తెలంగాణ బీజేపీకి క్లాస్... రీల్స్ మీమ్స్ అంటూ !
తెలంగాణా బీజేపీ నేతలకు అధినాయకత్వం మరోసారి దిశా నిర్దేశం చేసినట్లుగా తెలుస్తోంది.
తెలంగాణా బీజేపీ నేతలకు అధినాయకత్వం మరోసారి దిశా నిర్దేశం చేసినట్లుగా తెలుస్తోంది. పార్టీకి తెలంగాణాలో మంచి అవకాశాలు ఉన్నాయని పేర్కొంది. అయితే అవకాశాలను చేజార్చుకుంటున్నారు అని మండిపడుతోంది బీజేపీ హైకమాండ్. పార్టీ తరఫున చేయాల్సినవి చేయడం లేదని జనాలకు ఎలా కనెక్ట్ అవుతామని కూడా క్లాస్ ని గట్టిగా తీసుకుంటోంది అంటున్నారు. ఇదిలా ఉంటే కేంద్ర స్థాయిలో కాక్రోచ్ దెబ్బ తిన్న బీజేపీకి మరో వైపు అదే కాక్రోచ్ మేలు కొలుపు పలికింది అని అంటున్నారు. అందుకే సోషల్ మీడియా వాడకం పెరగాలని ఈ మధ్యనే ప్రధాని నరేంద్ర మోడీ కేబినెట్ సహచరులకు సూచించారు. ఇప్పుడు బీజేపీ కేంద్ర పెద్దలు ఇదే విషయం మీద సూచనలు చేస్తున్నారు.
అక్కడే వెనుకబడ్డారు :
ఈ రోజున సోషల్ మీడియా ప్రభావం ఎంతో ఎక్కువగా ఉందని అయితే దానిని సరిగ్గా వాడుకోవడంలో మాత్రం తెలంగాణా బీజేపీ నేతలు పూర్తిగా వెనకబడి ఉన్నారని బీజేపీ పెద్దలు స్పష్టం చేశారు అని అంటున్నారు. అసలు ఎందుకు సోషల్ మీడియాను పక్కన పెడుతున్నారని కూడా గట్టిగా అడిగారని అంటున్నారు. ప్రస్తుతం అంతా డిజిటల్ యుగం నడుస్తోందని కూడా చెప్పుకొచ్చారు. ఈ నేపథ్యంలో సోషల్ మీడియాతో ఆన్ లైన్ తో కనెక్షన్ లేకపోతే పార్టీ ఎలా ఎదుగుతుందని కూడా ప్రశ్నిస్తున్నారని అంటున్నారు.
రీల్స్ మీమ్స్ అంటూ :
ఇక మీదట తెలంగాణా బీజేపీ నేతలు అంతా రీల్స్ చేయాల్సిందే అని కూడా ఆదేశాలు జారీ చేశారని భోగట్టా. అంతే కాదు మీమ్స్ వంటివి చేయడం ద్వారా ప్రజలకు ఎప్పటికప్పుడు తమ వైపు తిప్పుకునేందుకు ప్రయత్నం చేయాలని కూడా సూచించారని అంటున్నరు. ప్రతీ ఒక్క నేత ఇక మీదట దీనిని ఒక సవాల్ గా స్వీకరించాలని కోరారని అంటున్నారు. అంతే కాదు ఎవరికి వారుగా ఎక్కువ మంది ఫాలోవర్స్ ని పెంచుకోవాలని కోరారని అంటున్నారు.
సర్కార్ ని నిలదీయాలి :
తెలంగాణా ప్రభుత్వాన్ని ఆన్ లైన్ లో సోషల్ మీడియాలో ఎక్కువగా నిలదీస్తే మంచి ఫలితాలు ఉంటాయని కూడా కేంద్ర బీజేపీ నాయకత్వం చెబుతోంది అంటున్నారు. అది కూడా ఆషామాషీగా కాకుండా ఇరుకున పెట్టేలా వ్యూహాత్మకంగా ఉండాలని కోరింది. ఈ రోజున డిజిటల్ ప్రచారం అన్నది ఎంతో కీలకం అని చెబుతోంది. ఆ విధంగా సోషల్ మీడియా హ్యాండిల్స్ ద్వారా ఎవరైతే ప్రజలకు చేరువ అవుతారో వారే పొలిటికల్ గా హిట్ అవుతున్నారని కూడా పేర్కొంది.
జోరు పెరుగుతుందా :
కేంద్ర నాయకత్వం ఆదేశాలతో తెలంగాణా బీజేపీ నేతలలో జోరు పెరుదుతుందా అన్న చర్చ సాగుతోంది. ఇంతకాలం వారు రొటీన్ రాజకీయమే చేశారు అని అంటున్నారు. కానీ కేంద్ర పెద్దల ఆదేశాలతో చాలా మంది సోషల్ మీడియా వైపు ఫోకస్ పెంచారని అంటున్నారు. ఎవరికి వారుగా ఇపుడు ఖాతాలను హ్యాండిల్ చేసేలా సిబ్బందిని ఎక్కడికక్కడ ప్రత్యేకంగా నియమించుకున్నారని కూడా చెబుతున్నారు. అటు కాంగ్రెస్ ని మరో వైపు బీఆర్ ఎస్ ని కూడా గట్టిగా సోషల్ మీడియా ద్వారా బీజేపీ విమర్శించడానికి రంగం సిద్ధం చేసుకున్నారు అని అంటున్నారు. మరి ఇది ఎంతవరకూ ప్రభావం చూపిస్తుంది అన్నది చూడాల్సి ఉంది. ఏది ఏమైనా తెలంగాణా కమలానికి డిజిటల్ హంగులు అద్దితే 2028లో అధికారం సొంతం అవుతుందా లేదా అంటే ఆ జోరు పెరగాలి, జనాలకు కనెక్ట్ కావాలి అపుడు చూడాల్సిందే అన్న మాట వినవస్తోంది.