కేటీఆర్.. రాజకీయ దురదగొండి
కల్వకుంట్ల చంద్రశేఖర రావు రాజకీయ దురందరుడు అయితే ఆయన తనయుడు కల్వకుంట్ల తారక రామారావు రాజకీయ దురదగొండి అనే వ్యాఖ్యలు ఇప్పుడు ప్రతిపక్షాలతోపాటు వివిధ వర్గాల నుంచి వినవస్తున్నాయి. ఇతర పార్టీల్లోని బలమైన ఒకరిద్దరిని దగ్గర చేసుకుందామని కేసీఆర్ పావులు కదుపుతుంటే తన మాటల ద్వారా వారిని కేటీఆర్ దూరం చేస్తున్నారని అంటున్నారు. కేటీఆర్ తీరుపై కొంతమంది టీఆర్ ఎస్ శ్రేణులు కూడా అసంతృప్తి వ్యక్తం చేస్తుండడం విశేషం.
జీహెచ్ ఎంసీ ఎన్నికల నేపథ్యంలో మజ్లిస్ పార్టీని ఎలా దువ్వాలా అని కేసీఆర్ నిరంతరం తాపత్రయ పడుతున్నారని, తెలంగాణలో అధికారంలోకి వచ్చిన ఏడాదిన్నరగా ఆయన అదే పనిలో ఉన్నారని విశ్లేషకులు చెబుతున్నారు. అదే సమయంలో జీహెచ్ ఎంసీ ఎన్నికలు మరో నాలుగు నెలల్లో జరుగుతాయనగా అసెంబ్లీ వేదికగా కేటీఆర్ మజ్లిస్ నేత అక్బరుద్దీన్ తో వాగ్వాదం పెట్టుకున్నారని, దాంతో కేసీఆర్ ఏడాదిపాటు పడిన శ్రమంతా వృథా అయిందని చెబుతున్నారు. అక్బరుద్దీన్ తో వాగ్వాదం పెట్టుకున్న కేటీఆర్ చివరికి అసెంబ్లీలోనే కాస్త చింతిస్తూ మాట్లాడాల్సి వచ్చందని, అక్బరుద్దీన్ ఇంటికి వెళ్లి బుజ్జగించాల్సి వచ్చిందని కూడా వివరిస్తున్నారు. అయినా, మజ్లిస్ నేతలు కేటీఆర్ మీద కాస్త ఆగ్రహంగానే ఉన్నారని చెబుతున్నారు.
ఇక, డి.శ్రీనివాస్ తరహాలోనే తన కుమారుడి రాజకీయ భవిష్యత్తు దృష్ట్యా జానారెడ్డి కూడా త్వరలోనే కారెక్కుతారనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. అసెంబ్లీలో కూడా అధికార పక్షానికి అనుకూలంగా జానారెడ్డి మాట్లాడుతున్నారని, వ్యవహరిస్తున్నారనే అపవాదులనూ ఆయన మూటకట్టుకుంటున్నారు. కొంతమంది కాంగ్రెస్ నాయకులు అయితే జానారెడ్డిని టీఆర్ఎస్ నాయకుడిగానే అభివర్ణించేస్తున్నారు. ఇటువంటి పరిస్థితుల్లో జానారెడ్డిని జానా కూడా చేయడంటూ కేటీఆర్ నిందాపూర్వక వ్యాఖ్యలు చేశారు. దాంతో జానారెడ్డికి మండిపోయి నా గురించి కావాలంటే మీ అయ్యను అడుగు చెబుతాడు అని ఎదురు దాడి చేశారు. దాంతో టీఆర్ఎస్ కు కాస్త సానుకూలంగా ఉన్నవారిని కేటీఆర్ తన వ్యాఖ్యలతో దూరం చేస్తున్నారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.