కేటీఆర్ అభిమానం, అధికారం రెండూ నాగ్ పైనే
సినిమా నటులంటే చాలామందికి అభిమానం ఉంటుంది... ఎంత ప్రముఖులైనా, రాజకీయ నేతలైనా... తమతమ పనుల్లో ఎంత బిజీగా ఉన్నా కూడా అభిమాన నటుల సినిమాలు చూస్తుంటారు కొందరు. ఇక ఆ ప్రముఖులు - నేతలు యువకులైతే సహజంగానే వారిలో క్రీడలు - సినిమాలపై ఆసక్తి ఉంటుంది. తెలంగాణ యంగ్ అండ్ ఎనర్జటిక్ మినిస్టర్ కేటీఆర్ కూడా ఆ కోవలోకే వస్తారు. వీలు దొరికినప్పుడంతా ఫ్యామిలీతో కలిసి సినిమా చూస్తారు. అది చాలదన్నట్లుగా సినీ ఇండస్ర్టీలో పరిచయమున్న హీరోలు ఎవరైనా తనను కలిసి తమ సినిమా చూడాలని కోరితే ఓకే అని చూస్తారు. మరి ఆయనకు ఇష్టమైన నటుడెవరో తెలుసా...? ఇంకెవరు 50 ప్లస్ లోనూ హిట్లు కొడుతున్న ఎనర్జటిక్ హీరో నాగార్జున అంటే కేటీఆర్ కు అభిమానట. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా తెలిపారు. ఇటీవల గ్రేటర్ ఎన్నికల్లో తిరుగులేని విజయంతో పొలిటికల్ హీరోగా నిలిచిన కేటీఆర్ ఈ సినీ హీరోకు అభిమానినని చెబుతున్నారు.
ఉప్పల్ లో ఆదివారం జరిగిన సీసీఎల్ క్రికెట్ టోర్నీ ఫైనల్ మ్యాచ్ ను మంత్రి కేటీఆర్ చూశారు. అక్కడ హీరోలు నాగార్జున, వెంకటేశ్ ల మధ్య కూర్చుని ఆట చూశారు. ఆ తరువాత మీడియా అయన్ను కలిసి మాట్లాడితే తన సినీ అభిమానాల సంగతి చెప్పుకొచ్చారు. తన చిన్నతనం నుంచి నాగార్జున అంటే చాలా ఇష్టమని.. ఆయనకు తాను చాలా పెద్ద ఫ్యాన్ గా చెప్పుకున్నారు. ఇప్పటికి తాను నాగ్ సినిమాలు చూస్తుంటానని.. వెంకటేశ్ ను కూడా బాగా అభిమానిస్తానని చెప్పారు.
అయితే... తమ్ముడు తమ్ముడు పేకాట పేకాటే అన్నట్లుగా కేటీఆర్ గతంలో తన అభిమాన హీరో నాగార్జునకు మాత్రం గట్టి ఝలక్ ఇచ్చారు. ఆయన అన్నపూర్ణ భూములు ఆక్రమణలంటూ స్ట్రాంగ్ డోస్ ఇచ్చారు. మరి ఇప్పుడు సయోధ్య కుదిరిందో లేదంటే అభిమానం, అధికారం రెండూ నాగార్జునపైనే చూపిస్తారో చూడాలి.