కాపీ..క‌ట్..పేస్ట్ శుభాకాంక్ష‌లు చెప్పిన కేటీఆర్

Update: 2019-04-20 10:56 GMT
చంద్ర‌బాబు పేరు ఎత్తితే చాలు.. విరుచుకుప‌డేందుకు సిద్ధంగా ఉండే నేత‌ల్లో టీఆర్ఎస్ వ‌ర్కింగ్  ప్రెసిడెంట్ కేటీఆర్ ముందుంటారు. త‌న తండ్రికి ఒక‌ప్ప‌టికి గురువు.. త‌న‌కంటే ఎంతో సీనియ‌ర్ అయిన బాబును ఉద్దేశించి ఎంత సురుకు పుట్టేలా మాట్లాడ‌తారో ప్ర‌త్యేకించి చెప్పాల్సిన అవ‌స‌ర‌మే లేదు. బాబుపై విమ‌ర్శ‌లు చేయాల్సి వ‌స్తే.. రెట్టించిన ఉత్సాహాన్ని ప్ర‌ద‌ర్శించే కేటీఆర్.. ఈ రోజు బాబు జ‌న్మ‌దినోత్స‌వాన్ని పుర‌స్క‌రించుకొని ఆయ‌న‌కు ట్విట్ట‌ర్ లో బ‌ర్త్ డే విషెస్ ను ట్వీట్ రూపంలో చెప్పారు.

బాబుపై అదే ప‌నిగా విమ‌ర్శ‌లు చేస్తూ.. అవ‌కాశం వ‌చ్చిన ప్ర‌తిసారీ నిర్మోహ‌మాటంగా మాట‌ల‌తో చీల్చి చెండాడే కేటీఆర్.. పుట్టిన‌రోజు సంద‌ర్భంగా ట‌చ్చింగ్ విషెస్ పెట్టారు. 70వ సంవ‌త్స‌రంలోకి అడుగు పెట్టిన సంద‌ర్భాన్ని ప్ర‌స్తావిస్తూ.. ‘చంద్రబాబు గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు. మీకు ప్రశాంతమైన, ఆరోగ్యకరమైన జీవితాన్ని ప్రసాదించాలని భగవంతుడిని కోరుతున్నా. సమాజ సేవలో మీరు మరెన్నో సంవత్సరాలు గడపాలని ఆకాంక్షిస్తున్నా స‌ర్’ అంటూ ట్వీట్ చేశారు. అబ్బా.. ఎంత బాగా విషెస్ చెప్పారో అనుకున్నంత‌నే కేటీఆర్ తెలంగాణ రాష్ట్ర మంత్రి కొప్పుల ఈశ్వ‌ర్ పుట్టిన రోజు కూడా ఈ రోజే కావ‌టంతో ఆయ‌న‌కు విషెస్ చెప్పారు. బాబుకు.. కొప్పుల ఈశ్వ‌ర్ కు రెండు లైన్ల‌లో విషెస్ చెప్పిన కేటీఆర్.. మొద‌టి లైన్ను ఇద్ద‌రికి వేర్వేరుగా పెట్టిన‌ప్ప‌టికీ.. రెండో పేరాలో మాత్రం అటు ఇటుగా ఒకేలాంటి విషెస్ పెట్ట‌టం విశేషం. కాకుంటే బాబుకు స‌ర్ అని చివ‌ర్లో యాడ్ చేస్తే..కొప్పుల ఈశ్వ‌ర్ కు  పెట్టిన విషెస్ లో మాత్రం స‌ర్ ను అన్న ప‌దాన్ని తీసేశారు.

ఈ రెండు ట్వీట్ల‌ను జాగ్ర‌త్త‌గా గ‌మ‌నిస్తే.. కాపీ.. క‌ట్.. పేస్ట్ మాదిరి త‌న విషెస్ ను కేటీఆర్ చెప్పార‌నుకోవాలి. ఒకేలాంటి ట్వీట్ల‌నుఇద్ద‌రికి పెట్టేయ‌టం ఇప్పుడు అంద‌రి దృష్టిని ఆక‌ర్షిస్తోంది.

బాబుకు పెట్టిన ట్వీట్ ఇదే..

Many returns of the day to Hon'ble CM AP Sri @ncbn Garu on his birthday

May you be blessed with a long, healthy & peaceful life and many more years in public service sir

మంత్రి కొప్పుల ఈశ్వ‌ర్ కు పెట్టిన ట్వీట్ ఇదే..  

Wholehearted Wishes to Hon'ble Minister for SC, ST, Minority and BC Development Minister Sri Koppula Eeshwar Garu on his Birthday

May you be blessed with many more years of peace, happiness, health and a long life in public service
Tags:    

Similar News