ఆ కొట్టేవాడు మావాడు కాదన్న కేటీఆర్
అందుబాటులోకి వచ్చిన సాంకేతికత.. అక్కరకు వచ్చిన సోషల్ మీడియా పుణ్యమా అని.. ఎక్కడేం జరిగినా.. ఏదో ఒక కెమేరా కన్ను జరిగిన దాన్ని తనలో నిక్షిప్తం చేసుకునే పరిస్థితి. తాజాగా ఒక వీడియో వైరల్ గా మారింది. తెలంగాణ అధికారపక్షంలో తీవ్ర కలకలాన్ని రేపిన ఆ వీడియోలో ఒక వ్యక్తి ఉద్యోగాలు ఇప్పిస్తానని చెప్పి మోసం చేయటమే కాదు.. ఇద్దరు యువకుల్ని చితకబాదిన వైనం ఆన్ లైన్లో వైరల్ గా మారింది.
అయితే.. అలా చావబాదిన వ్యక్తి తెలంగాణ అధికారపక్షానికి చెందిన నేతగా చెబుతున్నారంటూ ఒక జర్నలిస్ట్ పోస్ట్ చేశారు. ఇది కాస్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ప్రజల్లోనూ.. పార్టీలోనూ చర్చగా మారిన ఈ వ్యవహారంపై తెలంగాణ రాష్ట్ర మంత్రి కేటీఆర్ రియాక్ట్ అయ్యారు. సదరు వైరల్ వీడియోలో ఉన్న వ్యక్తి తమ పార్టీకి చెందిన వ్యక్తి కాదని.. అతను టీఆర్ ఎస్ సభ్యుడు ఎంతమాత్రం కాదని.. ఆ విషయాన్ని మంత్రి కమ్ సూర్యాపేట ఎమ్మెల్యే జగదీశ్ రెడ్డి ధ్రువీకరించినట్లుగా కేటీఆర్ పేర్కొన్నారు.
సదరు వీడియోలో యువకుల్ని చావబాదిన వ్యక్తి తాను టీఆర్ ఎస్ పార్టీ నేతనని.. తనకు మంత్రి జగదీశ్ రెడ్డి ఫాలోయర్ ని అని చెప్పుకోవటం కనిపించింది. తనకు సూర్యాపేటలో మంచి పరపతి ఉన్నట్లుగా చెబుతున్న సదరు వ్యక్తి ఉద్యోగాలు ఇప్పిస్తానంటూ పలువురు యువకుల వద్ద డబ్బులు వసూలు చేసి మోసం చేస్తున్న వైనం వెలుగులోకి వచ్చింది. దీనిపై స్పందించిన కేటీఆర్ ఆ వీడియోలో ఉన్న వ్యక్తికి తమ పార్టీకి సంబంధం లేదని తేల్చటమే కాదు.. సదరు వ్యక్తి వివరాలు సేకరించి.. అతడిపై చర్యలు తీసుకోవాలంటూ తెలంగాణ డీజీపీని కోరారు.కేటీఆర్ లాంటి వ్యక్తి రియాక్ట్ అయ్యాక.. చట్టం తన పని తాను చేయకుండా ఉంటుందా..?
Full View
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/