలు సంయుక్తంగా స‌మావేశాలు నిర్వ‌హించ‌నున్నారు. ఇప్ప‌టికే దీనికి సంబంధించిన కార్యాచ‌ర‌ణ‌ను కూడా రెడీ చేశార‌ని తెలిసింది. త‌ద్వారా స్థానికంగా బ‌ల‌మైన వ్యూ\హంతో ముందుకు సాగాల‌ని ప్ర‌భుత్వం భావిస్తోంది. ఇదే స‌మ‌యంలో పార్టీ ప‌రంగా యువ‌త‌ను ఎంక‌రేజ్ చేయ‌నున్న‌ట్టు టీడీపీ చెబుతోంది.నిజానికి స్థానికంగా జ‌రిగే ఎన్నిక‌ల్లో అధికార పార్టీల‌కు అనుకూలంగా ఓటు బ్యాంకు ఉంటుంది. దీనిని మ‌రింత పెంచుకునేందుకు ప్ర‌య‌త్నిస్తున్నారు.

Tags:    

Similar News