కేటీఆర్.. ఆ సీక్రెట్ ఏదో చెప్పేయొచ్చుగా
ఇద్దరు చంద్రులు కలవాలని తెలుగు రాష్ట్రాల్లోని మెజారిటీ ప్రజలు కోరుకుంటారన్నది వాస్తవం. ఇద్దరు ముఖ్యమంత్రులు కలిస్తే రెండు రాష్ట్రాలకు మంచిదనే చాలామంది భావిస్తారు. ఐతే ఈ విషయంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్నేహ హస్తం చాటినా.. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అందుకు స్పందించని రోజులున్నాయి. రెండు కొత్త రాష్ట్రాలు ఏర్పాటయ్యాక ఏడాది పాటు ఇద్దరి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేది. కానీ ఈ మధ్య పరిస్థితి కొంచెం మారింది. ఇద్దరూ చేయి చేయి కలుపుతున్నారు. గ్రేటర్ ఎన్నికలు దగ్గర పడుతున్న నేపథ్యంలో సీమాంధ్రుల మనసు గెలవడానికేనో ఏమో కానీ.. తోటి తెలుగు రాష్ట్రంతో కయ్యం పెట్టుకోవట్లేదు కేసీఆర్ అండ్ కో. సీమాంధ్రులు మెచ్చే మాటలు వస్తున్నాయి ఆ పార్టీ నాయకుల నుంచి. ముఖ్యంగా గ్రేటర్ ఎన్నికల బాధ్యతలు నెత్తిన వేసుకున్న కేటీఆర్ తియ్యనైన మాటలే చెబుతున్నారు. ఇద్దరు ముఖ్యమంత్రులు కలవడానికి సుముఖంగానే ఉన్నారని.. కానీ అది కొందరికి నచ్చట్లేదని సెలవిచ్చాడు కేటీఆర్.
ఎన్నికల ప్రచారం లో భాగంగా ఖైరతాబాద్ లో ఏర్పాటుచేసిన ఓ సమావేశంలో కేటీఆర్ మాట్లాడుతూ.. తమకు ఎవరి పట్టా ధ్వేషం - కక్ష లేవంటూ పరోక్షంగా సీమాంధ్రుల్ని ఉద్దేశించి వ్యాఖ్యానించారు. 2014 ఎన్నికలు భావోద్వేగాల మధ్య జరిగాయని.. అప్పుడు తమను హైదరాబాద్ ప్రజలు అంతగా నమ్మలేదని కేటీఆర్ అన్నారు. ఉద్యమ సమయంలో సీమాంధ్రులపై పరుషంగా మాట్లాడామని.. కానీ ఈ 18 నెలల్లో తమ పరిపాలన ఏంటో సీమాంధ్రులు కూడా చూశారని.. అందుకే తామేం చేశామో చూసి, ఆత్మవిమర్శ చేసుకుని ఓటేయాలని ఆయన కోరారు. తెలుగు ప్రజలు రాష్ట్రాలుగా విడిపోయినప్పటికీ అన్నదమ్ముల్లాగా కలిసి ఉండాలన్నదే తమ ఆలోచన అని చెప్పారు. తమ సీఎం కేసీఆర్ అమరావతికి వెళ్లగా... ఏపీ సీఎం చంద్రబాబు చండీయాగానికి హాజరయ్యారని.. ఐతే ఇద్దరు సీఎంలు కలిసి ఉండటం కూడా కొందరికి నచ్చడం లేదని కేటీఆర్ వ్యాఖ్యానించారు. ఐతే సీఎంలు కలవడం ఇష్టం లేని ఆ వ్యక్తులెవరో సీక్రెట్ గా ఉంచకుండా జనాలకు కూడా చెప్పేస్తే బాగుండదేమో కేటీఆర్.