కేటీఆర్ చేత ‘వారెవ్వా’ అనిపించిన పవన్
మెగాస్టార్ ను మినహాయిస్తే.. మెగా హీరోలందరిలో పవర్ స్టార్ పవన్ కల్యాణ్ కు ఉన్నంత ఫాలోయింగ్ మరెవరికీ ఉండదన్న విషయాన్ని కాదనలేం. మెగా క్యాంప్ కు సంబంధించి ఏ హీరో ఫంక్షన్ జరిగినా.. పవన్ ప్రజెన్స్ కోసం మెగా అభిమానులు విపరీతంగా తపిస్తుంటారు. అయితే.. ఫ్యాన్స్ ను నిరాశ పరస్తూ పవన్ పెద్దగా కనిపించరు. ఆ లోటును భర్తీ చేయటానికన్నట్లు.. పవన్ మీద తమకున్న అభిమానాన్ని ప్రదర్శించేందుకు మెగా అభిమానులు తరచూ ‘పవన్.. పవన్’ అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేయటం తెలిసిందే.
ఇలా కేకలు వేయటంపై అల్లు అర్జున్.. నాగబాబు లాంటి వాళ్లు ఫ్యాన్స్ మీద ఆగ్రహం వ్యక్తం చేయటాన్ని మర్చిపోలేం. అయినప్పటికీ.. పవన్ మీద తమకున్న అభిమానాన్నిప్రదర్శించే ఏ అవకాశాన్ని మెగా అభిమానులు వదులుకోరన్న విషయం తాజాగా నిర్వహించిన ధృవ ప్రీ రిలీజ్ ఫంక్షన్ లో మరోసారి నిరూపితమైంది. ఈ కార్యక్రమానికి తెలంగాణ రాష్ట్ర మంత్రి కేటీఆర్ హాజరయ్యారు.
తన ప్రసంగంలో భాగంగా కేటీఆర్ నోట పవన్ ప్రస్తావన వచ్చింది. అంతే.. మెగా అభిమానుల నుంచి అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. వారి ఉత్సాహం కేటీఆర్ ను సైతం ఆశ్చర్యానికి గురి చేయటమే కాదు.. ఆయన నోటి నుంచి అప్రయత్నంగా.. ‘వారెవ్వా’ అన్న మాట వచ్చేసింది. ఆసక్తికరమైన అంశం ఏమిటంటే.. ఈ కార్యక్రమం మొదలైనప్పటి నుంచి పవన్.. పవన్ అంటూ అరుస్తున్న మెగా అభిమానులు.. అల్లు అరవింద్ మాట్లాడేటప్పుడు ఈ హోరు మరింత పెరగటాన్ని చాలామంది నోట్ దిస్ పాయింట్ అని రిజిష్టర్ చేసుకోవటం కనిపించింది.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/