కర్ణాటకలో అమరావతి నినాదాలు!
ఏపీ మంత్రి, టీడీపీ యువ నాయకుడు నారా లోకేష్ తాజాగా కర్ణాటకలో పర్యటించారు. ఈ సందర్భంగా అక్కడ నివసిస్తున్న తెలుగు వారు పెద్ద ఎత్తున లోకేష్‌కు ఘన స్వాగతం పలికారు.;
ఏపీ మంత్రి, టీడీపీ యువ నాయకుడు నారా లోకేష్ తాజాగా కర్ణాటకలో పర్యటించారు. ఈ సందర్భంగా అక్కడ నివసిస్తున్న తెలుగు వారు పెద్ద ఎత్తున లోకేష్‌కు ఘన స్వాగతం పలికారు. గజ మాలలను క్రేన్లతో తీసుకువచ్చి.. లోకేష్‌ను సాదరంగా ఆహ్వానించారు. దీంతో వారి అభిమానానికి లోకేష్ ఉప్పొంగిపోయారు. కర్ణాటకలోని రాయచూర్‌లో ఉన్న తెలుగు వారికి చెందిన శ్రీకృష్ణదేవరాయ విద్యాసంస్థ ప్రాంగణంలో జరి గిన కార్యక్రమానికి లోకేష్ హాజరయ్యారు.
ఈ విద్యాసంస్థకు కేంద్ర ప్రభుత్వం సైనిక స్కూల్‌ను కేటాయించింది. ఇది టీడీపీలోని ఓ కీలక నాయకుడి కి చెందిన విద్యాసంస్థగా చెబుతున్నారు. ఈ నేపథ్యంలో ప్రత్యేక ఆహ్వానం మేరకు లోకేష్.. అక్కడికి వెళ్లా రు. ఆయనతోపాటు కేంద్ర మంత్రి కుమార స్వామి కూడా హాజరయ్యారు. రాయచూరు జిల్లాలోకి ప్రవేశించ డంతోనే.. అక్కడి తెలుగు వారు.. నారా లోకేష్‌కు ఆహ్వానం పలుకుతూనే.. జై అమరావతి నినాదాలతో హోరెత్తించారు.
అమరావతికి చట్టబద్ధత కల్పించే అంశంపై.. పార్లమెంటులో బిల్లు పాసైన సందర్భాన్ని పురస్కరించు కుని జై అమరావతి అని రాసి ఉన్న పోస్టర్లను కూడా ప్రదర్శించారు. ఈ ఊహించని ఆహ్వానంతో నారా లోకేష్ ఉబ్బితబ్బిబ్బయ్యారు. తనకు స్వాగతం పలికిన ప్రతి ఒక్కరికీ ఆయన ధన్యవాదాలు తెలిపారు. ఏపీ రాజధానిగా అమరావతి ఉండాలని కర్ణాటకలోని తెలుగువారు సైతం కోరుకుంటున్నారని.. ఇది తనకు ఎంతో సంతోషాన్నిచ్చిందని ఆయన మంత్రి కుమారస్వామితో ఆయన వ్యాఖ్యానించారు.