కేసీఆర్ కే కోటి అప్పిచ్చిన కేటీఆర్..లెక్కలివే..

Update: 2018-11-20 08:22 GMT
ఎన్నికల నామినేషన్ సందర్భంగా ప్రతి అభ్యర్థి ఆస్తులను ప్రకటించాల్సి ఉంటుంది. అలా, కేటీఆర్ ఆస్తులను అఫిడవిట్ లో ప్రకటించారు. దాని ప్రకారం ఆయన ఆస్తుల విలువ స్పల్పంగానే పెరిగినా, భార్య శైలిమ ఆస్తులు బాగానే పరిగాయి.

2014లో కేటీఆర్ చరాస్తుల విలువ రూ.2.97 కోట్లు కాగా -  2018లో రూ.3.63 కోట్లుగా ఉన్నట్లు అఫిడవిట్లో పేర్కొన్నారు. అదే ఆయన భార్య శైలిమ చరాస్తులు రూ.2.05 కోట్లు ఉండగా 2018 నాటికి రూ. 27.70 కోట్లకు పెరిగాయి.  పెట్టుబడుల వాటాలోనూ మార్పులు చోటుచేసుకున్నాయి. 2014లొ  ఆమె పెట్టుబడుల వాటా 74.65 లక్షలు ఉండగా అవి రూ.8.98 కోట్లుగా పేర్కొన్నారు. ఇందులో తెలంగాణ పబ్లికేషన్ ప్రైవేట్ లిమిటెడ్ లో  రూ.18.07 కోట్లు ఉన్నాయి. ఇందులో కేసీఆర్ పెట్టుబడులు చాలా తక్కువ.  కేటీఆర్ స్థిరాస్తుల విలువ రూ.1.30 కోట్లు కాగా శైలిమ స్థిరాస్తుల విలువ రూ.8.98 కోట్లు. కాగా కేసీఆర్ కు కోటి రూపాయలకు అప్పు ఇచ్చినట్టు కేటీఆర్ తన అఫిడవిట్ లో చూపించడం విశేషం. అంటే కేసీఆర్ కే అప్పచ్చిన కేటీఆర్ అంటూ సోషల్ మీడియాలో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. కారు గుర్తు అధిపతి అయిన కేసీఆర్ అస్సలు కారు లేదని అఫిడవిట్ లో పేర్కొనగా.. కేటీఆర్ కు మాత్రం ఒక ఇన్నోవా కారు ఉందని అపిడవిట్ లో పేర్కొన్నారు.   

కేటీఆర్ ఆస్తుల విలువలో పెద్దగా మార్పులేకపోగా - ఆయన భార్య ఆస్తుల విలువలో మార్పులు చోటుచేసుకోవడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి.  ఈ సారి ఎన్నికల ఖర్చు ఎక్కువగానే ఉండవచ్చని భావిస్తున్నారు. ఆ మేరకు ఎన్నికల కమిషన్ నిఘా వేసి ఉంచింది.
Tags:    

Similar News