యంగ్ కేటీఆర్.. ఎలా ఉండేవారో తెలుసా?

Update: 2018-08-12 07:10 GMT
ఇప్పుడంటే కేటీఆర్ తెలంగాణ ఐటీ - పరిశ్రమ శాఖ మంత్రి.. సీఎం కేసీఆర్ కొడుకు.. ఆ గౌరవ మర్యాదలు ఎలాగూ ఉంటాయి. కానీ 16 ఏళ్ల కిందటి కేటీఆర్ ఎలా ఉండేవాడు.. ఏం చేసేవాడు అనే ఆసక్తి అందరిలోనూ ఉంటుంది... ఆయన అలవాట్లు - అభిరుచులు అన్నీ ఓ సాధారణ యువకుడిలానే ఉండేవని ఒక్క ఫొటోతో మనకు చూపించాడు. ఆ నాటి కుర్ర కేటీఆర్ ఇంత స్మార్ట్ గా ఉండేవాడా అని అందరూ ముక్కున వేలేసుకుంటున్నారు. సినిమాల్లోకి వస్తే ఓ హీరో అయిపోయేవాడు అని కొందరు కామెంట్లు పెడుతున్నారు.  ఏదీ ఏమైనా మన 16 ఏళ్ల కిందటి కేటీఆర్.. ఇదిగో ఇలా ఉండేవాడని తాజాగా ఆయన ఒక ఫొటోను తన ట్విట్టర్ ఖాతాలో పోస్టు చేశాడు.

కేటీఆర్  డిగ్రీ పూర్తయ్యాక అమెరికాలోని న్యూయార్క్ లో ఉన్న సిటీ యూనివర్సిటీ ఆఫ్ న్యూయార్క్ (సీయూఎన్ వై)లో ఎంబీఏ మార్కెటింగ్  - ఈ-కామర్స్ చదివాడు. 2000 సంవత్సరంలో యూనివర్సిటీలో చేరాడు. ఆ తర్వాత న్యూయార్క్ మాడిసన్ లో ఉన్న ఓషియన్ లాజిస్టిక్ షిప్పింగ్ కంపెనీలో ఉద్యోగం చేశాడు.  2002 అక్టోబర్ 26న కేటీఆర్ అమెరికాలో  దిగిన ఓ ఫొటోను తాజాగా  షేర్ చేశాడు. ఇప్పుడది వైరల్ గా మారింది. కేటీఆర్ అభిమానులు - ఇతర ప్రముఖులు కుర్ర కేటీఆర్ పై కామెంట్లు చేస్తున్నారు.. విపరీతంగా షేర్ చేస్తున్నారు.
Tags:    

Similar News