కేటీఆర్ కొత్త ఎత్తుగ‌డ‌

Update: 2015-12-12 11:56 GMT
తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్ త‌న‌యుడు కేటీఆర్ కొత్త త‌ర‌హా రాజ‌కీయానికి శ్రీ‌కారం చుట్టారు. ఆప‌రేష‌న్ ఆక‌ర్ష్‌ను పెద్ద ఎత్తున నిర్వ‌హిస్తున్న టీఆర్ఎస్ పార్టీలో ఇన్నాళ్లు కేసీఆర్ లేదా పార్టీ అగ్ర‌నేత‌లే కొత్త వారికి గాలం వేయ‌డంలో బిజీబిజీగా ఉండేవారు. కానీ ఇపుడు ఆ బాధ్య‌త‌ల‌ను మంత్రి కల్వకుంట్ల తారక రామారావు చేప‌ట్టారు. మాజీ మంత్రి, సీబీఐ మాజీ డైరెక్టర్ విజయరామారావు టీడీపీకి గుడ్‌బై చెప్పిన నేప‌థ్యంలో వెంట‌నే కేటీఆర్ రంగంలోకి దిగారు. టీఆర్‌ఎస్ పార్టీలోకి ఆయ‌న్ను ఆహ్వానించారు. అంతే కాకుండా పార్టీలో ప్ర‌ముఖ‌ స్థానం క‌ట్ట‌బెడుతామ‌ని చెప్పారు. దీంతో పాటు విజయరామారావు కుమార్తె అన్నపూర్ణకు టీఆర్ఎస్ పార్టీలో సముచిత స్థానం కల్పిస్తామని మంత్రి కేటీఆర్ హామీయిచ్చినట్టు తెలుస్తోంది.

విజయరామారావును ఆయ‌న నివాసంలో కలిసిన అనంతరం మంత్రి కేటీఆర్‌ విలేకరులతో మాట్లాడుతూ..విజయరామారావు లాంటి అనుభవం కలిగిన వారి సేవలు రాష్ర్టానికి అవసరమన్నారు. తెలంగాణ అభివృద్ధిలో విద్యావంతులు కలిసి రావడం శుభపరిణామమని...విజయరామారావు తీసుకున్న నిర్ణయం ప్రజాస్వామ్యం బలోపేతానికి తోడ్పడుతుందని వెల్లడించారు. విజయరామారావు పరిపాలనపై మంచి అవగాహన కలిగిన వారని తెలిపారు. ఆయన సలహాలు, అనుభవాలు ప్రభుత్వానికి అవసరమన్నారు. విజయరామారావు నిన్ననే టీడీపీ పార్టీకి రాజీనామా చేయ‌గా ఆయనను బుజ్జగించేందుకు టీడీపీ చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. మరోవైపు టీడీపీకి రాజీనామా చేసిన మాజీ మంత్రి విజయరామారావుకు చంద్రబాబు నాయుడు స్వయంగా శనివారం ఫోన్ చేశారు. పార్టీ మారడంపై తొందరపడవద్దని చంద్రబాబు ఈ సందర్భంగా ఆయనకు సూచించారు. అయితే ఆలోచించి తన నిర్ణయం చెబుతానని విజయరామారావు చెప్పినట్లు సమాచారం.. మ‌రో రెండ్రోజుల్లో విజయరామారావు టీఆర్ఎస్ పార్టీలో చేరే అవకాశముందని స‌మ‌చారం.

ఇదిలాఉండ‌గా కేటీఆర్ త‌న‌ తండ్రి ఆలోచ‌న‌ల‌కు త‌గ్గ‌ట్లు రాజకీయంగా చురుగ్గా ముందుకువెళుతున్నార‌ని టీఆర్ఎస్ నాయ‌కులు చెప్తున్నారు. గ్రేట‌ర్ ఎన్నిక‌లు గులాబీ పార్టీకి అత్యంత ముఖ్య‌మైన‌విగా మారిన నేప‌థ్యంలో... పార్టీ అధిష్టానం క్రియాశీలంగా పావులు క‌దుపుతోంద‌ని వారు వివ‌రించారు.
Tags:    

Similar News