మా నాన్న ఎంత మొనగాడంటే..?
ఒకరి గొప్పతనం గురించి చెప్పాలంటే మరొకరిని తిట్టేయాల్సిందేనా? మిగిలిన రంగాల సంగతి ఎలా ఉన్నా.. రాజకీయంలో మాత్రం ఇలాంటి ధోరణి మామూలే. తమ అధినేత ఎంత గొప్పవాడన్న విషయాన్ని చెప్పటానికి రాజకీయ ప్రత్యర్థులపై తీవ్రస్థాయిలో విరుచుకుపడటం మామూలే. తాజాగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ కుమారుడు.. మంత్రి కేటీఆర్ ఇదే రీతిలో చెలరేగిపోయారు.
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రికి.. ఏపీ ముఖ్యమంత్రికి మధ్యనున్న తేడాల్ని ప్రస్తావిస్తే.. ఆయన చాలానే విషయాలు చెప్పుకొచ్చారు. తన తండ్రి.. ముఖ్యమంత్రి గొప్పతనాన్ని విపరీతంగా పొగిడేసిన కేటీఆర్.. అదే సమయంలో ఏపీ ముఖ్యమంత్రిపై తీవ్రస్థాయిలో వ్యాఖ్యలు చేశారు. ముఖ్యమంత్రి.. తనతండ్రి గురించి గొప్పగా చెప్పేసుకున్న కేటీఆర్ చెప్పిన మాటలు చూస్తే..
తక్కువ పని చేసి ఎక్కువగా ప్రచారం చేసుకోవటం ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుకు అలవాటు అని.. కానీ.. తమ ముఖ్యమంత్రి కేసీఆర్ మాత్రం ఎక్కువ పని చేసి తక్కువగా చెప్పుకోవటం అలవాటుగా చెప్పుకొచ్చారు. అంతేకాదు.. మామకు వెన్నుపోటు పొడిచిన చంద్రబాబు.. మీడియా లక్ష్యంగా రాజకీయాలు నడిపిస్తారని విమర్శలు చేశారు.
అదే సమయంలో కేసీఆర్ మాత్రం 14 ఏళ్లు ఉద్యమం చేసి.. చావు నోట్లో తలపెట్టి ప్రజల కోసం పని చేస్తున్నట్లుగా గొప్పులు చెప్పుకున్నారు. ఖమ్మం జిల్లాకు చెందిన నేతలు.. ప్రజలు ఏపీ ముఖ్యమంత్రి గురించి పట్టించుకోవటం మానేయాలని కోరారు. చూస్తుంటే.. జిల్లాలో ఏపీ ముఖ్యమంత్రి ఇమేజ్ ను డ్యామేజ్ చేయటమే లక్ష్యంగా పెట్టుకున్నట్లు కనిపిస్తోందన్న వాదనలు వినిపిస్తున్నాయి.