24 క్రిమినల్ కేసులు-2 దొంగతనాలు-12 కిలోల బంగారం!
అయితే.. అందరికీ షాకిచ్చే అంశం ఏంటంటే.. ఈ ఇండిపెండెంట్ అభ్యర్తి.. తాజాగా నమోదైన ఓ క్రిమిన ల్ కేసులో అరెస్టయి.. ప్రస్తుతం జైల్లో ఉన్నాడు.;
ఇవన్నీఏంటి? అని ఆశ్చర్యంగా ఉందా..?. ఎన్నికల వేళ కదా.. అభ్యర్థులు సమర్పించే అఫిడవిట్లలోని చిత్రాలు ఇవి!. ఒకే అభ్యర్థి.. అది కూడా ఇండిపెండెంటుగా బరిలో నిలిచిన ఓ అభ్యర్థి.. కేంద్ర ఎన్నికల సంఘానికి సమర్పించిన ఎన్నికల అఫిడవిట్‌లో సమర్పించిన వివరాలు ఇవీ. తనపై 24 క్రిమినల్ కేసులు ఉన్నాయని, మరో 2 దొంగతనాల కేసులు కూడా నమోదయ్యాయని పేర్కొన్నారు. అంతేకాదు.. తన చరాస్థుల్లో బంగారం కీలకమని పేర్కొన్నారు. ఇది 12 కిలోలుగా ఆయన పేర్కొన్నారు.
అయితే.. అందరికీ షాకిచ్చే అంశం ఏంటంటే.. ఈ ఇండిపెండెంట్ అభ్యర్తి.. తాజాగా నమోదైన ఓ క్రిమిన ల్ కేసులో అరెస్టయి.. ప్రస్తుతం జైల్లో ఉన్నాడు. అక్కడి నుంచే తన ఎన్నికల నామినేషన్‌ను దాఖలు చేశారు. ఆయనే తమిళనాడుకు చెందిన హరి నాడార్. ఈయన బాగా సంపన్నుడు. కానీ.. అదేసమయం లో నేర చరిత్ర కూడా సొంతం. రాజకీయాలంటే ఇష్టం. దీంతో పలు పార్టీల్లో ప్రయత్నాలు చేశారు. టికెట్ కోసం ఎన్ని కోట్లయినా సమర్పించేందుకు రెడీ అయ్యారు.
కానీ.. ఎక్కడో ఆవ గింజంత అదృష్టం మిస్ అయింది. దీంతో ఏ పార్టీ కూడా ఆయనను పిలవలేదు.. కండు వా కప్పలేదు. దీంతో ఎన్నికల వేళ ఒంటరి పోరు తప్పడం లేదు. పనాంగాట్టు పడై అనే వ్యాపార సంస్థకు హరి అధిపతి. ఆయన చేతికింద ఓ రెండు వేల మంది పనిచేస్తున్నారు. నిత్యం బంగారు కంకణాలు.. మొ హరీలతో మనిషికన్నా బంగారమే ఎక్కువగా కనిపించేలా ముస్తాబవుతాడు.
కాగా.. ప్రస్తుత ఎన్నికల్లో అలంగుళం నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నారు. ఓ కేసులో అరెస్టయి ప్రస్తు తం జిల్లా జైల్లో ఉన్న నాడార్ అక్కడ నుంచే ఆయన ఎన్నికల నామినేషన్ దాఖలు చేశారు. జైలు అధికారి సమక్షంలోనే నామినేషన్ ఫిలప్ చేసిన ఆయన.. అక్కడే లాంఛనాలు పూర్తి చేసి.. తన అనుచరుడి ద్వా రా నియోజకవర్గం అధికారులకు పంపించారు. కాగా.. గత 2021 అసెంబ్లీ ఎన్నికల్లో కూడా పోటీ చేసిన నాడార్ దాదాపు 38 వేల ఓట్లు తెచ్చుకున్నారు. అయితే.. డిపాజిట్ మాత్రం దక్కలేదు.